Sanjay Kasula |
Updated on: May 15, 2021 | 8:15 PM
క్రిప్టో బిలియనీర్,ఎథీరియం సహ వ్యవస్థాపకుడు విటాలిక్ బుటెరిన్ భారతదేశ కోవిడ్ రిలీఫ్ కోసం భారీ విరాళాన్ని ప్రకటించాడు. ఒక బిలియన్ డాలర్ల విలువైన(సుమారు రూ. 7400 కోట్లు) క్రిప్టో కరెన్సీని విరాళంగా ఇచ్చారు.
బాట్రిన్ 1.1 బిలియన్ డాలర్లను విరాళంగా ఇచ్చినట్లుగా ముంబైకి చెందిన క్రిప్టోకరెన్సీ ఎక్స్ఛేంజ్ వాజిర్ఎక్స్ ప్రకటించింది. బినాన్స్ అనేది ప్రపంచ క్రిప్టోకరెన్సీ మార్పిడి, ఇది 2017 లో స్థాపించబడింది.
షిబా ఇను వెబ్‌సైట్‌లో లభించిన సమాచారం ప్రకారం, ఈ క్రిప్టోకరెన్సీని మాత్రమే యునిస్‌వాప్‌లో నేరుగా కొనుగోలు చేయవచ్చు లేదా అమ్మవచ్చు. వజీర్ ఎక్స్‌లోని షిబ్ నాణెం 3 రూపాయల స్థాయిలో జాబితా చేయబడింది.
బుటెరిన్ విరాళంపై భారత టెక్ వ్యవస్థాపకుడు సందీప్ నెయిల్వాల్ ట్విటర్‌లో బుటెరిన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఎథీరియంను ప్రారంభించింది నెయిల్‌వాల్. దేశంలోని కరోనా విపత్కర పరిస్థితులను అర్థం చేసుకుని స్పందించినందుకు బుటెరిన్‌కు ఆయన ధన్యవాదాలు తెలిపారు.
బిట్‌కాయిన్ తరువాత ప్రపంచంలో రెండవ అతిపెద్ద క్రిప్టోకరెన్సీ ఎథీరియం. దీని ధర మే 10న 3000 డాలర్లకు చేరుకున్నప్పుడు బుటెరిన్ నికర విలువ సుమారు 21 బిలియన్ల డాలర్లుగా ఉంది. ఈథర్ క్రిప్టోకరెన్సీ మార్కెట్ క్యాప్ 376 బిలియన్ డాలర్లుకుపై మాటే.ఈ సంవత్సరం ప్రారంభం నుండి ఈథర్ విలువ 325 శాతానికి పైగా పుంజుకోవడం విశేషం. దీంతో గత నెలలో ప్రపంచంలోనే 27 ఏళ్ల వయసులో అతి పిన్న వయస్కుడైన క్రిప్టో బిలియనీర్‌గా విటాలిక్ బుటెరిన్ అవతరించిన సంగతి తెలిసిందే.