AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఓరేయ్.. ఎవర్రా మీరంతా.. ఒక్క ఓవర్‌తోనే గబ్బు పట్టించారుగా.. ప్రపంచ క్రికెట్‌లోనే చెత్త బౌలర్లు వీరే

Unwanted Cricket Records Most Balls: క్రికెట్ చరిత్రలో ఒకే ఓవర్లో అత్యధిక బంతులు వేసిన ఐదుగురు బౌలర్ల గురించి తెలిస్తే కచ్చితంగా షాక్ అవుతారంతే.. ఎందుకంటే, ఈ బౌలర్లు తమ ఓవర్లలో వైడ్స్, నో బాల్స్ ఎక్కువగా వేసి, సుధీర్ఘ ఓవర్‌తో చెత్త రికార్డ్ సృష్టించారన్నమాట. ఈ లిస్ట్‌లో పాకిస్తాన్ బౌలర్ కూడా ఉన్నాడు.

ఓరేయ్.. ఎవర్రా మీరంతా.. ఒక్క ఓవర్‌తోనే గబ్బు పట్టించారుగా.. ప్రపంచ క్రికెట్‌లోనే చెత్త బౌలర్లు వీరే
Unique Cricket Records
Venkata Chari
|

Updated on: Apr 25, 2025 | 10:59 AM

Share

Top 5 Bowlers Most Balls In One Over: క్రికెట్‌లో బ్యాటర్లు, బౌలర్లు రాణించాలని కోరుకుంటుంటారు. బ్యాటర్లు తుఫాన్ ఇన్నింగ్స్‌లతో సత్తా చాటాలని కోరుకుంటుండగా.. బౌలర్లు మాత్రం తక్కువ పరుగులు ఇచ్చి ఎక్కువ వికెట్లు తీయాలని చూస్తుంటారు. కానీ, కొన్నిసార్లు విఫలమవుతుంటారు. లక్ లేకపోవడంతో ఎన్ని మ్యాచ్‌లు ఆడిన సత్తా చాటాలేక జట్టు నుంచి దూరం అవుతుంటారు. ఎంతో దూకుడుగా కెరీర్ ఆరంభించి, నిరుత్సాహంగా కెరీర్ ముగించిన ప్లేయర్లు చాలామందే ఉన్నారు. అంతర్జాతీయ స్థాయిలో ఒకే ఓవర్‌లో అత్యధిక బంతులు వేసిన బౌలర్లు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ అవాంఛనీయ రికార్డు సృష్టించిన ఐదుగురు బౌలర్లను ఓసారి చూద్దాం..

  1. బెర్ట్ వాన్స్: ఈ జాబితాలో న్యూజిలాండ్ మాజీ స్పిన్నర్ బెర్ట్ వాన్స్ పేరు మొదటి స్థానంలో ఉంది. 1990 ఫిబ్రవరి 20న కాంటర్‌బరీతో జరిగిన మ్యాచ్‌లో బెర్ట్ వాన్స్ 1 ఓవర్‌లో 22 బంతులు వేశాడు.
  2. మొహమ్మద్ సమీ: ఈ జాబితాలో పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సమీ పేరు రెండవ స్థానంలో ఉంది. బంగ్లాదేశ్‌పై మహ్మద్ సమీ 1 ఓవర్‌లో 17 బంతులు బౌలింగ్ చేశాడు. 2004లో మహ్మద్ సమీ ఈ చెత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఈ ఓవర్లో సమీ 7 వైడ్లు, 4 నో బాల్స్ వేశాడు.
  3. కర్ట్లీ ఆంబ్రోస్: ఈ జాబితాలో వెస్టిండీస్ బౌలర్ కర్ట్లీ ఆంబ్రోస్ మూడవ స్థానంలో చేరాడు. కర్ట్లీ 1 ఓవర్లో 15 బంతులు వేశాడు. 1997 లో ఆస్ట్రేలియాతో ఆడుతున్న సమయంలో కర్ట్లీ ఈ చెత్త రికార్డును తన పేరు మీద లిఖించుకున్నాడు. ఈ ఓవర్లో కర్ట్లీ ఆంబ్రోస్ 9 నో బాల్స్ వేశాడు.
  4. డారెల్ టఫీ: న్యూజిలాండ్‌కు చెందిన డారిల్ టఫీ నాల్గవ స్థానంలో ఉన్నాడు. 2005లో ఆస్ట్రేలియాతో ఆడుతున్నప్పుడు డారిల్ టఫీ ఒకే ఓవర్‌లో 14 బంతులు వేశాడు. ఈ ఓవర్‌లో డారిల్ టఫీ 4 వైడ్‌లు, 4 నో బాల్స్ వేశాడు.
  5. ఇవి కూడా చదవండి
  6. స్కాట్ బోస్వెల్: ఈ జాబితాలో ఇంగ్లాండ్ మాజీ ఫాస్ట్ బౌలర్ స్కాట్ బోస్‌వెల్ చివరి స్థానంలో నిలిచాడు. 2001లో జరిగిన C&G ట్రోఫీలో స్కాట్ 1 ఓవర్‌లో 14 బంతులు వేశాడు.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..