IPL 2025: సొంత గడ్డపై తొడగొట్టిన కింగ్ కోహ్లీ.. కట్‌చేస్తే.. బాబర్ ఆజాం స్పెషల్ రికార్డ్‌నే షేక్ చేశాడుగా..
Virat Kohli Breaks 3 IPL Records RCB vs RR: ఐపీఎల్ 2025లో ఆర్‌సీబీతో రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ అద్భుతమైన 70 పరుగుల ఇన్నింగ్స్‌తో 3 కీలక రికార్డులు సృష్టించాడు. మొదట బ్యాటింగ్ చేస్తూ అత్యధిక 50+ స్కోర్లతోపాటు అనేక రికార్డులు తన ఖాతాలో చేరాయి. ఈ మ్యాచ్‌లో కోహ్లీ ప్రదర్శన ఆర్‌సీబీకి కీలకమైంది.

Virat Kohli 70 Runs IPL 2025 RCB Match Records: ఐపీఎల్ (IPL) 2025లో భాగంగా 42వ మ్యాచ్‌లో, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ జట్లు గురువారం తలపడ్డాయి. ఈ మ్యాచ్ ఆర్‌సీబీ సొంత మైదానం ఎం చిన్నస్వామి స్టేడియంలో జరిగింది. ఈ సీజన్‌లో బెంగళూరు జట్టు సొంత మైదానంలో తొలి విజయం సాధించింది. ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 11 పరుగులతో తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన విరాట్ కోహ్లీ ఆర్‌సీబీ తరపున అద్భుతంగా బ్యాటింగ్ చేసి 42 బంతుల్లో 70 పరుగులు చేశాడు.
తన ఇన్నింగ్స్‌లో కింగ్ కోహ్లీ 8 ఫోర్లు, 2 సిక్సర్లు బాదాడు. ఐపీఎల్ 2025లో కోహ్లీ బ్యాట్ నుంచి ఇది ఐదవ హాఫ్ సెంచరీ ఇన్నింగ్స్ ఆడాడు. ఈ ఇన్నింగ్స్‌లో కోహ్లీ అనేక భారీ రికార్డులను కూడా సృష్టించాడు. RCB vs RR మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ చేసిన 3 రికార్డుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
3. టీ20లో అత్యధికంగా 50+ స్కోర్..
ముందుగా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో 36 ఏళ్ల విరాట్ కోహ్లీ టీ20 క్రికెట్‌లో యాభైకి పైగా స్కోర్లు 62 సార్లు సాధించాడు. దీంతో టీ20 ఫార్మాట్‌లో ముందుగా బ్యాటింగ్ చేస్తూ అత్యధిక యాభైకి పైగా స్కోర్లు చేసిన తొలి బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. కోహ్లీ 214వ ఇన్నింగ్స్‌లో ఈ ఘనత సాధించాడు. అంతకుముందు ఈ రికార్డు పాకిస్తాన్ లెజెండ్ బాబర్ ఆజం పేరిట నమోదైంది. బాబర్ 159 ఇన్నింగ్స్‌లలో 61 సార్లు యాభైకి పైగా స్కోర్లు చేశాడు.
2. టీ20 క్రికెట్‌లో అత్యధికంగా 50+ స్కోర్లు చేసిన 2వ బ్యాట్స్‌మన్‌గా..
ఈ అద్భుతమైన ఇన్నింగ్స్ సహాయంతో, విరాట్ కోహ్లీ ఇప్పుడు టీ20 ఫార్మాట్‌లో అత్యధిక సార్లు 50+ స్కోర్లు చేసిన రెండవ బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. వెస్టిండీస్ మాజీ గ్రేట్ బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్‌ను కోహ్లీ అధిగమించాడు. కోహ్లీ 111 సార్లు 50+ స్కోర్లు సాధించాడు. కాగా, గేల్ ఈ ఘనతను 110 సార్లు చేశాడు.
1. టీ20 ఫార్మాట్‌లో ఒకే వేదికపై అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మన్‌గా..
విరాట్ కోహ్లీ ఆధిపత్యం వన్డేలు, టెస్టుల్లోనే కాదు, టీ20 క్రికెట్‌లో కూడా ఉంది. ఆర్‌సీబీ మాజీ కెప్టెన్ ఇప్పుడు టీ20 క్రికెట్‌లో ఒక వేదికపై 3500 పరుగులు సాధించిన తొలి బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. ఎం చిన్నస్వామి స్టేడియంలో కోహ్లీ 3500 పరుగులు సాధించాడు. కోహ్లీ తన 105వ ఇన్నింగ్స్‌లో ఈ రికార్డును నమోదు చేశాడు.
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








