దేవుడికి నైవేద్యంగా వైన్.. వీడియో వైరల్
మనం భగవంతుడికి పూజ చేసి తోచింది నైవేద్యంగా సమర్పిస్తాం. పాలు, అరటిపళ్లు, కొబ్బరికాయలు, స్వీట్స్ ఇలా ఏదొకటి సమర్పిస్తాం. కానీ పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక వైన్ షాప్ నిర్వాహకులు తమ వ్యాపారం బాగా సాగాలని దేవుడిని కోరుతూ మద్యం దేవుడికి నైవేద్యంగా సమర్పించారు. ఇలా మద్యం బాటిళ్లు దేవుడిదగ్గర ఉంచి రోజూ పూజలు చేస్తున్నారు. మద్యం కొనుక్కోడానికి దుకాణానికి వెళ్లినవాళ్లు అది చూసి ఇదెక్కడి విడ్డూరం అంటూ ఆశ్చర్యపోతున్నారు. పనిలో పనిగా ఈ ప్రసాదాన్ని మాలాంటి భక్తులకు పంచితే బావుండునని అంటున్నారు.
పశ్చిమగోదావరి జిల్లాలో కొందరు వైన్ షాపు నిర్వహిస్తున్నారు. ప్రతిరోజూ తమ వ్యాపారం బాగా జరగాలని షాపులో దేవునికి పూజ చేస్తున్నారు. ప్రతిరోజూ ఏదొక నైవేద్యం పెడుతున్నారు. ఈ క్రమంలో వారు ప్రతిరోజూ దేవుడికి ఒకే రకమైన నైవేద్యం పెట్టి బోర్ కొట్టినట్టుంది. మనం తినే ఆహారాన్నే రకరకాలుగా తయారుచేసి దేవునికి పెడుతున్నాం.. కానీ ఎంతో ఇష్టంగా తాగే మద్యాన్ని ఎందుకు దేవుడికి పెట్టకూడదు అనుకున్నారు. అంతే ఉదయాన్నే షాపు ఓపెన్ చేయగానే శుద్ధి చేసి, చక్కగా దేవుడి పటాలు పూలతో అలంకరించి దీపం వెలిగించి, ధూపం వేసి, నైవేద్యంగా రెండు ఫుల్ మందు బాటిళ్లను నైవేద్యంగా సమర్పించారు. మందు స్ట్రాంగ్‌గా అనిపిస్తే కొంచెం వాటర్ కలుపుకోమని పక్కనే ఉద్దరినితో నీళ్లు కూడా పెట్టారు. ఇదంతా ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు తమదైనశైలిలో స్పందించారు. ఇలా దేవుడికి రోజూ మద్యం నైవేద్యంగా పెడితే.. మందు బాబులు మద్యం కొనడం మానేసి ఆలయాల్లో ప్రసాదం కోసం క్యూ కట్టినట్టు ఈ మద్యం ప్రసాదం కోసం దుకాణం ముందు క్యూ కడతారేమో అంటున్నారు.
మరిన్ని వీడియోల కోసం :
కాసులకు కక్కుర్తిపడితే ఊచలు తప్పవు..బెట్టింగ్ బంగార్రాజులు బీ కేర్‌ఫుల్ వీడియో
38 గంటలు కదలకుండా నిలబడ్డ యూట్యూబర్.. బుగ్గ గిల్లినా డిస్టర్బ్ కాలేదు వీడియో
నిమ్మచెట్టు గ్రహదోషాలను తొలగిస్తుందా?వీడియో
మహా సముద్రంలో అంతుచిక్కని అద్భుతం.. సైంటిస్టులే షాక్!వీడియో