Pandemic Emotions: మరణం అంచున ఉన్న తల్లికోసం కొడుకు పాడిన ఆ పాట నెటిజన్ల హృదయాలు కదిలిస్తోంది!

Pandemic Emotions: కరోనా రెండో వేవ్ దేశాన్ని నాశనం చేసేస్తోంది. బంధాలను దూరం చేసేస్తోంది. ఆసుపత్రుల్లో బెడ్ ల కొరత.. ఆక్సిజన్ దొరకక పరజల బాధ.. ప్రియమైన వారిని కళ్ళముందే కరోనా తీసుకుపోతున్న వేదన

Pandemic Emotions: మరణం అంచున ఉన్న తల్లికోసం కొడుకు పాడిన ఆ పాట నెటిజన్ల హృదయాలు కదిలిస్తోంది!
Pandemic Emotions
Follow us
KVD Varma

|

Updated on: May 16, 2021 | 11:37 AM

Pandemic Emotions: కరోనా రెండో వేవ్ దేశాన్ని నాశనం చేసేస్తోంది. బంధాలను దూరం చేసేస్తోంది. ఆసుపత్రుల్లో బెడ్ ల కొరత.. ఆక్సిజన్ దొరకక పరజల బాధ.. ప్రియమైన వారిని కళ్ళముందే కరోనా తీసుకుపోతున్న వేదన.. మందుల కోసం యాచన.. అంత్యక్రియలకు స్థలం దొరకక పడే పాట్లు.. ఇలా ఒకటి కాదు రకరకాలైన కొత్త ఇబ్బందులను కరోనా పరిచయం చేస్తోంది. ఇక కరోనాతో ఇబ్బంది పడుతున్న రోగులు.. ఆసుపత్రుల్లో ఉంటె, వారిని చూసే అవకాశం కూడా వారి కుటుంబీకులకు ఉండడం లేదు. దీంతో, ప్రాణాల మీదకు వచ్చిన వారు కూడా తమ చివరి క్షణాల్లో తమ వారిని చూడలేకపోతున్నారు. వారిని చూసే పరిస్థితి కన్న బిడ్డలకూ దక్కడం లేదు. ఇటువంటి విషాద పరిస్థితిలో కొంతమంది వైద్యుల ఫోన్ల సహాయంతో కరోనా చికిత్స పొందుతున్న తమ ఆత్మీయులను వీడియో కాల్స్ లో పలకరిస్తున్నారు. ఇటువంటి సందర్భంలో ఆ డాక్టర్లు కూడా తీవ్రమైన భావోద్వేగానికి లోను అవుతున్నారు.

అటువంటి పోస్ట్  ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోను దిప్షిఖా ఘోష్ అనే వైద్యుడు సోషల్ మీడియాలో పంచుకున్నారు. అపోలో గ్లెనెగల్స్‌ లో కరోనాతో పోరాడుతున్న తన తల్లిని చూడాలని ఒక 25 ఏళ్ల యువకుడు డాక్టర్ దిప్షిఖా ఘోష్ ను అభ్యర్ధించారు. దీంతో ఆయన తన ఫోన్ తో వీడియో కాల్ చేసి తల్లీ, కొడుకులను మాట్లాడుకునే అవకాశం కల్పించారు. ఈ వీడియో కాల్ లో తన తల్లి పరిస్థితి చూసి చలించిపోయిన ఆ యువకుడు ఆమెను ఓదారుస్తూ.. 1973 లో సూపర్ హిట్ అయిన హిందీ పాట ‘తేరా ముజ్సే హై పెహ్లే కా నాటా కోయి’ ను పాడాడు. ఈ వీడియోను డాక్టర్ షేర్ చేశారు. ఇప్పుడు ఈ వీడియో చూసిన నెటిజన్లు కంట తడి పెడుతున్నారు. హృదయాన్ని కదిలిస్తోంది అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

డాక్టర్ షేర్ చేసిన ట్వీట్  ఇక్కడ చూడండి..

ఈ వీడియో పై డాక్టర్ మాట్లాడుతూ.. “ఈ రోజు, నా షిఫ్ట్ ముగిసే సమయానికి, ఈ రోగి కొడుకు నా సమయం కొన్ని నిమిషాలు అడిగారు. అతను చనిపోతున్న తన తల్లి కోసం ఒక పాట పాడాడు. అతను ‘తేరా ముజ్సే హై పెహ్లే కా నాటా కోయి’ పాడాడు. నేను అక్కడే ఫోన్ పట్టుకొని నిలబడి, అతని తల్లి వైపు చూస్తూ ఉన్నాను. ఇది నన్ను బాగా కదిలించింది.” అని దిప్షిఖా ఘోష్ అన్నారు. సమీపంలో ఉన్న ఇతర ఆరోగ్య కార్యకర్తలు కూడా దీనిని మౌనంగా విన్నారు.

“నర్సులు వచ్చి మౌనంగా నిలబడ్డారు. అతను మధ్యలో కొద్దిగా ఆగినా కాని పాటను ముగించాడు. అతను ఆమె ఎలా వుందో అడిగాడు. నాకు కృతజ్ఞతలు చెప్పాడు. నేను , నర్సులు అక్కడ నిలబడ్డాము. మాకు తెలియకుండానే, మా కళ్ళు తేమగా మారాయి.”అని డాక్టర్ దిప్షిఖా ఘోష్ తెలిపారు.

ఈ వీడియో పై ప్రజలు ప్రతిస్పందనగా భావోద్వేగ ట్వీట్లను పోస్ట్ చేస్తున్నారు. గురువారం చివరి గణన వరకు, ఈ పోస్ట్ 10,000 సార్లు రీట్వీట్ చేయబడింది, దాదాపు 40,000 లైక్‌లు మరియు 1,500 కి పైగా కామెంట్స్ ఈ వీడియోకు వచ్చాయి.

Also Read: Vaccination: కరోనా టీకా కోసం కోవిడ్ టెస్ట్ చేయించుకోవాలా? పాజిటివ్ వస్తే  వ్యాక్సిన్ తీసుకోవచ్చా? నిపుణులు ఏమంటున్నారు?

Lockdown: ఇంట్లోంచి కదిలే పరిస్థితి లేదు..మనసికంగా బాధ..ఈ పెద్దాయన చేసిన పని మీకు కచ్చితంగా కొత్త ఆలోచనలు ఇస్తుంది!