Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జైల్లోనే ఉంటాం..ఈ వృద్ధుల కథ వింటే కన్నీళ్లాగవు వీడియో

జైల్లోనే ఉంటాం..ఈ వృద్ధుల కథ వింటే కన్నీళ్లాగవు వీడియో

Samatha J

|

Updated on: Mar 22, 2025 | 8:10 AM

వయసు మీదపడ్డాక చాలా మంది సరదాగా జీవితం వెళ్లదీయాలనుకుంటారు. మనవలు, మనవరాళ్లు, కుటుంబసభ్యులతో సుఖంగా బతకాలనుకుంటారు. కానీ జపాన్లో మాత్రం పరిస్థితి భిన్నం. వయసు మీద పడ్డ వృద్ధులంతా ఇప్పుడు జైలుకు క్యూకడుతున్నారు. చిన్న చిన్న నేరాలు చేస్తూ పోలీసులకు పట్టుబడి కటకటాలపాలవుతున్నారు. ఒకవేళ తక్కువ శిక్షపడి త్వరగా బయటికొస్తే మరో నేరం చేసి జైలుపాలవుతున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే కాటికి కాళ్లు చాపుకున్న వృద్ధులంతా తమ శేష జీవితం కారాగారంలోనే వెళ్లదీయాలనుకుంటున్నారు.

ఇంతకీ జపాన్లో వృద్ధులు జైలులోనే ఎందుకు బతకాలనుకుంటున్నారు.? వారి నిర్ణయం వెనుకున్న కన్నీటి కథేంటి..?మోడ్రన్ టెక్నాలజీకి కేరాఫ్ అడ్రస్ జపాన్. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఏదైనా అందుబాటులోకి వచ్చిందంటే అది కచ్చితంగా జపాన్లోనే అయి ఉంటుంది. ప్రపంచంలో ఎక్కువ కష్టపడే ప్రజలున్న దేశాల్లో జపాన్ ముందుంటుంది. ఇదంతా నాణేనికి ఒకవైపైతే.. అత్యధిక వృద్ధులున్న దేశాల్లో జపాన్ ది అగ్రస్థానం. అక్కడ రికార్డుస్థాయిలో వృద్ధులు ఉన్నట్లు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. ఇదిలా ఉంటే గత కొన్నేళ్లుగా జపాన్లో వింత ధోరణి మొదలైంది. వయసుపైబడ్డ వృద్ధులంతా జైళ్లకు వెళ్లేందుకు తాపత్రయపడుతున్నారు. అందుకోసం ఎలాంటి నేరం చేసేందుకైనా సిద్ధమంటున్నారు. ఇలా ఉద్దేశపూర్వకంగా నేరాలకు పాల్పడుతున్న వారిలో 65ఏళ్లకు పైబడిన వారు కూడా ఉండటం విశేషం.

మరిన్ని వీడియోల కోసం :

కాసులకు కక్కుర్తిపడితే ఊచలు తప్పవు..బెట్టింగ్ బంగార్రాజులు బీ కేర్‌ఫుల్‌ వీడియో

38 గంటలు కదలకుండా నిలబడ్డ యూట్యూబర్.. బుగ్గ గిల్లినా డిస్టర్బ్ కాలేదు వీడియో

నిమ్మచెట్టు గ్రహదోషాలను తొలగిస్తుందా?వీడియో

మహా సముద్రంలో అంతుచిక్కని అద్భుతం.. సైంటిస్టులే షాక్‌!వీడియో