డ్రాగన్ కంట్రీ ఖాతాలో మరో విజయం.. అంగారక గ్రహంపై విజయవంతంగా దిగిన ఝురోంగ్

China's 1st Mars Rover: ఏడు నెలల అంతరిక్ష ప్రయాణం తర్వాత చైనాకు చెందిన ఝురోంగ్ రోవర్ శనివారం ఉదయం విజయవంతంగా అంగారక గ్రహంపై దిగింది. చైనా జాతీయ అంతరిక్ష పరిపాలన విభాగం...

డ్రాగన్ కంట్రీ ఖాతాలో మరో విజయం.. అంగారక గ్రహంపై విజయవంతంగా దిగిన ఝురోంగ్
Mars China
Follow us

|

Updated on: May 15, 2021 | 10:44 AM

ప్రంపంచం అంతా కోవిడ్‌తో పోరాడుతుంటే…  చైనా మాత్రం అంతరిక్ష పరిశోధనలు, ప్రయోగాలు చేసుకుంటూ పోతోంది. అంతరిక్షంపై పెత్తనం చేసేందుకు రెడీ అవుతోంది. నాసా, ఇస్రోలను వెనక్కి నెట్టేందుకు తెగ ప్రయత్నిస్తోంది. అంగారక గ్రహం (మార్స్Mars)పై ద‌ృష్టి పెట్టింది. ఏడు నెలల అంతరిక్ష ప్రయాణం తర్వాత చైనాకు చెందిన ఝురోంగ్ రోవర్ శనివారం ఉదయం విజయవంతంగా అంగారక గ్రహంపై దిగింది. చైనా జాతీయ అంతరిక్ష పరిపాలన విభాగం (సిఎన్‌ఎస్‌ఎ)ఈ విషయాన్ని ధృవీకరించింది. చైనా మొట్టమొదటి రోవర్ జురాంగ్ విజయవంతంగా అంగారక గ్రహంపైకి దిగినట్లు సిఎన్‌ఎస్‌ఎ నివేదించింది.

ఝురోంగ్ అనే రోవర్‌ని విజయవంతంగా అక్కడ దింపింది. మార్స్‌పై రోవర్‌ని దింపినవారిలో అమెరికా తర్వాత స్థానంలో చైనా నిలిచింది. శనివారం ఉదయం మార్స్ పై ఉన్న సున్నితమైన వాతావరణంలో… రోవర్‌ను సురక్షితంగా దింపినట్లు చైనా అధికారిక మీడియా వెల్లడించింది. ఇక మార్స్‌పై ప్రయోగాలు చేయబోతోంది. అక్కడి వాతావరణంను అత్యంత దగ్గర నుంచి రోవర్ ద్వారా పరిశీలించనుంది. అక్కడ వచ్చే ఏడాదికల్లా సొంతంగా స్పేస్ స్టేషన్ కట్టేస్తానంటూ ప్రపంచ దేశాలకు సవాల్ విసురుతోంది.

తన సొంత అంతరిక్ష కేంద్రం కోసం ఓ కోర్ మాడ్యూల్‌ని గత నెలలో రోదసిలో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.. అలాగే… గత డిసెంబర్‌లో చంద్రుడి నుంచి 2 కేజీల రాళ్లను చైనా భూమికి తీసుకొచ్చింది. వచ్చే నెలలో చైనా… ముగ్గురు వ్యోమగాముల్ని అంతరిక్షంలోకి పంపబోతోంది. ఇలా చైనా అన్ని రకాలుగా అంతరిక్ష పరిశోధనలు, ప్రయోగాలను వేగవంతం చేసింది.

అయితే ఇన్నాళ్లూ తమకు తిరుగులేదు అనిపించుకుంటున్న నాసాకు… చైనా గట్టి పోటీగా మారుతోంది. ఈ విషయంపై నాసాకి చెందిన అసోసియేట్ అడ్మినిస్ట్రేటర్ ఫర్ సైన్స్ థామస్ జుర్బుచెన్ స్పందించారు. చైనాకి శుభాకాంక్షలు తెలిపిన ఆయన… కలిసి ముందుకు సాగుదాం అన్నారు. రెడ్ ప్లానెట్‌ను మరింతగా అర్థం చేసుకోవడానికి వీలవుతుంది అన్నారు.

ఇవి కూడా చదవండి:  Odisha Car Accident: ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం… బ్రిడ్జిపై నుంచి కిందపడ్డ కారు.. ముగ్గురు మృతి, ఇద్దరికి తీవ్రగాయాలు

టీ 20 స్పెషలిస్ట్ బౌలర్ రిటైర్మెంట్..! అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు.. కారణం ఏంటో తెలుసా..?

Murder: సంగారెడ్డి జిల్లాలో దారుణం.. ఇటుక బట్టీ కార్మికుడి గొంతు కోసి హతమార్చిన గుర్తుతెలియని దుండగులు