Ravi Teja’s Khiladi: ఓటీటీ లో మాస్ మహారాజ్ రవితేజ ‘ఖిలాడి’ మూవీ .. క్లారిటీ ఇచ్చిన మేకర్స్
మాస్ మహారాజ్ రవితేజ నటిస్తున్న సినిమా ఖిలాడి. ఇటీవల క్రాక్ సినిమాతో ట్రాక్ లోకి వచ్చిన రవితేజ అదే జోష్ లో ఖిలాడి సినిమాను పూర్తి చేస్తున్నాడు.
Ravi Teja’s Khiladi: మాస్ మహారాజ్ రవితేజ నటిస్తున్న సినిమా ఖిలాడి. ఇటీవల క్రాక్ సినిమాతో ట్రాక్ లోకి వచ్చిన రవితేజ అదే జోష్ లో ఖిలాడి సినిమాను పూర్తి చేస్తున్నాడు. చాలా కాలంగా సైరైన సక్సెస్ లేక సతమతం అవుతున్న మాస్ రాజాకు దర్శకుడు గోపీచంద్ మలినేని సాలిడ్ సక్సెస్ ఇచ్చాడు. శృతిహాసన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటించి ఆకట్టుకున్నారు రవితేజ. ఇప్పుడు రమేష్ వర్మ దర్శకత్వంలో ఖిలాడి అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. షూటింగ్ చివరి దశకు చేరుకున్న సమయంలో కరోనా మహమ్మారి ఎంట్రీ ఇచ్చింది . సెకండ్ వేవ్ కారణంగా షూటింగ్ ను నిలిపివేశారు.
రాక్షసుడు సినిమాతో విజయం అందుకున్న రమేష్ వర్మ రవితేజ కోసం సస్పెన్స్ థ్రిల్లర్ ను సిద్ధం చేసాడు రవితేజ డ్యూయల్ రోల్ లో నటిస్తున్న రవితేజ ఖిలాడీపై.. ఇప్పటికే అంచనాలు భారీగా పెరిగాయి. ‘ఖిలాడి’ సినిమా ఓటీటీలోనే విడుదలకాబోతున్నట్లు వార్తలొచ్చాయి. ప్రముఖ ఓటీటీ సంస్థ ఈ సీమ స్ట్రీమింగ్ చేయనుందంటూ కొద్దిరోజులుగా వార్తలు చక్కర్లు కొట్టాయి. కోనేరు సత్యనారాయణ నిర్మిస్తున్నారు. ఓటీటీ వార్తలపై నిర్మాత మాట్లాడుతూ ‘ ‘ఖిలాడి’ సినిమా ఓటీటీలో విడుదలకానుందనే ప్రచారం పూర్తిగా అవాస్తవం. చక్కటి కథ, కథనం, సాంకేతిక ప్రమాణాలతో థియేటర్ ఎక్స్‌పీరియన్స్ కోసమే ఈ సినిమాను తీర్చిదిద్దుతున్నాం. థియేటర్లలోనే విడుదలచేస్తాం అని అన్నారు. మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.
మరిన్ని ఇక్కడ చదవండి :