AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

EPF0 New Rules: పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి బిగ్ రిలీఫ్.. అమల్లోకి కొత్త రూల్స్.. భారీ మార్పులు ఇవే..

పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. పీఎఫ్ 3.0 పేరుతో కొత్త రూల్స్‌ను అమల్లోకి తెచ్చింది. పీఎఫ్ బ్యాలెన్స్ విత్ డ్రా విషయంలో అనేక వెసులుబాటు కల్పిస్తోంది. గతంలో ఉన్న కఠిన నిబంధనలు ఇప్పుడు తొలగించి విత్ డ్రాలు మరింత సులభతరం చేసింది.

EPF0 New Rules: పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి బిగ్ రిలీఫ్.. అమల్లోకి కొత్త రూల్స్.. భారీ మార్పులు ఇవే..
Epfo 2
Venkatrao Lella
|

Updated on: Dec 26, 2025 | 11:56 AM

Share

పీఎఫ్ ఖాతాదారులకు ఈ ఏడాది ఒక వరమనే చెప్పుకోవచ్చు. దీని విషయంలో కేంద్ర ప్రభుత్వం 2025లో అనేక చరిత్రాత్మక మార్పులు తీసుకొచ్చింది. పీఎఫ్ అకౌంట్లోని సొమ్మును సులువుగా విత్ డ్రా చేసుకోవడంతో పాటు గతంలో వీటిపై ఉన్న లిమిట్స్‌ను కూడా సవరించింది. దీంతో పీఎఫ్ డబ్బులు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఏటీఎం కార్డులు, యూపీఐ ద్వారా తీసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రక్రియ కొనసాగుతోండగా.. వచ్చే ఆర్ధిక సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి తీసుకురానుందని తెలుస్తోంది. పీఎఫ్‌కి సంబంధించి కొత్తగా కేంద్రం చేసిన మార్పులేంటో ఇక్కడ చూద్దాం.

విత్ డ్రాలపై లిమిట్ ఎత్తివేత

గతంలో ఉద్యోగం మానేసిన ఒక నెల తర్వాత పీఎఫ్ బ్యాలెన్స్‌లోని 75 శాతం సొమ్మును తీసుకునే అవకాశం ఉండేది. ఇక మిగిలిన 25 శాతం నగదును తీసుకోవలంటే 2 నెలల వరకు ఆగాల్సి వచ్చేది. ఇక గతంలో ఉద్యోగం మానేసిన 2 నెలల తర్వాతే పెన్షన్ మనీ తీసుకునే వెసులుబాటు ఉండేది. కానీ ఇప్పుడు ఉద్యోగం మానేసిన వెంటనే పీఎఫ్ బ్యాలెన్స్‌లోని 75 శాతం సొమ్మును తీసుకోవచ్చు. ఇక 12 నెలల తర్వాత మిగతా మొత్తం విత్ డ్రా చేయొచ్చు.

పెన్షన్ విషయంలో మార్పులు

గతంలో ఉద్యోగం మానేసిన 2 నెలల తర్వాతనే పెన్షన్ మొత్తాన్ని తీసుకునే అవకాశం ఉండేది. ఇప్పుడు 3 సంవత్సరాల తర్వాత మొత్తాన్ని తీసుకునే విధానం అమల్లోకి తెచ్చారు. పదవీ విరమణ ఆదాయం ముందస్తు తగ్గిపోకుండా పెన్షన్ ప్రయోజనాలను కాపాడటం కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు.

కంపెనీ మూసివేస్తే.

గతంలో కంపెనీ మూసివేసినా లేదా ఉద్యోగం నుంచి తొలగించినా ఉద్యోగి వాటా మొత్తం వాటా తీసుకునే వెసులుబాటు ఉంది. ఇప్పుడు బ్యాలెన్స్ మొత్తంలో వెంటనే 75 శాతం తీసుకోవచ్చు. మిగతా 25 శాతం ఉంచాల్సి వస్తుంది.

ప్రకృతి వైపరీత్యాలు, అంటువ్యాధుల సమయంలో

ప్రకృతి వైపరీత్యాలు లేదా కరోనా మహమ్మారి వంటి అత్యవసర పరిస్థితుల సమయంలో 75 శాతం ఉపసంహరించుకోవచ్చు. అయితే ఇందుకు 12 నెలల సర్వీస్ కాలం పూర్తి చేసి ఉండాలి.

విద్య, వివాహ సమయంలో

గతంలో 7 ఏళ్ల పాటు సర్వీస్ పూర్తి చేసిన తర్వాత విద్యకు 3 సార్లు, పెళ్లి కోసం 2 సార్లు మాత్రమే విత్ డ్రా చేసుకునే సదుపాయం ఉండేది. ఇప్పుడు సర్వీస్‌లో ఉన్నప్పుడు విద్య కోసం 10 సార్లు, వివాహం కోసం 5 సార్లు పాక్షికంగా విత్ డ్రా చేసుకోవచ్చు.  గతంలో విద్య, వివాహం, ఇతర అవసరాల కోసం విత్ డ్రా చేసుకోవాలంటే సరైన ఆధారాలు చూపించాల్సి వచ్చేది. కానీా ఇప్పుడు ఎలాంటి డాక్యుమెంట్స్ సమర్పించాల్సిన అవసరం లేదు.

పీఎఫ్ ఖాతాదారులకు భారీ ఊరట.. కేంద్రం కొత్త రూల్స్ చూశారా..
పీఎఫ్ ఖాతాదారులకు భారీ ఊరట.. కేంద్రం కొత్త రూల్స్ చూశారా..
నానితో స్టెప్పులేయనున్న క్రేజీ హీరోయిన్..
నానితో స్టెప్పులేయనున్న క్రేజీ హీరోయిన్..
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్‌
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్‌
రాష్ట్రపతి చేతుల మీదుగా వైభవ్‎కు ప్రతిష్టాత్మక అవార్డు
రాష్ట్రపతి చేతుల మీదుగా వైభవ్‎కు ప్రతిష్టాత్మక అవార్డు
శ్రీకాంత్ కుమారుడి సినిమాకు మొదటి రోజు ఎన్ని కోట్లు వచ్చాయంటే?
శ్రీకాంత్ కుమారుడి సినిమాకు మొదటి రోజు ఎన్ని కోట్లు వచ్చాయంటే?
శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌లో స్విమ్మింగ్ చేస్తూ కనిపించిన పెద్దపులి!
శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌లో స్విమ్మింగ్ చేస్తూ కనిపించిన పెద్దపులి!
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
పులివెందులలో కనిపించిన అరుదైన పునుగుపిల్లి! దీని ప్రత్యేకత ఏంటంటే
పులివెందులలో కనిపించిన అరుదైన పునుగుపిల్లి! దీని ప్రత్యేకత ఏంటంటే
గుడ్‌న్యూస్‌..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
గుడ్‌న్యూస్‌..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్‌ ఇస్తారు వీడియో
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్‌ ఇస్తారు వీడియో