చిత్రకూట్ జైల్లో కాల్పుల ఘటన, యూపీ ప్రభుత్వం సీరియస్, పని చేయని మూడు సీసీటీవీ కెమెరాలు, ప్లాన్ ప్రకారమే జరిగిందా ?

యూపీలోని చిత్రకూట్ జైల్లో నిన్న జరిగిన కాల్పుల ఘటనను ప్రభుత్వం సీరియస్ గా పరిగణించింది. ఈ జైల్లోని ఖైదీల్లో రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణల్లో ముగ్గురు మరణించారు.

చిత్రకూట్ జైల్లో కాల్పుల ఘటన,  యూపీ ప్రభుత్వం సీరియస్,  పని చేయని మూడు సీసీటీవీ కెమెరాలు, ప్లాన్  ప్రకారమే జరిగిందా ?
5 Jail Staff Suspended In C
Follow us
Umakanth Rao

| Edited By: Phani CH

Updated on: May 15, 2021 | 12:53 PM

యూపీలోని చిత్రకూట్ జైల్లో నిన్న జరిగిన కాల్పుల ఘటనను ప్రభుత్వం సీరియస్ గా పరిగణించింది. ఈ జైల్లోని ఖైదీల్లో రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణల్లో ముగ్గురు మరణించారు. వీరిలో పలు క్రిమినల్ రికార్డు చరిత్రలున్న గ్యాంగ్ స్టర్ ముకిమ్ కోలా కూడా ఉన్నాడు. వీరి మధ్య ఘర్శణ జరగడానికి ముందు మూడు సీసీటీవీ కెమెరాలు పని చేయలేదని తాజా విచారణలో తేలిసింది. ఈ ఘటనకు సంబంధించి నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న ఆరోపణపై జైలు సూపరింటెండెంట్ ఎస్.పి/త్రిపాఠీ, జైలర్ మహేంద్రపాల్ సహా ముగ్గురు గార్డులను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. కాల్పుల ఘటనకు ముందు నుంచే ఈ జైల్లోని మూడు సీసీటీవీ కెమెరాలు పని చేయలేదంటే.. ఖైదీలకు, జైలు సిబ్బందికి మధ్య ఏవో లావాదేవీలు జరిగి ఉంటాయని భావిస్తున్నారు. అసలు జైల్లోకి గన్స్ ఎలా వచ్చాయో మిస్టరీగా ఉంది. శుక్రవారం ఉదయం అన్షు దీక్షిత్ అనే ఖైదీ ఉన్నట్టుండి గార్డు దగ్గరున్న సర్వీస్ రివాల్వర్ లాక్కుని ముకిమ్ కోలాను, మిరాజుద్దీన్ అనే అతడి సహచరుడిని కాల్చి చంపాడు. మరో ఐదుగురు ఖైదీలను బందీలుగా చేసుకుని తప్పించుకుని పారిపోవడానికి ప్రయత్నించగా.. జైలు గార్డుల కాల్పుల్లో మృతి చెందాడు. ఇదంతా సినీ ఫక్కీలో జరిగింది. చిత్రకూట్ జైల్లో గ్యాంగ్ వార్ ఎప్పటినుంచో సీక్రెట్ గా జరుగుతున్నట్టు తెలుస్తోంది. ముకిమ్ కోలా ఆధిపత్యాన్ని సహించలేని అన్షుదీక్షిత్ పగ పెంచుకుని ఈ దారుణానికి దిగినట్టు తెలుస్తోంది. ఈ కాల్పుల ఘటనకు సంబంధించి మరికొందరు సిబ్బందిపై కూడా చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నట్టు అధికారులు చెప్పారు. . అటు మరో 20 మంది పోలీసులను అదనంగా నియమించారు.

మరిన్ని ఇక్కడ చూడండి: పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు కరగడం లేదా..! మతిమరుపు పెరిగిందా..? అయితే గ్రీన్ టీని ఈ స్టైల్‌లో ట్రై చేయండి..

Ram Pothineni: దేవదాసుగా ఎంట్రీ ఇచ్చి ఎనర్జిటిక్ స్టార్‏గా మారిన రామ్.. రాపో సినీ ప్రస్థానం..

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఉదయం అరెస్ట్‌.. సాయంత్రం బెయిల్‌.. ఈ కేసు కీలక అప్‌డేట్స్‌
ఉదయం అరెస్ట్‌.. సాయంత్రం బెయిల్‌.. ఈ కేసు కీలక అప్‌డేట్స్‌
ఈ కొల్లాజెన్ ఫుడ్స్ తిన్నారంటే.. అందం, ఆరోగ్యం మీ సొంతం..
ఈ కొల్లాజెన్ ఫుడ్స్ తిన్నారంటే.. అందం, ఆరోగ్యం మీ సొంతం..
పాపులర్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అనుమానాస్పద మృతి
పాపులర్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అనుమానాస్పద మృతి
ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు
ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు
మీ కారు టైర్లు త్వరగా అగిరిపోతున్నాయా? అసలు కారణాలు ఇవే..!
మీ కారు టైర్లు త్వరగా అగిరిపోతున్నాయా? అసలు కారణాలు ఇవే..!
హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా
హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా