AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లక్కు కాలింగ్‌ బెల్‌ కొట్టినా, తొక్కలో దరిద్రం నెత్తి మీద డిస్కో ఆడింది!

అదృష్ట దేవత కాలింగ్‌ బెల్‌ కొట్టినా దరిద్రం నెత్తి మీద డిస్కో చేస్తుంటే ఎవరు మాత్రం బాగుచేయగలరు? అమెరికాలోని ఓ మహిళకు ఇలాంటి పరిస్థితే ఎదురయ్యింది.

లక్కు కాలింగ్‌ బెల్‌ కొట్టినా, తొక్కలో దరిద్రం నెత్తి మీద డిస్కో ఆడింది!
190 Crores Rupees Californi
Balu
| Edited By: Phani CH|

Updated on: May 15, 2021 | 3:58 PM

Share

అదృష్ట దేవత కాలింగ్‌ బెల్‌ కొట్టినా దరిద్రం నెత్తి మీద డిస్కో చేస్తుంటే ఎవరు మాత్రం బాగుచేయగలరు? అమెరికాలోని ఓ మహిళకు ఇలాంటి పరిస్థితే ఎదురయ్యింది. లాటరీలో 190 కోట్ల రూపాయల ప్రైజ్‌మనీ వచ్చినా తీసుకోలేని దౌర్భాగ్యం ఆమెది.. అసలేం జరిగిందంటే లాస్టియర్‌ నవంబర్‌లో ఓ మహిళ నోర్‌వాక్‌లోని ఓ గ్యాస్‌స్టేషన్‌లో సూపర్‌లాటో ప్లస్‌ లాటరీ టికెట్‌ను కొనింది. కొనేసింది కానీ ఆ టికెట్‌ను జేబులో పెట్టుకుంది.. మరుసటి రోజు ఆ ప్యాంట్‌ను లాండ్రీకి వేసింది. లాటరీ ద్వారా వచ్చే మొత్తాన్ని క్లయిమ్‌ చేసుకునేందుకు మే 13 చివరి తేదీ అన్న ప్రకటన చూసిన తర్వాతే ఆమెకు లాటరీ టికెట్‌ కొన్న విషయం గుర్తుకొచ్చింది. గుర్తుకు రావడమే తరువాయి షాపుకు పరుగులు పెట్టింది. గడువు ముగిసే వరకు అక్కడే ఉంది.. లాటరీ టికెట్‌ పట్టుకుని షాపుకు ఎవరూ రాలేదు. ఎవరూ క్లయిమ్‌ చేసుకోలేదు.. దాంతో తన నంబర్‌కే లాటరీ తగిలిందనే గట్టి నమ్మకానికి వచ్చిందామె! తనకే ఆ డబ్బులు ఇవ్వాలంటూ షాపు నిర్వాహకులను అడిగారు.. అబ్బే.. అలా ఎలా కుదురుతుంది..? టికెట్‌ చూపించాలిగా అని అన్నారు షాపు వాళ్లు.. నిజమే కదా! లాటరీ గెల్చుకున్నవారు కచ్చితంగా క్లయిమ్‌ ఫామ్‌ పూర్తి చేయాల్సి ఉంటుంది. టికెట్ కూడా చూపించాల్సి ఉంటుంది. టికెట్‌ పోగొట్టుకుంటే కనీసం దాని కాపీ అయినా చూపించాలి. ఇవేమీ ఆమె చూపించలేదు కాబట్టి ఆమెకు డబ్బులు ఇవ్వలేదంటున్నారు షాపు వాళ్లు..ఆమె తమ స్టోర్‌కు వచ్చిన మాట నిజమేనని, టికెట్‌ కొన్న మాట కూడా వాస్తవమేనని, ఇందుకు సంబంధించిన వీడియో ఫుటేజ్‌ తాము లాటరీ నిర్వాహకులకు పంపించామని షాపు నిర్వాహకులు చెబుతున్నారు. దీనిపై విచారణ చేపట్టి తగు నిర్ణయం తీసుకుంటామన్నారు. ఒకవేళ ఆమె టికెట్‌కు కూడా లాటరీ టికెట్‌ తగల్లేదని రుజువైతే మాత్రం ఆ డబ్బును కాలిఫోర్నియా పబ్లిక్‌ స్కూల్‌కు విరాళంగా ఇస్తామని లాటరీ నిర్వాహకులు చెబుతున్నారు.

మరిన్ని ఇక్కడ చూడండి: BECIL Recruitment 2021: బ్రాడ్‌కాస్ట్ ఇంజినీరింగ్ క‌న్స‌ల్టెంట్స్ ఇండియాలో ఉద్యోగాలు.. ఇంట‌ర్వ్యూ ద్వారా ఎంపిక‌..

Weight Loss: ఈ పదార్థాలను తింటే సులభంగా బరువు తగ్గడం ఖాయం.. అవెంటో తెలుసా..