Murder: సంగారెడ్డి జిల్లాలో దారుణం.. ఇటుక బట్టీ కార్మికుడి గొంతు కోసి హతమార్చిన గుర్తుతెలియని దుండగులు

సంగారెడ్డి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. నిద్రిస్తున్న వ్యక్తిని అతి దారుణంగా హతమార్చారు.

Murder: సంగారెడ్డి జిల్లాలో దారుణం.. ఇటుక బట్టీ కార్మికుడి గొంతు కోసి హతమార్చిన గుర్తుతెలియని దుండగులు
Murder

Man murdered: సంగారెడ్డి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. నిద్రిస్తున్న వ్యక్తిని అతి దారుణంగా హతమార్చారు. జిల్లాలోని గుమ్మడిద‌ల మండ‌లం అన్నారంలో దుండ‌గులు ఓ వ్యక్తిని అత్యంత కిరాతకంగా హత్య చేశారు. అన్నారం ఇటుక బట్టీలలో హిమాన్షు పటేల్ (23) అనే వ్యక్తిని గుర్తుతెలియని వ్యక్తులు గొంతుకోసి హత్య చేశారు. ఈ ఘటనకు సంబంధించి స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నా స్థలానికి చేరుకున్నారు. మృత‌దేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం సంగారెడ్డి జిల్లా ఆసుపత్రికి త‌ర‌లించారు. ఆ ఘ‌ట‌న‌పై కేసు నమోదుచేసి దర్యాప్తు చేప‌ట్టారు. ఈ హ‌త్యకు సంబంధించి పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Read Also…  Cyclone Tauktae: ఇవాళ భీకర తుఫానుగా మారనున్న తౌక్తా తుఫాను… దేశంలోని పశ్చిమతీరంలో అలజడి సృష్టించే అవకాశం..!