Lockdown: ఇంట్లోంచి కదిలే పరిస్థితి లేదు..మనసికంగా బాధ..ఈ పెద్దాయన చేసిన పని మీకు కచ్చితంగా కొత్త ఆలోచనలు ఇస్తుంది!

Lockdown: కరోనా మహమ్మారి కారణంగా అందరూ ఇళ్లకే పరిమితం అవ్వాల్సిన పరిస్థితి. ఇంట్లో ఖాళీగా ఉంది ఏం చేయాలో అర్ధం కాక.. టీవీలకు అతుక్కుపోయే వారు కొందరు.

Lockdown: ఇంట్లోంచి కదిలే పరిస్థితి లేదు..మనసికంగా బాధ..ఈ పెద్దాయన చేసిన పని మీకు కచ్చితంగా కొత్త ఆలోచనలు ఇస్తుంది!
Dooddles
Follow us
KVD Varma

|

Updated on: May 16, 2021 | 7:42 AM

Lockdown: కరోనా మహమ్మారి కారణంగా అందరూ ఇళ్లకే పరిమితం అవ్వాల్సిన పరిస్థితి. ఇంట్లో ఖాళీగా ఉంది ఏం చేయాలో అర్ధం కాక.. టీవీలకు అతుక్కుపోయే వారు కొందరు. మానసికంగా బందీలుగా ఉన్న భావనలో దిగాలుగా మరికొందరు ఇలా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అయితే, ఇటువంటి పరిస్థితులను కూదా సానుకూలంగా మార్చుకోవచ్చని నిరూపించారు ఆ పెద్దాయన. తనకు బాగా ఇష్టమైన కళను బయటకు తీశారు. సంవత్సర కాలంగా ఇంట్లో అద్భుత కళా ఖండాలను తీర్చి దిద్దారు. ఈయన పేరు రాబర్ట్ సీమాన్. వయసు 88 ఏళ్లు. ఈ వయసులో కూడా ఈయన వరుసగా 365 రోజుల పాటు ఇంటిలోనే ఉంటూ తనకు వచ్చిన బొమ్మలు వేసే పనిని రంగుల పెన్సిళ్ళతో కానిచ్చేస్తూ గడిపేస్తున్నారు.

చిన్నప్పటి నుంచీ నాకు ఎప్పుడన్నా ఒంటరిగా ఉన్నపుడు గదిలో కూచుని బొమ్మలు వేయడం అలవాటు. అదే ఈ మహమ్మారి సమయంలోనూ నాకు ఉపయోగపడింది. నాకిష్టమైన పనిని నేను ప్రతిరోజూ హాయిగా చేసుకుంటూ ఉన్నాను అని చెబుతారు సీమాన్. ఎంతో జీవితాన్ని అనుభవించిన తరువాత మళ్ళీ పదకొండేళ్ళ బాల్యంలోకి వెళ్ళిపోయాను అని ఆయన మెరుస్తున్న కళ్ళతో అంటున్నారు. నేను బొమ్మలు గీయడాన్ని ప్రేమిస్తాను. ఇప్పుడు ఇది నాకు ఎంతో ప్రశాంత జీవితాన్నిస్తోంది.

గత సంవత్సరం కరోనా వ్యాపించిన సమయంలో సీమాన్ ఒక గదిలో ఉండిపోయారు. చాలా నెలల పాటు ఆయన కనీసం తన ఇంట్లోని హాలులోకి కూడా వచ్చే అవకాశం లేకుండా పోయింది. కరోనా భయంతో ఎప్పుడన్నా మాస్క్ పెట్టుకుని కొద్ది నిమిషాలు బయటకు అదీ హాలులోకి వచ్చేవారు. ఇటువంటి సమయంలో ఆయన తన చిన్ననాటి అభిరుచిని బయటకు తీశారు. దీని గురించి ఆయన మాటల్లోనే చెప్పాలంటే..”నేను అనుభవించిన నిర్బంధ స్వభావాన్ని మరియు ఈ మహమ్మారి వల్ల ఏర్పడిన ఇబ్బందులను ప్రతిబింబించే కొన్ని రకాల చీకటి పరిస్థితులను ప్రపంచానికి వెల్లడి చేయాలనేది నా మొదటి ఆలోచన”. “అప్పుడు అది పెరగడం ప్రారంభమైంది. దీంతో రోజుకు ఒక డ్రాయింగ్ వేయడం ఆసక్తికరంగా ఉంటుందని నేను అనుకున్నాను.”

ఆయన ప్రతిరోజూ ఒక డూడుల్ చిత్రించి..తన కుమార్తె రాబిన్ హేస్, ఇతర స్నేహితులు మరియు కుటుంబ సభ్యులకు పంపడం ప్రారంభించారు. హేస్ వాటిని ఫేస్‌బుక్‌లో పంచుకున్నారు, ఆసక్తి పెరిగేకొద్దీ, ఎట్సీ.కామ్‌లో ఒరిజినల్స్ అదేవిధంగా ఈ దూడుల్స్ ప్రింట్లను అమ్మడం ప్రారంభించారు ఆమె కుమార్తె. దీనిలో వచ్చిన సగం ఆదాయాన్ని స్వచ్ఛంద సంస్థలకు ఇస్తున్నారు. వీటిలో కోవిడ్ రిలీఫ్ ఫండ్, నిరాశ్రయుల ఆశ్రయం, శరణార్థులకు సహాయపడే సంస్థ ఉన్నాయి.

ఇది కరోనా మహమ్మారి వ్యాపించిన వేళ ఒక పెద్దాయన చేసిన ఒక సానుకూలమైన ఆలోచన. ఇదే పని అంతా చేయొచ్చు. అంటే అందరూ డూడుల్స్ వేయాలని కాదు.. ప్రతి ఒక్కరిలోనూ ఎదో ఒక నిర్ద్రారణమైన ఆర్ట్ ఉంటుంది. దానిని బయటకు తీసి.. మళ్ళీ కొత్తగా ఆ పని ప్రారంభించడానికి ఈ మహమ్మారి కల్పించిన లాక్ డౌన్ అనే బందిఖానాను ప్రశాంతంగా గడిపేస్తే బావుంటుంది. మరి మీరేమంటారు?

Also Read: ONLINE TERRORISM: వేళ్ళూనుకుంటున్న ఆన్‌లైన్ టెర్రరిజమ్.. టెక్కీల సాయంతో అంతానికి అగ్రరాజ్యం స్కెచ్

లక్కు కాలింగ్‌ బెల్‌ కొట్టినా, తొక్కలో దరిద్రం నెత్తి మీద డిస్కో ఆడింది!