Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mahesh Babu-Trivikram: సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజున మహేష్ – త్రివిక్రమ్ సినిమా మోషన్ పోస్టర్ రానుందా.?

త్రివిక్రమ్ .. మహేశ్ బాబు కాంబినేషన్లో ఇంతకుముందు 'అతడు' .. 'ఖలేజా' సినిమాలు రూపొందాయి. మూడో సినిమాకి సన్నాహాలు జరుగుతున్నాయి.

Mahesh Babu-Trivikram: సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజున మహేష్ - త్రివిక్రమ్ సినిమా మోషన్ పోస్టర్ రానుందా.?
Follow us
Rajeev Rayala

|

Updated on: May 16, 2021 | 3:43 PM

mahesh babu trivikram : త్రివిక్రమ్ .. మహేశ్ బాబు కాంబినేషన్లో ఇంతకుముందు ‘అతడు’ .. ‘ఖలేజా’ సినిమాలు రూపొందాయి. మూడో సినిమాకి సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన కథపైనే త్రివిక్రమ్ కసరత్తు చేస్తున్నారు. త్రివిక్రమ్ ఈ సినిమాకి ‘పార్థు’ అనే టైటిల్ అనుకుంటున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అయితే, మరోపక్క, ఆయన సెంటిమెంట్ ప్రకారం టైటిల్ ‘అ’ అక్షరంతోనే మొదలుకానుందని మరికొంతమంది కూడా అంటున్నారు. ఈ సస్పెన్స్ కి ఈ నెల 31వ తేదీతో తెరపడనుందని చెబుతున్నారు. ఈ నెల 31వ తేదీన కృష్ణ పుట్టినరోజు .. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని త్రివిక్రమ్ – మహేశ్ బాబు సినిమా నుంచి టైటిల్ పోస్టర్ రానున్నట్టుగా చెబుతున్నారు. అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయని అంటున్నారు.

త్రివిక్రమ్ – మహేశ్ మూవీలో కథానాయికగా పూజ హెగ్డే పేరు వినిపిస్తోంది.  ఇక ప్రస్తుతం మహేష్ బాబు పరశురామ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. సర్కారు వారి పాట  అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్ జోడీగా కీర్తి సురేష్ నటిస్తుంది. ఈ సినిమా బ్యాంకింగ్ రంగాల్లో జరిగే మోసాల నేపథ్యంలో సినిమా ఉండనుందని తెలుస్తుంది. నిన్నమొన్నటివరకు శరవేగంగా జరిగిన ఈ సినిమా షూటింగ్ ఇప్పుడు కరోనా కారణంగా ఆగిపోయింది. అయితే కృష్ణ పుట్టిన రోజున సర్కారు వారి పాట సినిమానుంచి కూడా ఓ సర్ప్రైజ్ ఉండనుంది. ఆ రోజు మహేష్ బాబు లుక్ ను రిలీజ్ చేయనున్నారని తెలుస్తుంది. అయితే ‘సర్కారు వారి పాట’ నుంచి ముందుగా టీజర్ వచ్చే అవకాశం ఉందనే టాక్ వచ్చింది. సినిమా విడుదలకి ఇంకా చాలా సమయం ఉన్నందున అప్పుడే వద్దని మహేశ్ అనడం వలన ఆగిందని అంటున్నారు. ఇదిలా ఉంటే ముందుగా సంక్రాంతి కానుకగా ఈ సినిమాను విడుదల చేయాలని అనుకున్నారు కానీ ఇప్పుడు వాయిదా పడే అవకాశం ఉందని తెలుస్తుంది.

మరిన్ని ఇక్కడ చదవండి  :

F3 movie : త్రిబుల్ ఫన్ తో రానున్న అనిల్ రావిపూడి.. ఈసారి సందడంతా ఆ హీరోదేనంట..

Dhanya Balakrishna: ప‌వ‌న్ నా క్ర‌ష్‌.. ఆయ‌న‌తో సినిమా చేయాల‌నుంది.. మ‌న‌సులో మాట బ‌య‌ట‌పెట్టిన ధ‌న్య‌..

Viral Video : ఆస్పత్రి కారిడార్‌లో డాక్టర్ల డ్యాన్సులు..! సల్మాన్ ఖాన్ సిటీమార్‌ సాంగ్‌కి అదిరే స్టెప్పులు..