Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

COVID VACCINATION: వ్యాక్సిన్ ఉత్పత్తి సామర్థ్యం పెంపునకు తొలగిన అడ్డంకి.. శభాష్ దోవల్ జీ..!

దేశంలో కరోనా వైరస్ సెకెండ్ వేవ్ ఉధృతంగా వ్యాప్తి చెందుతున్న సమయంలో వ్యాక్సినేషన్‌తోనే వైరస్ వ్యాప్తికి బ్రేక్ వేయొచ్చని ప్రభుత్వాలు భావిస్తున్నాయి. నాలుగు నెలల క్రితం మొదలైన వ్యాక్సినేషన్ పంపిణీ...

COVID VACCINATION: వ్యాక్సిన్ ఉత్పత్తి సామర్థ్యం పెంపునకు తొలగిన అడ్డంకి.. శభాష్ దోవల్ జీ..!
Vaccine
Follow us
Rajesh Sharma

|

Updated on: May 15, 2021 | 6:03 PM

COVID VACCINATION SPEEDING-UP PRODUCTION INCREASING: దేశంలో కరోనా వైరస్ సెకెండ్ వేవ్ (CORONA VIRUS SECOND WAVE) ఉధృతంగా వ్యాప్తి చెందుతున్న సమయంలో వ్యాక్సినేషన్‌ (VACCINATION)తోనే వైరస్ వ్యాప్తికి బ్రేక్ వేయొచ్చని ప్రభుత్వాలు భావిస్తున్నాయి. నాలుగు నెలల క్రితం మొదలైన వ్యాక్సినేషన్ పంపిణీ ఇప్పటికి కేవలం 18 కోట్ల మంది దేశ ప్రజలకు మాత్రమే చేరింది. అయితే.. ప్రపంచంలో వేగంగా వ్యాక్సిన్ ను పంపిణీ చేస్తున్న దేశంలో మన దేశమే నెంబర్ వన్‌గా వుండడం విశేషం. కానీ.. మన దేశ జనాభాను దృష్టిలో పెట్టుకుంటే వ్యాక్సినేషన్‌పై ఇదివరకే పక్కా ప్రణాళిక రూపొందించి, అమలు చేయాల్సి వుండింది. కానీ.. తయారీ సంస్థలు తమ పూర్తి సామర్థ్యం మేరకు ఉత్పత్తి చేస్తున్నా.. దేశ ప్రజల అవసరాలకు అనుగుణంగా వ్యాక్సిన్ డోసులను ఉత్పత్తి చేయలేకపోతున్నాయి. తాజాగా సెకెండ్ వేవ్ మొదలైన తర్వాత కేంద్ర ప్రభుత్వం (UNION GOVERNMENT) వ్యాక్సిన్ ఉత్పత్తిని వేగవంతం చేసేందుకు చర్యలకు ఉపక్రమించింది. అందులో భాగంగా వ్యాక్సిన్ తయారీకి కావాల్సిన ముడి పదార్థాలను (RAW MATERIAL) వేగంగా వ్యాక్సిన్ తయారీ సంస్థలకు అంద జేసేందుకు ప్రయత్నించింది. కానీ ఈ ముడి పదార్థాల పేటెంట్ హక్కులు (PATENT RIGHTS) అమెరికా (AMERICA), జర్మనీ (GERMANY), ఫ్రాన్స్ (FRANCE) వంటి దేశాల చేతుల్లో వుండడం వల్ల దేశంలో కరోనా వ్యాక్సిన్ (CORONA VACCINE) తయారీ వేగవంతం కాలేదు. ఉత్పత్తి సామర్థ్యం పెరగలేదు.

