Covid-19 Tragedy: ఇంట్లో తండ్రి మృతదేహాం.. త‌ల్లిని కాపాడుకునేందుకు క్యూ లైన్ లో యువ‌కుడి ఆరాటం..

కరోనా మహమ్మారి బారిన పడి ఓ ఇంటి పెద్ద కన్నుమూశాడు. ఆయన భార్య కూడా చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంది. ఒకవైపు తండ్రిని కోల్పోయి తీవ్ర విషాదంలో ఉన్న కొడుకు..

Covid-19 Tragedy:  ఇంట్లో తండ్రి మృతదేహాం.. త‌ల్లిని కాపాడుకునేందుకు క్యూ లైన్ లో యువ‌కుడి ఆరాటం..
Remdesivir At Chennai
Follow us

|

Updated on: May 16, 2021 | 12:20 PM

కరోనా మహమ్మారి బారిన పడి ఓ ఇంటి పెద్ద కన్నుమూశాడు. ఆయన భార్య కూడా చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంది. ఒకవైపు తండ్రిని కోల్పోయి తీవ్ర విషాదంలో ఉన్న కొడుకు.. కొన ఊపిరితో పోరాడుతున్న తల్లిని కాపాడుకునేందుకు రెమ్‌డెసివర్ మందుల కోసం క్యూలైన్లో నిల్చొనివుండటం ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టిస్తోంది. హృదయం ద్రవింపచేసే ఈ విషాద ఘటన చెన్నైలో చోటుచేసుకుంది. కరోనా రోగుల ప్రాణాలు రక్షించే రెమ్‌డెసివిర్ మందుల కొరత తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రంగా వేధిస్తోంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వమే రంగంలోకి దిగి ప్రత్యేక కౌంటర్ల ద్వారా విక్రయిస్తోంది. కరోనా కట్టడికి సర్కార్‌ విధించిన నిబంధనలను లెక్కచేయకుండా కరోనా రోగుల బంధువులు ఈ మందులు కోసం ఎగబడుతున్నారు. స్థానిక జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో రెమ్‌డెసివిర్ ఇంజక్షన్ల కోసం జనాలు క్యూలో బారులు తీరారు. అయితే అదే క్యూలో నిల్చున్న ఓ యువకుడు తన తల్లిదండ్రులకు కరోనా సోకిందని, డాక్టర్‌ వారికి రెమ్‌డెసివిర్ ఇవ్వాలని చెప్పారని చెప్పుకొచ్చాడు. వాటి కోసం అతను గత పది రోజులుగా ప్రయత్నిస్తున్నట్టు తెలిపాడు. ఆ యువకుడు తన ప్రయత్నాల్లో ఉండగానే అతని తండ్రి మృతి చెందాడని కన్నీరు పెట్టుకున్నాడు. తండ్రి మృతదేహాన్ని ఇంట్లో పెట్టుకుని తల్లిని బతికించుకునేందుకు అక్కడ క్యూలో నిల్చున్నట్టు చెబుతూ ఆవేదన వ్యక్తం చేశాడు.

ఆ యువకుడిలానే ఎంతో మంది అక్కడ స్టేడియానికి వచ్చి క్యూలో నిల్చుని ఉన్నారు. కొందరైతే తెల్లవారుజామున ఒంటి గంటకే వచ్చి లైనులో నిల్చుంటున్నారు. అయితే, ఇక్కడ ఇంజక్షన్ సంపాదించి తమ వారిని కాపాడుకోవడం అనే సంగతి పక్కనపడితే.., ఇక్కడికొచ్చిన వారు మాత్రం తప్పకుండా ఆ మహమ్మారి బారినపడడం ఖాయమని మరో యువకుడు అన్నాడు. ఇంజక్షన్ కోసం ఒకరినొకరు నెట్టుకుంటున్న జనాన్ని అదుపు చేయలేక స్టేడియంలో ఉన్న పోలీసులు కూడా చేతులెత్తేశారు.

Also Read: మరణం అంచున ఉన్న తల్లికోసం కొడుకు పాడిన ఆ పాట నెటిజన్ల హృదయాలు కదిలిస్తోంది!

వేదా కృష్ణమూర్తి విషయంలో బీసీసీఐ తీరు అమానవీయం!