ONLINE TERRORISM: వేళ్ళూనుకుంటున్న ఆన్‌లైన్ టెర్రరిజమ్.. టెక్కీల సాయంతో అంతానికి అగ్రరాజ్యం స్కెచ్
ప్రపంచం యావత్తు కరోనా వైరస్ ధాటికి వణికిపోతోంది. ఈ మహమ్మారి ఏనాటికి అంతమవుతుందో తెలియక పలు దేశాధినేతలు తలలు బద్దలు కొట్టుకుంటున్న పరిస్థితి. అయితే.. ఇంతకంటే డేంజరస్ వైరస్‌ను యువతకు...
ONLINE TERRORISM NEW CONCERN OF AMERICA: ప్రపంచం యావత్తు కరోనా వైరస్(CORONA VIRUS) ధాటికి వణికిపోతోంది. ఈ మహమ్మారి ఏనాటికి అంతమవుతుందో తెలియక పలు దేశాధినేతలు తలలు బద్దలు కొట్టుకుంటున్న పరిస్థితి. అయితే.. ఇంతకంటే డేంజరస్ వైరస్ (DANGEROUS VIRUS)ను యువతకు ఎక్కిస్తున్నాయి ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థలు (ISLAMIC TERORRIST ORGANISATIONS). ఆన్‌లైన్ ద్వారా అమాయక యువతకు ఉగ్రవాదాన్ని నూరిపోస్తున్న అతివాద సంస్థలిపుడు పలు దేశాలకు సవాళ్ళను విసురుతున్నాయి. మరీ ముఖ్యంగా అమెరికా (AMERICA), ఇండియా (INDIA), యూరోపియన్ దేశాలల్లో నిరుద్యోగ యువతకు ఉగ్రవాద సంస్థలు ఆన్ లైన్ (ONLINE) ద్వారా ఉగ్రవాదాన్ని నూరి పోస్తున్నాయి. దేశాల సార్వభౌమత్వానికి సవాల్ విసురుతున్నాయి. దేశాలకు వ్యతిరేకంగా ఆ యువత పని చేసేలా.. తమ ఉగ్రదాడుల్లో ఉపయోగపడేలా ఇస్లామిక్ తీవ్రవాద సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. చాపకింద నీరులా వ్యాపిస్తున్న ఆన్‌లైన్ ఉగ్రబోధనలపై ఇపుడు అగ్రరాజ్యం అమెరికా దృష్టి సారించింది. అమెరికాతోపాటు పలు ఉగ్రవాద బాధిత దేశాలు కూడా ఈ దిశగా కలిసి పని చేసేందుకు ముందుకు వస్తున్నాయి.
ఆన్‌లైన్ ద్వారా శరవేగంగా విస్తరిస్తున్న హింసాత్మక ఉగ్రవాదాన్ని నిరోధించే లక్ష్యంతో మొట్టమొదటి సారిగా అమెరికాతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కొన్ని దేశాల ప్రభుత్వాలు, దిగ్గజ టెక్ సంస్థలు మే 14న వర్చువల్‌గా ఒకే వేదికపైకి చేరాయి. మే 14న జరిగిన ఈ సమావేశంలో న్యూజిల్యాండ్ (NEWZEALAND) ప్రధాని ఆర్దెర్న్ కీలకోపన్యాసం చేశారు. భావ ప్రకటనా స్వేచ్ఛను గౌరవిస్తూ ఆన్‌లైన్‌లో అతివాద భావజాలం విస్తరించకుండా నివారించే విషయంలో మరింత స్పష్టత అవసరమని ఆయనన్నారు. ఈ విషయంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సానుకూలంగా స్పందించినందుకు ఆర్దెర్న్‌తోపాటు ఫ్రాన్స్ (FRANCE) అధ్యక్షుడు మేక్రాన్ హర్షం వ్యక్తం చేశారు.
ఉగ్రవాదులు, తీవ్రవాదులు ఇతరులను ప్రేరేపించేందుకు, అతివాదంలోకి అమాయక యువతను లాగేందుకు ఇంటర్నెట్‌ను ఉపయోగించుకోకుండా చూడటం ప్రథమ ప్రాధాన్యమని అమెరికా (AMERICA) అధ్యక్ష భవనం (WHITE HOUSE) ప్రతినిధి జెన్ సాకి తెలిపారు. తమ దేశాల్లో జరిగిన ఉగ్రవాద దాడుల నేపథ్యంలో మొదటిసారిగా 2019లో న్యూజిల్యాండ్ ప్రధానమంత్రి జెసిండా ఆర్దెర్న్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మేక్రాన్ ఈ సమ్మిట్‌ను ప్రారంభించారు. వీరి ప్రయత్నాలకు క్రైస్ట్‌చర్చి (CHRISTCHURCH) పిలుపుగా పేరు వచ్చింది. 2019లో న్యూజిల్యాండ్‌లోని క్రైస్ట్‌చర్చిలోని ఒక మసీదులో ప్రార్థనలు చేస్తున్న వారిపై ఒక తీవ్రవాది జరిపిన కాల్పుల్లో 51 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఆనాటి నుంచి న్యూజీలాండ్ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా గట్టి యత్నాలు మొదలు పెట్టింది.
అప్పట్లో ఈ ఘటన ఫేస్‌బుక్ (FACE BOOK)లో ప్రత్యక్ష ప్రసారం కావడం తీవ్ర సంచలనం రేపింది. ఇప్పటి వరకు 50కి పైగా దేశాలు, గూగుల్ (GOOGLE), ఫేస్‌బుక్, ట్విట్టర్ (TWITTER), అమెజాన్ (AMAZON) వంటి టెక్ దిగ్గజాలు కూడా క్రైస్ట్‌చర్చి పిలుపునకు మద్దతు ప్రకటించాయి. తాజాగా అమెరికాతోపాటు నాలుగు దేశాలు వీరికి తోడయ్యాయి. ఆయా దేశాల ప్రభుత్వాలు, టెక్ సంస్థలు ఆన్‌లైన్‌లో ఉండే హింసను ప్రేరేపించే అతివాద సంబంధ సమాచారాన్ని గుర్తించే విషయంలో పరస్పరం సహకరించుకుంటున్నాయి. భారత్ (BHARAT)లో మరీ ముఖ్యంగా కశ్మీరీ యువతకు ఉగ్ర పాఠాలను పాకిస్తాన్ (PAKISTAN) స్థావరంగా పని చేసే ఇస్లామిక్ (ISLAMIC) ఉగ్రవాద సంస్థలు నూరి పోస్తున్నాయి. ఆన్ లైన్‌లో ఉగ్రపాఠాలను చెబుతున్న ఇస్లామిక్ తీవ్ర వాద సంస్థలు బాంబుల తయారీని కూడా ఆన్‌లైన్‌లోనే నేర్పిస్తున్నాయి. గతంలో తాము జరిపిన ఉగ్ర దాడుల దృశ్యాలను చూపిస్తూ.. ఉగ్రవాదులుగా మారే యువకులు హీరోల్లా వీరమరణం పొందుతారని ప్రేరేపిస్తున్నారు. హైదరాబాద్ (HYDERABAD) పాతబస్తీలోను ఇలాంటి ఆన్‌లైన్ ఉగ్రబోధనా యత్నాలను పోలీసులు గతంలో చాలా సార్లు అడ్డుకున్న విషయం తెలిసిందే.
ALSO READ: వ్యాక్సిన్ ఉత్పత్తి సామర్థ్యం పెంపునకు తొలగిన అడ్డంకి.. శభాష్ దోవల్ జీ..!