AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Black Fungus: తెలుగు రాష్ట్రాల్లో బ్లాక్‌ఫంగస్‌ కేసులు.. శ్రీకాకుళం, ఖ‌మ్మం జిల్లాల్లో గుర్తింపు

అసలే కరోనా రక్కసి కొరల్లో చిక్కుకుని రాష్ట్రం అల్లాడిపోతోంది. ఇది చాలదన్నట్టు ఇప్పడు బ్లాక్‌ ఫంగస్‌ ముప్పు ముంచుకొస్తోంది. దేశంలో ముందుగా గుజరాత్‌‌లో కనిపించిన ఫంగస్...

Black Fungus: తెలుగు రాష్ట్రాల్లో  బ్లాక్‌ఫంగస్‌ కేసులు.. శ్రీకాకుళం, ఖ‌మ్మం జిల్లాల్లో గుర్తింపు
Black Fungus
Ram Naramaneni
|

Updated on: May 15, 2021 | 5:55 PM

Share

అసలే కరోనా రక్కసి కొరల్లో చిక్కుకుని రాష్ట్రం అల్లాడిపోతోంది. ఇది చాలదన్నట్టు ఇప్పడు బ్లాక్‌ ఫంగస్‌ ముప్పు ముంచుకొస్తోంది. దేశంలో ముందుగా గుజరాత్‌‌లో కనిపించిన ఫంగస్ తర్వాత ఢిల్లీ, మహారాష్ట్రకూ పాకింది. ఇప్పుడు తెలంగాణలో కూడా ఒక్కో జిల్లాలో బ్లాక్‌ ఫంగస్‌ కేసులు నమోదుకావడం భయాందోళనకు గురిచేస్తోంది. తాజాగా ఖమ్మం జిల్లాలోనూ బ్లాక్‌ఫంగస్‌ కేసును గుర్తించారు వైద్యులు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం నేరడ గ్రామానికి చెందిన తాళ్లూరి భద్రయ్యకు బ్లాక్ ఫంగస్ లక్షణాలు కనిపించాయి. ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న భద్రయ్యకు ఫంగస్‌ లక్షణాలు కనిపించడంతో వెంటనే అతన్ని హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి రిఫర్‌ చేశారు వైద్యులు. ఇటీవల కరోనా నుంచి కోలుకున్న తాళ్లూరి భద్రయ్య..కంటికి ఇన్ఫెక్షన్ కావడంతో పరిశీలించిన డాక్టర్లు..బ్లాక్ ఫంగస్ లక్షణాలను గుర్తించినట్లుగా చెప్పారు.

అరుదుగా వచ్చే ఈ మ్యూకోర్‌ మైకోసిస్‌ ఫంగస్ ప్రమాదకరమైనదే అంటున్నారు వైద్య నిపుణులు. కరోనా నుంచి కోలుకున్న లేదా కోలుకుంటున్నవారిలో ఈ బ్లాక్‌ ఫంగస్‌ లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్నట్లు వైద్యులు గుర్తించారు. కొవిడ్ వ్యాధి చికిత్సలో స్టెరాయిడ్లు అధికంగా వాడటం వల్ల ఈ వ్యాధి సోకే అవకాశాలు ఉన్నట్టు తెలిపారు. మ‌రోవైపు తెలంగాణ‌లో బ్లాక్ ఫంగ‌స్ కేసుల చికిత్స రాష్ట్ర ప్ర‌భుత్వం నోడ‌ల్ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది కోఠిలోని ఈ.ఎన్.టీ ఆస్ప‌త్రిని నోడ‌ల్ కేంద్రంగా ప్ర‌క‌టించింది.

ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో కూడా…

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటకు చెందిన ఓ ప్రైవేట్‌ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్‌ రామకృష్ణ ఈ వ్యాధి బారిన పడ్డారు. నరసన్నపేట మండలం దాసరి వానిపేట గ్రామానికి రామకృష్ణకు గత నెల 3న కోవిడ్ సోకింది. శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రిలో వారం రోజులపాటు ట్రీట్మెంట్ తర్వాత గత నెల 14న డిశ్చార్జ్‌ అయ్యారు. అనంతరం కొద్ది రోజులకు బ్లాక్‌ ఫంగస్‌ సోకినట్లు గుర్తించారు. ప్రస్తుతం అయిదుగురు వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్నట్లు ఆయన సోదరుడు అనిల్‌కుమార్‌ తెలిపారు.

Also Read: పెన్నుతో చెక్ చేసిన ఆక్సిజ‌న్ శాతం చూపిస్తోంది.. అస‌లు ఆక్సీమీట‌ర్లు ప‌నిచేస్తున్నాయా.? నిజ‌మేంటంటే..

స‌బ్బు పెట్టి.. బ్ర‌ష్ తో రుద్ది మరీ బ‌ట్ట‌లు ఉతుకుతున్న వాన‌రం.. సోష‌ల్ మీడియాలో ట్రెండింగ్

మోదీ పాలనలో అంబేద్కర్ ఆలోచనల ప్రతిధ్వని
మోదీ పాలనలో అంబేద్కర్ ఆలోచనల ప్రతిధ్వని
సైకిల్‌ కంటే నెమ్మదిగా ప్రయాణించే రైలు..! అయినా ఫుల్లు డిమాండ్..
సైకిల్‌ కంటే నెమ్మదిగా ప్రయాణించే రైలు..! అయినా ఫుల్లు డిమాండ్..
పంటి ఎనామిల్‌ను నాశనం చేస్తున్న అలవాటు.. మానకుంటే కష్టమే!
పంటి ఎనామిల్‌ను నాశనం చేస్తున్న అలవాటు.. మానకుంటే కష్టమే!
వైభవ్‎ సూర్యవంశీకి పట్టపగలు చుక్కలు చూపెట్టిన హైదరాబాద్ ప్లేయర్
వైభవ్‎ సూర్యవంశీకి పట్టపగలు చుక్కలు చూపెట్టిన హైదరాబాద్ ప్లేయర్
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