దాంతో ప్రధాన మంత్రి (PRIME MINISTER) నరేంద్ర మోదీ (NARENDRA MODI) తనకు అత్యంత విశ్వసనీయుడైన జాతీయ భద్రతా సలహాదారు (NATIONAL SECURITY ADVISER) అజిత్ దోవల్‌ (AJIT DOWAL)ని రంగంలోకి దింపారు. ఆయన జరిపిన సంప్రదింపుల ఫలితంగా ముడి పదార్థాల సరఫరాకు అమెరికా ముందుకొచ్చింది. గత సంవత్సరం కరోనా తొలి వేవ్ విరుచుకుపడినప్పుడు హైడ్రో క్లోరోక్విన్‌ (HYDRO CHLOROQUINE)ను అమెరికాకు పెద్ద ఎత్తున సరఫరా చేసిన విషయాన్ని గుర్తు చేయడం ద్వారా అజిత్ దోవల్ తన దౌత్య నీతిని ప్రదర్శించి.. అమెరికాను దిగివచ్చేలా చేసినట్లు సమాచారం. అదే సమయంలో యూరోపియన్ దేశాలకు (EUROPEAN COUNTRIES) మన దేశం తొలి వేవ్ సందర్భంగా ఎలా సాయమందించింది.. కూడా దోవల్ దౌత్య యత్నాలలో విరివిగా ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ఫలితంగానే వ్యాక్సిన్ తయారీకి కావాల్సి ముడి పదార్థాలను ఇచ్చేందుకు అమెరికా, ఫ్రాన్స్ దేశాలు అంగీకరించాయి. ఈ మేరకు హామీ లభించినందువల్లనే కోవాక్జిన్ (COVAXIN) ఉత్పత్తిని నెలకు పది కోట్ల డోసులకు పెంచనున్నట్లు భారత్ బయోటెక్ (BHARAT BIOTECH) ప్రకటించింది. ప్రస్తుతం కోవాక్జిన్ మంత్లీ ప్రొడక్షన్ కేవలం కోటిన్నర డోసులు మాత్రమే. అటు కోవీషీల్డు (COVIE SHIELD) వ్యాక్సిన్ ఉత్పత్తి కూడా దాదాపు పదింతలయ్యే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇదే జరిగితే.. మరో రెండు నెలల్లో దేశంలోని 18 ఏళ్ళకుపైబడిన వారందరికీ వ్యాక్సిన్ చేరే అవకాశాలున్నాయి.

అయితే.. ఇప్పటి వరకు నమోదవుతున్న గణాంకాలను పరిశీలిస్తే వ్యాక్సిన్ పంపిణీలో మహిళలు పెద్దగా ముందుకు రాని పరిస్థితి కనిపిస్తోంది. మగవారితో పోలిస్తే మహిళలు తక్కువగా వ్యాక్సిన్లు పొందుతున్నట్టుగా ప్రభుత్వ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. వీరిద్దరి మధ్య అంతరం జాతీయస్థాయిలో చూస్తే 4% కాగా, కరోనా ఉధృతి తీవ్రంగా ఉన్న ఉత్తరప్రదేశ్, ఢిల్లీ వంటి చోట్ల పురుష–స్త్రీ నిష్పత్తి అంతరం 10 శాతానికి పైగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇక నాగాలాండ్, జమ్మూకశ్మీర్‌ రాష్ట్రాల్లో మాత్రం ఈ తేడా 14% వరకు ఉంది. కొన్ని ఈశాన్య రాష్ట్రాల్లో కోవిడ్‌ కేసుల నమోదు సంఖ్య తక్కువగానే ఉన్నా వ్యాక్సినేషన్‌ విషయంలో మహిళల కంటే పురుషులకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నట్టు గణాంకాలను బట్టి స్పష్టమవుతోంది. నాగాలాండ్‌లో ఈ తేడా 14.6%, జమ్మూ,కశ్మీర్‌లో 13.76%, యూపీ, పంజాబ్, మణిపూర్, అరుణాచల్‌ప్రదేశ్‌లలో 10–13% మధ్యలో ఉండగా, చండీగడ్‌లో 11% ఉంది. అయితే కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే లింగ బేధం లేకుండా వ్యాక్సిన్‌ పంపిణీ జరుగుతోంది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో వ్యాక్సిన్‌ కొరత పట్టిపీడిస్తుండడంతో వ్యాక్సిన్ వేయించుకునేందుకు జనం భారీగా క్యూలు కడుతున్నారు. వ్యాక్సిన్‌ స్లాట్లు బుక్‌ చేసుకునేందుకు కూడా ఈమధ్య కాలంలో ఎక్కడా లేని రద్దీ పెరిగింది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మగ–ఆడ అనే లింగవివక్ష మరింతగా తెరపైకి వచ్చింది. కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, చత్తీస్‌గఢ్, హిమాచల్‌ప్రదేశ్‌ వంటి కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే కొన్ని సందర్భాల్లో మగవారి కంటే ఎక్కువ లేదా వారిలో సమానంగా వ్యాక్సిన్లు వేసిన పరిస్థితి కనిపిస్తోంది.

కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని కోవిన్‌ పోర్టల్‌లో పొందుపరిచిన వివరాల ప్రకారం.. దేశవ్యాప్తంగా మొత్తం 17.78 కోట్ల మందికి (మే 13 నాటికి) వ్యాక్సిన్లు వేయగా వారిలో 7.3 కోట్ల మంది పురుషులు, 6.5 కోట్ల మంది మహిళలు, 19వేల మంది ఇతరులున్నారు. తాజా గణాంకాల ప్రకారం (మే 14 నాటికి) చూస్తే… ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 75,70,522 మంది వ్యాక్సినేషన్‌ వేయగా వారిలో 54,74,395 మందికి మొదటి డోస్, 20,96,127 మందికి రెండో డోస్‌ వేశారు. వీరిలో పురుషులు, మహిళల సంఖ్య సమానంగా ఉంది. ఇక తెలంగాణ విషయానికొస్తే మొత్తం 55,13,261కి వ్యాక్సిన్లు వేశారు. అందులో 44,49,899 మందికి మొదటి డోస్, 10,63,362 మందికి రెండో డోస్‌ వేయించుకున్నారు. వీరిలో స్త్రీ, పురుషుల సంఖ్య దాదాపు సమానంగానే ఉంది.

ALSO READ: వేళ్ళూనుకుంటున్న ఆన్‌లైన్ టెర్రరిజమ్.. టెక్కీల సాయంతో అంతానికి అగ్రరాజ్యం స్కెచ్

డ్రమ్ములో వేసే ముందు భర్త బాడీతో ఏం చేసిందో తెలుసా?
డ్రమ్ములో వేసే ముందు భర్త బాడీతో ఏం చేసిందో తెలుసా?
మెగాస్టార్ చిరంజీవితో చిందులేసిన స్టార్ హీరోల భార్యలు వీరే!
మెగాస్టార్ చిరంజీవితో చిందులేసిన స్టార్ హీరోల భార్యలు వీరే!
CSK ప్రాక్టీస్ వదిలి సైనికుల మధ్యకు చేరుకున్న ధోనీ.. వీడియో వైరల్
CSK ప్రాక్టీస్ వదిలి సైనికుల మధ్యకు చేరుకున్న ధోనీ.. వీడియో వైరల్
చేసింది 5 సినిమాలే.. దెబ్బకు కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్ అయ్యింది
చేసింది 5 సినిమాలే.. దెబ్బకు కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్ అయ్యింది
పెళ్లైన పది రోజులకే భర్తను..! సమాజం ఎటు పోతుంది?
పెళ్లైన పది రోజులకే భర్తను..! సమాజం ఎటు పోతుంది?
కలలో నెమలి కనిపిస్తుందా.. మంచిదా.. చెడ్డదా తెలుసుకోండి...
కలలో నెమలి కనిపిస్తుందా.. మంచిదా.. చెడ్డదా తెలుసుకోండి...
పెళ్లి కావడం లేదని మనస్తాపంతో డాక్టర్ ఏం చేశాడంటే..
పెళ్లి కావడం లేదని మనస్తాపంతో డాక్టర్ ఏం చేశాడంటే..
ఫుల్లుగా మద్యం తాగి పరీక్షహాలుకు వచ్చిన 10th విద్యార్ధి.. ఆ తర్వత
ఫుల్లుగా మద్యం తాగి పరీక్షహాలుకు వచ్చిన 10th విద్యార్ధి.. ఆ తర్వత
తల్లైనా తగ్గని అందం.. కాజల్ ను చూస్తే మతిపోవాల్సిందే!
తల్లైనా తగ్గని అందం.. కాజల్ ను చూస్తే మతిపోవాల్సిందే!
ఏంటీ.. కేజీ మామిడి రూ.3 లక్షలా?.. పెరట్లో ఈ చెట్టుంటే కోటీశ్వరులే
ఏంటీ.. కేజీ మామిడి రూ.3 లక్షలా?.. పెరట్లో ఈ చెట్టుంటే కోటీశ్వరులే