Vaccination: కరోనా టీకా కోసం కోవిడ్ టెస్ట్ చేయించుకోవాలా? పాజిటివ్ వస్తే  వ్యాక్సిన్ తీసుకోవచ్చా? నిపుణులు ఏమంటున్నారు?

Vaccination: కరోనా మహమ్మారి విషయంలో ఎన్ని అనుమానాలు ఉన్నాయో.. అంతకంటే ఎక్కువ సందేహాలు టీకా విషయంలో ప్రజలకు ఉన్నాయి. టీకా వేసుకుంటే కరోనా రాదని కచ్చితంగా చెప్పగలరా?

Vaccination: కరోనా టీకా కోసం కోవిడ్ టెస్ట్ చేయించుకోవాలా? పాజిటివ్ వస్తే  వ్యాక్సిన్ తీసుకోవచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
Vaccination
Follow us
KVD Varma

|

Updated on: May 16, 2021 | 10:03 AM

Vaccination: కరోనా మహమ్మారి విషయంలో ఎన్ని అనుమానాలు ఉన్నాయో.. అంతకంటే ఎక్కువ సందేహాలు టీకా విషయంలో ప్రజలకు ఉన్నాయి. టీకా వేసుకుంటే కరోనా రాదని కచ్చితంగా చెప్పగలరా? అనారోగ్యంతో ఉంటె టీకా వేయించుకోవచ్చా? కోవిడ్ పాజిటివ్ వచ్చి తగ్గిన తరువాత ఎన్నిరోజులకు వ్యాక్సిన్ తీసుకోవాలి? వ్యాక్సిన్ వేసుకున్న తరువాత జ్వరం వస్తే ఏం చేయాలి? ఇలా ఎన్నో ప్రశ్నలు. ఈ అనుమానాల్ నివృత్తి కోసం నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

టీకా వేయించుకోవడం వల్ల కరోనా వస్తుందన్నది అపోహ అంటున్నారు వైద్య నిపుణులు. వ్యాక్సిన్‌ కరోనా మృత కణాలతో తయారు చేస్తారు. ఇది మనిషి శరీరంలోకి ప్రవేశించిన తర్వాత వైరస్‌తో పోరాడే యాంటీబాడీలను ఉత్పత్తి చేస్తుంది. ఈ క్రమంలో కొద్దిపాటి కరోనా వైరస్ సోకిన వారికి వచ్చే లక్షణాలు కనిపించే అవకాశం ఉంటుంది. అవి ఒకటి రెండురోజులకు తగ్గిపోతాయి. ఏదైనా ప్రత్యెక పరిస్థితులు.. ఇతర కారణాల వల్ల కొంచెం ఎక్కువ అనారోగ్యం కలగవచ్చు తప్పితే వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల కరోనా వస్తుంది.. అనారోగ్యం కలుగుతుంది అనేది కరెక్ట్ కాదని నిపుణులు చెబుతున్నారు.

ఇంట్లో ఎవరికైనా కరోనా పాజిటివ్ ఉంటె.. ఆ ఇంట్లో ఉన్నవారు టీకా వేయించుకునే ప్రయత్నం చేయకూడదు. కనీసం 14 రోజుల పాటు ఇంటిలో ఐసోలేషన్ (తమకు కరోనా లక్షణాలు లేకపోయినా సరే) ఉండి తరువాత టీకా వేయించుకోవడం మంచింది. ఆ తరువాత కూడా కరోనా టెస్ట్ చేయించుకున్న తరువాతే టీకా తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. టీకా వేయించుకోవడానికి వెళ్లినప్పుడు కూడా కనీసం జాగ్రత్తలు తీసుకోవాలి. రెండు మాస్కులను ధరించాలి. అదేవిధంగా ఏదైనా కరోనా లక్షణం అంటే.. జ్వరం..ఒళ్ళు నెప్పులు..జలుబు ఇటువంటివి వుంటే కనుక.. తప్పనిసరిగా ఆర్టీపీసీఆర్‌ పరీక్ష చేయించుకోవాలి. నెగెటివ్‌ వచ్చిన తర్వాతే టీకా వేయించుకోవాలి. పాజిటివ్‌ వస్తే ఐసీఎంఆర్‌ నిబంధనల ప్రకారం టీకా వేయించుకోవడానికి ఆరు నెలలు ఆగాల్సిందే.

చాలా మంది మొదటిడోసు తర్వాత కనీస జాగ్రత్తలు తీసుకోవడం లేదు. రెండో డోసు వేయించుకున్న 14 రోజుల తరువాతే మనలో యాంటీబాడీలు ఉత్పత్తి అవుతున్నాయి. దీని తర్వాత కూడా కరోనా రాదని కాదు. చాలా మందికి వచ్చినా కూడా సీరియస్‌ కావడం లేదని నిపుణులు చెబుతున్నారు. అమెరికా, ఇజ్రాయెల్‌ తదితర దేశాల్లో రెండు డోసుల వ్యాక్సిన్‌ వేయించుకున్న వారిలో పూర్తిస్థాయిలో యాంటీబాడీలు వృద్ధి చెందడంతో అక్కడ మాస్కును పెట్టుకోవాల్సిన అవసరం లేదని ప్రకటించారు. బ్రిటన్‌లో కూడా అంతే. అందువల్ల ఇక్కడ కూడా ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్‌ వేయించుకోవాలి. రెండు దోసులూ తీసుకున్నాక కూడా నిపుణులు సూచించే వరకూ మాస్క్ ధరించాల్సిందే అని చెబుతున్నారు.

ముందే చెప్పినట్టు వ్యాక్సిన్ తీసుకున్నకా స్వల్ప లక్షణాలు కనిపిస్తాయి. అయితే, టీకా వేయించుకున్న తర్వాత ఎక్కువ రోజులు జ్వరం ఇతర లక్షణాలు కనిపిస్తే మాత్రం వెంటనే, ఆర్టీపీసీఆర్‌ పరీక్ష చేయించుకుని ఫలితం ఆధారంగా వైద్యులను సంప్రదించాలని నిపుణులు చెబుతున్నారు.

Also Read: Sputnik V Vaccine : స్పుత్నిక్ వి సెకండ్ బ్యాచ్ వచ్చేసింది..! రష్యా నుంచి విమానం హైదరాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయింది..

Vacination: మా దేవతకు కోపం వస్తుంది మేం టీకా వేసుకోం అంటున్న గ్రామస్థులు.. తలలు పట్టుకున్న అధికారులు..ఎక్కడంటే..

మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!