నా కొడుకు జీవితం నాశనం చేశారు.. తండ్రి ఆవేదన వీడియో
వైద్యుల నిర్లక్ష్యం ఓ యువకుడి జీవితాన్ని ప్రశ్నార్థకంగా మార్చేసింది. ఆడుకుంటూ గాయపడి ఆస్పత్రికి వెళ్లిన ఆ యువకుడికి ఆపరేషన్ చేసారు. శస్త్రచికిత్స చేసిన సమయంలో వైద్యుల నిర్లక్ష్యం ఆ యువకుడి ఆశయాన్ని దెబ్బతీసింది.. అతని తండ్రికి తీరని ఆవేదన.. అప్పులను మిగిల్చింది. ఈ దారుణ ఘటన గుంటూరు చిలకలూరిపేటలో జరిగింది. బాధితుడి తండ్రి చెప్పిన వివరాలు ప్రకారం.. చిలకలూరిపేటకు చెందిన దార్ల జోజియ్య కుమారుడు వంశీ ఇంటర్ చదువుకున్నాడు.
పోలీసు కావాలన్న ఆశయంతో అందుకు సిద్ధమవుతున్నాడు. ఈ క్రమంలో గత నవంబరు నెలలో వంశీ క్రికెట్ అడుతూ పడిపోయాడు. అతని మోకాలికి దెబ్బ తగలడంతో మంగళగిరిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్ళాడు. అక్కడ వైద్యలు స్కానింగ్ తీసి మోకాలిచిప్ప దెబ్బతిందని, ఆపరేషన్ చెయ్యాలని చెప్పారు. ఆరోగ్యశ్రీపై ఆపరేషన్ చేసారు. 15 రోజులవుతున్నా మోకాలి నొప్పి, వాపు కూడా తగ్గలేదు. ఆ విషయమే వైద్యులను అడిగితే మోకాలిలో ఇన్‌ఫెక్షన్ వచ్చింది.. వేరే ఆస్పత్రిలో చూపించుకోమని చికిత్స అందించకుండా డిశ్చార్జిచేసి పంపించేశారు.మళ్లీ ఆపరేషన్ చేయాలని చెప్పారు. అంతేకాకుండా మర్నాడే నడిచి వెళ్లిపోవచ్చు.. ఇబ్బందేం ఉండదని చెప్పి నమ్మించారు.
మరిన్ని వీడియోల కోసం :
కాసులకు కక్కుర్తిపడితే ఊచలు తప్పవు..బెట్టింగ్ బంగార్రాజులు బీ కేర్‌ఫుల్ వీడియో
38 గంటలు కదలకుండా నిలబడ్డ యూట్యూబర్.. బుగ్గ గిల్లినా డిస్టర్బ్ కాలేదు వీడియో
నిమ్మచెట్టు గ్రహదోషాలను తొలగిస్తుందా?వీడియో
మహా సముద్రంలో అంతుచిక్కని అద్భుతం.. సైంటిస్టులే షాక్!వీడియో