Bellamkonda Ganesh: బెల్లంకొండ ఫ్యామిలీ నుంచి మరో హీరో.. హిందీ మూవీ రీమేక్ తో ఎంట్రీ ఇవ్వనున్న గణేష్..

బెల్లంకొండ ఇంటి నుంచి మరో హీరో టాలీవుడ్లోకి అడుగుపెట్టబోతున్నారు. బెల్లంకొండ సురేష్ చిన్నబ్బాయి బెల్లంకొండ గణేష్‌ అతి తొందర్లో ఓ హిందీ రిమేక్‌తో తెలుగు తెరకు హీరోగా పరిచయం కాబోతున్నారు.

Bellamkonda Ganesh: బెల్లంకొండ ఫ్యామిలీ నుంచి మరో హీరో.. హిందీ మూవీ రీమేక్ తో ఎంట్రీ ఇవ్వనున్న గణేష్..
Bellamkonda Ganesh Babu
Follow us
Rajeev Rayala

|

Updated on: May 16, 2021 | 7:00 PM

Bellamkonda Ganesh:

బెల్లంకొండ ఇంటి నుంచి మరో హీరో టాలీవుడ్లోకి అడుగుపెట్టబోతున్నారు. బెల్లంకొండ సురేష్ చిన్నబ్బాయి బెల్లంకొండ గణేష్‌ అతి తొందర్లో ఓ హిందీ రిమేక్‌తో తెలుగు తెరకు హీరోగా పరిచయం కాబోతున్నారు. ఈ మేరకు ఓ న్యూస్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. సూరజ్‌ డైరెక్షన్‌లో షాహిద్ కపూర్‌, అమృత రావ్‌ హీరో హీరోయిన్‌లుగా నటించిన సినిమా “వివాహ్‌”. రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా 2006లో రిలీజైన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుని.. ఫ్లాపుల్లో ఉన్న షాహిద్ కపూర్‌ను బాలీవుడ్‌లో నిలబెట్టింది. ఇప్పుడీ సినిమా రైట్స్‌ను బెల్లకొండ సురేష్ తన చిన్నబ్బాయి కోసం తీసుకున్నారట. ఇప్పటికే పెద్దబ్బాయి బెల్లంకొండ శ్రీనివాస్‌ను హీరోగా నిలబెట్టిన సురేష్ ఇప్పుడు చిన్నబ్బాయిని కూడా అదే రేంజ్‌లో హీరోగా నిలబెట్టాలని కృషి చేస్తున్నారట. అందులో భాగంగానే వివాహ్‌ రిమేక్‌ను భారీగా ప్లాన్‌ చేస్తున్నారట.

తన చిన్నబ్బాయిని.. పెద్దబ్బాయిలా యాక్షన్ హీరోలా కాకుండా .. ఫ్యామిలీ ఆడియన్స్‌కు దగ్గర చేయాలనే ఉద్దేశంతో … ఓ సెన్సబుల్ స్టార్‌ డైరెక్టర్‌ను ఆల్‌రెడీ లైన్‌లో పెట్టారట బెల్లంకొండ. అంతేకాదు…. ఆయన కోరిక మేరకే కృతి శెట్టిని తన అబ్బాయి డెబ్యూ ఫిల్మింలో హీరోయిన్‌గా తీసుకోనున్నారట. అన్నీ అనుకున్నట్లు జరిగితే వచ్చే ఏడాది కల్లా ఈ సినిమా మన ముందుకు తీసుకువచ్చేందుకు ప్లాన్‌ చేస్తున్నారట బెల్లంకొండ. అయితే ఈ బెల్లంకొండ వారి చిన్నబ్బాయి తెలుగు ప్రేక్షకులను ఎలా అలరించనున్నారో చూడాలి మరి!. మరోవైపు బెల్లకొండ శ్రీనివాస్ బాలీవుడ్ లోకి అడుగుపెడుతున్న విషయం తెలిసిందే. ప్రభాస్ నటించిన ఛత్రపతి సినిమాను హిందీలో రీమేక్ చేస్తున్నాడు.

మరిన్ని ఇక్కడ చదవండి :

Allu Arjun Pushpa: సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తున్న పుష్పరాజ్.. యూట్యూబ్ ను షేక్ చేస్తున్న వీడియో…

Gopichand : సంపత్ నంది సినిమా పైనే ఆశలు పెట్టుకున్న మ్యాచో హీరో.. సీటీమార్ తో రానున్న గోపీచంద్..

Mahesh Babu-Trivikram: సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజున మహేష్ – త్రివిక్రమ్ సినిమా మోషన్ పోస్టర్ రానుందా.?