Viral Video : ఆస్పత్రి కారిడార్‌లో డాక్టర్ల డ్యాన్సులు..! సల్మాన్ ఖాన్ సిటీమార్‌ సాంగ్‌కి అదిరే స్టెప్పులు..

Doctors Dance in Hospital : సల్మాన్ ఖాన్ కొత్త సినిమా రాధేలోని సీటీ మార్‌ సాంగ్‌కి ఓ డాక్టర్ల బ‌ందం చేసిన డ్యాన్స్ వీడియో వైరల్‌గా మారింది.

Viral Video : ఆస్పత్రి కారిడార్‌లో డాక్టర్ల డ్యాన్సులు..! సల్మాన్ ఖాన్ సిటీమార్‌ సాంగ్‌కి అదిరే స్టెప్పులు..
Doctors Dance In Hospital
Follow us
uppula Raju

|

Updated on: May 16, 2021 | 12:57 PM

Doctors Dance in Hospital : సల్మాన్ ఖాన్ కొత్త సినిమా రాధేలోని సీటీ మార్‌ సాంగ్‌కి ఓ డాక్టర్ల బ‌ందం చేసిన డ్యాన్స్ వీడియో వైరల్‌గా మారింది. అంతేకాదు ఈ సినిమా హీరోయిన్ ఈ వీడియోను చూసి స్పందించింది. వైద్యులు చేసిన షార్ట్ క్లిప్‌ను.. దిషా పటాని అభిమానుల క్లబ్ ఒకటి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. వీడియోలో కరోనావైరస్ మహమ్మారి మధ్య నిర్విరామంగా పనిచేస్తున్న వైద్యులు, ఆసుపత్రి కారిడార్‌లోని సీటీ మార్ సాంగ్‌కి అద్భుతంగా డ్యాన్స్ చేశారు. వైద్యులందరూ మాస్కులు ధరించి, సిటీ మార్ సాంగ్‌కి ఉల్లాసమైన స్టెప్పులను ప్రదర్శించారు.

ఈ సినిమా హీరోయిన్ దిశాపటాని స్పందిస్తూ వీడియోను షేర్ చేస్తూ “వావ్! మా నిజమైన హీరోలు” మీరే అంటూ రాసుకొచ్చింది. దీంతో ఈ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో హల్‌చల్ చేస్తుంది. చాలామంది నెటిజన్లు కామెంట్స్, షేర్లు చేస్తున్నారు. కరోనా సెకండ్ వేవ్ దేశంలో విజృంభిస్తుండగా ఆస్పత్రుల్లో వైద్య సిబ్బంది పగలనకా, రాత్రనకా సేవలందిస్తున్నారు. అలాంటి వారు ఒత్తిడికి లోను కాకుండా ఇలా ఎంటర్‌టైన్ మెంట్ పొందాలని పలువురు సూచిస్తున్నారు.

కాగా సిటీమార్‌ సాంగ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన డీజే సినిమాలోని పాట. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా బన్నీ అదిరిపోయే స్టెప్పులతో ఆకట్టుకున్నాడు. సినిమా అంతగా ఆకట్టుకోలేక పోయినా.. ఈ పాట మాత్రం ప్రేక్షకులను విపరీతంగా అలరించింది. ఇదిలా ఉంటే ఇప్పుడు రాధే సినిమాలో ఈ పాట సల్మాన్ ఖాన్ ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తుంది. స‌ల్మాన్ బెల్ట్ స్టెప్పు, మాస్క్ స్టెప్పు చాలు ఫ్యాన్స్ ని ఫిదా చేయ‌డానికి అనేది కొంద‌రి మాట‌. అయితే స‌ల్మాన్ స్టెప్పులు చూశాక బ‌న్నీ పాట‌ను మ‌ళ్లీ మ‌ళ్లీ చూడాల‌నిపిస్తోంద‌ని అంటున్నారు చాలా మంది సౌత్ క‌మ్ నార్త్ ఆడియ‌న్స్.

View this post on Instagram

A post shared by Team Disha (@teamdishap)

Andhra Curfew: ఏపీలో క‌ర్ఫ్యూ స‌మ‌యం మ‌రింత పెంచే అవ‌కాశం.. రేపు సీఎం జ‌గ‌న్ కీల‌క నిర్ణ‌యం

Covid-19 Tragedy: ఇంట్లో తండ్రి మృతదేహాం.. త‌ల్లిని కాపాడుకునేందుకు క్యూ లైన్ లో యువ‌కుడి ఆరాటం..

Double Mask: ముంబాయి పోలీసుల మరో వినూత్న ప్రచారం.. హారీపోటర్ ఫోటోలతో డబుల్ మాస్క్ పై మీమ్..