AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: “వా.. ఏం ఆ రాజసం”.. శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌లో స్విమ్మింగ్ చేస్తూ కనిపించిన పెద్దపులి!

ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలంలో ఆశ్చర్యకర సంఘటన వెలుగు చూసింది. శ్రీశైలం బ్యాక్ వాటర్‌లో పెద్దపులి స్విమ్మింగ్ చేస్తూ కనిపించింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాని కుదిపేస్తున్నాయి. రాజసం ఉట్టిపడేలా పెద్దపులి నీటిలో వెళ్తున్న దృశ్యాలు ఔరా అనిపిస్తున్నాయి. మరోవైపు పెద్దపులి జాడ కోసం గాలింపు చర్యలు మొదలయ్యాయి. పాదముద్రల ఆధారంగా ఆ పెద్దపులి ఇంకా అడవిలోకి వెళ్లలేదని అటవీశాఖ అధికారులు చెప్తున్నారు.

Viral Video: వా.. ఏం ఆ రాజసం.. శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌లో స్విమ్మింగ్ చేస్తూ కనిపించిన పెద్దపులి!
Srisailam Tiger Swimming Krishna River Backwaters
J Y Nagi Reddy
| Edited By: |

Updated on: Dec 26, 2025 | 11:48 AM

Share

ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలంలో ఆశ్చర్యకర సంఘటన వెలుగు చూసింది. శ్రీశైలం బ్యాక్ వాటర్‌లో పెద్దపులి స్విమ్మింగ్ చేస్తూ కనిపించింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాని కుదిపేస్తున్నాయి. రాజసం ఉట్టిపడేలా పెద్దపులి నీటిలో వెళ్తున్న దృశ్యాలు ఔరా అనిపిస్తున్నాయి. శ్రీశైలం ప్రాజెక్ట్‌ బ్యాక్‌ వాటర్‌లో ఏపీ వైపున నుంచి తెలంగాణ రాష్ట్రానికి చేరాలంటే కృష్ణా నదిలో సుమారు 2 కిలోమీటర్లు పడవ ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఈ మార్గంలో స్థానికుల రాకపోకలు తరచూ సాగుతుండగా, ఇదే మార్గం గుండా కృష్ణా నదిలో పెద్దపులులు కూడా అలవోకగా కృష్ణా నదిలో రెండు కిలోమీటర్లు ఈదుకుంటూ రాష్ట్రాల మధ్య సంచరిస్తున్నాయన్నది ఆందోళనకు గురిచేస్తోంది.

నాగార్జునసాగర్–శ్రీశైలం టైగర్‌ రిజర్వ్‌ నుంచి అమ్రాబాద్‌ అభయారణ్యానికి పెద్దపులులు జలమార్గం ద్వారా సులభంగా రాకపోకలు చేస్తుండటం గమనార్హం. వారం రోజుల క్రితం ఆత్మకూరు డివిజన్‌లోని సంగమేశ్వరం సమీపంలో ‘టీ-65’ అనే పులి నదిలో ఈదుతూ అమ్రాబాద్‌ వైపు చేరింది. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అయితే అది నేరుగా అడవిలోకి కాకుండా కొల్లాపూర్ మండలంలోని పంట పొలాల్లో సంచరిస్తున్నట్లు పెద్దపులి పాద ముద్రిక గల ద్వారా అటవీ శాఖ గుర్తించింది. ఈ నేపథ్యంలో స్థానికులు, మత్స్యకారులు రైతులు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు సూచించారు. పులి కదలికలపై నిఘా ఏర్పాటు చేసినట్లు ఆత్మకూరు డిప్యూటీ డైరెక్టర్‌ విగ్నేష్‌ అపావ్‌ వెల్లడించారు.పులి సురక్షితంగా అడవిలోకి తిరిగి చేరే వరకు పర్యవేక్షణ కొనసాగుతుందని తెలిపారు.

వీడియో చూడండి..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌లో స్విమ్మింగ్ చేస్తూ కనిపించిన పెద్దపులి!
శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌లో స్విమ్మింగ్ చేస్తూ కనిపించిన పెద్దపులి!
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
పులివెందులలో కనిపించిన అరుదైన పునుగుపిల్లి! దీని ప్రత్యేకత ఏంటంటే
పులివెందులలో కనిపించిన అరుదైన పునుగుపిల్లి! దీని ప్రత్యేకత ఏంటంటే
గుడ్‌న్యూస్‌..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
గుడ్‌న్యూస్‌..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్‌ ఇస్తారు వీడియో
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్‌ ఇస్తారు వీడియో
భక్తితో గుడికెళ్లారనుకుంటే.. ఈ భార్యాభర్తలు ఏకంగా దేవుడికే..
భక్తితో గుడికెళ్లారనుకుంటే.. ఈ భార్యాభర్తలు ఏకంగా దేవుడికే..
2025లో ఆంధ్రప్రదేశ్‌ను తీవ్ర విషాదంలోకి నెట్టిన ఘోర ప్రమాదాలు ఇవే
2025లో ఆంధ్రప్రదేశ్‌ను తీవ్ర విషాదంలోకి నెట్టిన ఘోర ప్రమాదాలు ఇవే
29 బంతుల్లోనే హాఫ్ సెంచరీ..ఫోర్లు, సిక్సర్లతోనే 50 కొట్టిన కోహ్లీ
29 బంతుల్లోనే హాఫ్ సెంచరీ..ఫోర్లు, సిక్సర్లతోనే 50 కొట్టిన కోహ్లీ
ఎంతకు తెగించార్రా.. 'అమ్మ' పేరుతో మంచి మనిషిని మోసం చేశారు కదరా!
ఎంతకు తెగించార్రా.. 'అమ్మ' పేరుతో మంచి మనిషిని మోసం చేశారు కదరా!
దేశ ప్రజలకు శుభవార్త.. తక్కువ ధరకే సేవలు.. జనవరి 1 నుంచే అమల్లోకి
దేశ ప్రజలకు శుభవార్త.. తక్కువ ధరకే సేవలు.. జనవరి 1 నుంచే అమల్లోకి