Miss Universe2021: మిస్ యూనివర్స్ కిరీటాన్ని దక్కించుకున్న మెక్సికన్ భామ.. ఆండ్రియా మెజా
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అందాల భామల్లో మిస్ యూనివర్స్ గా ఎవరు గెలుపొందుతారని అంతా ఆసక్తిగా ఎదురుచూసారు.
Miss Universe2021: ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అందాల భామల్లో మిస్ యూనివర్స్ గా ఎవరు గెలుపొందుతారో అని అంతా ఆసక్తిగా ఎదురుచూసారు. ఆ అదృష్టం మెక్సికన్ బ్యూటీ మిస్ మెక్సికో ఆండ్రియా మెజాను వరించింది. 73 మంది అందాల తారలు పోటీ పడగా ఆండ్రియా మెజా మిస్ యూనివర్స్ గా గెలుపొందింది. ఈ సంవత్సరం ఈ అందాల భామల పోటీ మయామి, ఫ్లోరిడాలోని సెమినోల్ హార్డ్ రాక్ హోటల్, క్యాసినో హాలీవుడ్‌లో జరిగింది. డిసెంబర్ 8, 2019 న మిస్ యూనివర్స్ కిరీటం గెలుచుకున్న దక్షిణాఫ్రికాకు చెందిన తొలి నల్లజాతి మహిళగా జోజిబిని తుంజీ నిలిచింది. కరోనా మహమ్మారి కారణంగా తర్వాత మిస్ యూనివర్స్ పోటీలు వాయిదా పడాయి.
ఇక ఈ సంవత్సరం మిస్ మెక్సికో 69 వ మిస్ యూనివర్స్‌గా కిరీటం పొందింది! మిస్ మెక్సికో ఆండ్రియా మెజా ప్రపంచవ్యాప్తంగా 73 ఇతర అందమైన మహిళలతో పోటీపడి టైటిల్ గెలుచుకుంది. మిస్ ఇండియా, మిస్ బ్రెజిల్, మిస్ పెరూ మరియు మిస్ డొమినికన్ రిపబ్లిక్ లతో పాటు ఆమె టాప్ 5 లో చోటు దక్కించుకుంది. అందంతోనే కాదు అద్భుతమైన సమాధానంతో హృదయాలను గెలుచుకుంది. వృత్తిరీత్యా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న ఆండ్రియా లింగ హింసకు వ్యతిరేకంగా వాదించింది. తన విజయంతో, మిస్ యూనివర్స్‌గా పట్టాభిషేకం చేసిన మూడవ మెక్సికన్ మహిళగా ఆండ్రియా నిలిచింది.
View this post on Instagram
మరిన్ని ఇక్కడ చదవండి :