అరుణ గ్రహంపై దిగిన చైనా అంతరిక్ష నౌక ‘జురాంగ్, పారాచూట్ సాయంతో రెడ్ ప్లానెట్ పై ‘అడుగు’, శాస్త్రజ్ఞుల హర్షం

చైనా అంతరిక్ష నౌక 'జురాంగ్' శనివారం అంగారక గ్రహంపై దిగింది. పారాచూట్ ని వినియోగించి ఈ లాండర్ ఈ గ్రహ ఉపరితలంపై 'కాలు మోపిందని' చైనా శాస్త్రజ్ఞులు తెలిపారు.

అరుణ గ్రహంపై దిగిన చైనా అంతరిక్ష నౌక 'జురాంగ్, పారాచూట్ సాయంతో రెడ్ ప్లానెట్ పై 'అడుగు', శాస్త్రజ్ఞుల హర్షం
Space Research
Follow us
Umakanth Rao

| Edited By: Phani CH

Updated on: May 15, 2021 | 12:58 PM

చైనా అంతరిక్ష నౌక ‘జురాంగ్’ శనివారం అంగారక గ్రహంపై దిగింది. పారాచూట్ ని వినియోగించి ఈ లాండర్ ఈ గ్రహ ఉపరితలంపై ‘కాలు మోపిందని’ చైనా శాస్త్రజ్ఞులు తెలిపారు. అసలు ఈ లాండర్ సురక్షితంగా దిగుతుందా అని అంతా సుమారు 7 నిముషాలపాటు ఊపిరి బిగబట్టి చూశారు.యుటోపియా ప్లాంషియా పేరిట ఈ గ్రహంమీది నార్తర్న్ లావా జాడలను కూడా ఇది పరిశోధిస్తుందని రీర్చర్లు తెలిపారు. ‘నిహావో మార్స్’ అని ఈ మిషన్ ని చైనా పేర్కొంటోంది. ఈ రోవర్ ముందుగా ఎంపిక చేసిన చోట విజయవంతంగా దిగిందని చైనా సీసీటీవీ బ్రాడ్ కాస్టర్ ప్రత్యేక టీవీ ప్రోగ్రాంలో పేర్కొంది.అరుణ గ్రహంపై తన లాండింగ్, ఆర్బిటింగ్, రోవింగ్ ఆపరేషన్లు చేసిన తొలి దేశంగా చైనా పాపులర్ అయింది. ఆరు చక్రాలు కలిగి, సౌర శక్తితో పని చేసే జురాంగ్ అంగారక గ్రహంమీది శిలలను, మట్టిని కూడా విశ్లేషిస్తుందని అంటున్నారు. జురాంగ్ అంటే చెనీయులు పవిత్రంగా ఆరాధించే అగ్నిదేవుడట. 240 కేజీల బరువున్న తమ లాండర్ విజయవంతంగా ఈ గ్రహంపై దిగడాన్ని అద్భుతంగా చైనా నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ అభివర్ణించింది. ఈ రోవర్ 3 నెలల పాటు అంగారక గ్రహంపైని భౌగోళిక, వాతావరణ అంశాలను కూడా పరిశోధిస్తుందని ఈ సంస్థ వెల్లడించింది.

గతంలో తమ రోవర్లను అరుణ గ్రహంపై దింపడంలో అమెరికా, రష్యా, యూరోపియన్ దేశాలు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. 2016 లో రష్యన్-యూరోపియన్ అంతరిక్ష నౌక”షియాపరెల్లి’ విఫలమైంది. అయితే అమెరికాలోని నాసా ఆ మధ్య పంపిన పర్సేవెరెన్స్ రోవర్ విజయవంతంగా దిగి పరిశోధనలు సాగిస్తోంది. కాగా చైనా ఈ మధ్య ప్రయోగించిన ‘లాంగ్ మార్చ్ 5 బీ ‘ రాకెట్ హిందూమహాసముద్రంలో క్రాష్ అయింది.

మరిన్ని ఇక్కడ చూడండి: చిత్రకూట్ జైల్లో కాల్పుల ఘటన, యూపీ ప్రభుత్వం సీరియస్, పని చేయని మూడు సీసీటీవీ కెమెరాలు, ప్లాన్ ప్రకారమే జరిగిందా ?

Ashim Banerjee: బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఇంట విషాదం.. కరోనాతో ఆమె సోదరుడు కన్నుమూత