Punugu Pilli: పులివెందులలో కనిపించిన అరుదైన పునుగుపిల్లి..దీని ప్రత్యేకత ఏంటో తెలిస్తే..
కడప జిల్లా పులివెందులలో అరుదైన పునుగుపిల్లి కనిపించడం సంచలనం సృష్టించింది. తిరుమల శ్రీవారికి జరిగే తైలాభిషేకానికి ఈ పునుగుపిల్లి తైలమే వాడతారని ప్రతీతి. నల్లమల అటవీ ప్రాంతానికే పరిమితమైన ఈ అరుదైన జీవి, రైతు ఏర్పాటు చేసిన బోనులో పడింది. దీనిని అటవీ అధికారులకు అప్పగించగా, పునుగుపిల్లి సంరక్షణపై ఆశలు రేకెత్తుతున్నాయి.

మనకు నిత్యం ఇంటిదగ్గర పిల్లులు అనేకం కనబడుతూ ఉంటాయి. వాటిలో తెల్లవి, నల్ల పిల్లులు అనేకం ఉంటాయి. కానీ, అటవీ ప్రాంతంలో మాత్రమే ఉండే పునుగుపిల్లి చాలా అరుదైనది. దీని నుంచి వచ్చే తైలం స్వయంగా శ్రీవారి సన్నిధిలో తైలాభిషేకానికి వాడుతుంటారని అంటారు. అలాంటి పునుగుపిల్లి సాధారణంగా తిరుమల పరిసర ప్రాంతాలలోని నల్లమల అటవీ ప్రాంతంలో కనబడుతూ ఉంటుంది. అయితే, ఇప్పుడు అది కడప జిల్లా పులివెందుల ప్రాంతంలోని అటవీ ప్రాంతంలో కనిపించింది.
తిరుమల వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ప్రతి శనివారం తైలాభిషేకానికి ఉపయోగించే తైలం పునుగుపిల్లి తైలం. ఈ పునుగుపిల్లి తైలానికి తిరుమలలో ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఇప్పటికే టీటీడీ కూడా పునుగు పిల్లుల కోసం ప్రత్యేక ఏర్పాట్లను చేసింది. అయితే, అనూహ్యంగా పులివెందులలో పునుగుపిల్లి దర్శనమిచ్చింది. పునుగుపిల్లి ఎర్రచందనం చెట్టుకు తన శరీరాన్ని రుద్దడం ద్వారా వచ్చే తైలం చాలా ప్రసిద్దమైనది.
వీడియో ఇక్కడ చూడండి…
అయితే, ఈ పునుగు పిల్లి.. పులివెందులలోని స్థానిక చిన్న రంగాపురం గ్రామంలో విశ్వనాథరెడ్డి అనే రైతు పొలంలోని బోనులో పడింది. విశ్వనాధరెడ్డి తన ఇంటి వద్దనున్న ఖాళీ ప్రదేశంలో కోళ్ళ పెంపకం చేస్తున్న ప్రదేశంలో గత కొద్దిరోజులుగా కోడి పిల్లల కోసం ముంగిసలు పాములు రావడాన్ని గమనించిన రైతు విశ్వనాథ్ రెడ్డి పాములు, ముంగిసల కోసం ప్రత్యేక బోనులు ఏర్పాటు చేశాడు. అయితే ఆ బోనులో అనూహ్యంగా పునుగు పిల్లి ఉండడాన్ని గమనించిన విశ్వనాథరెడ్డి పులివెందుల ఫారెస్ట్ అధికారి గోపాలకృష్ణయ్యకు పునుగు పిల్లిని అందజేశాడు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..




