Viral Video: స‌బ్బు పెట్టి.. బ్ర‌ష్ తో రుద్ది మరీ బ‌ట్ట‌లు ఉతుకుతున్న వాన‌రం.. సోష‌ల్ మీడియాలో ట్రెండింగ్

కోతులు చేష్ట‌లు ఎలా ఉంటాయో ప్ర‌త్యేకంగా చెప్పాలా..? త్రేతాయుగంలో చూసి ర‌మ్మంటే కాల్చి వ‌చ్చిన ద‌గ్గ‌ర నుంచి వాటి స‌ర‌దా పనులు చూస్తూనే ఉన్నాం...

Viral Video: స‌బ్బు పెట్టి.. బ్ర‌ష్ తో రుద్ది మరీ బ‌ట్ట‌లు ఉతుకుతున్న వాన‌రం.. సోష‌ల్ మీడియాలో ట్రెండింగ్
Monkey Washing Cloths
Follow us
Ram Naramaneni

|

Updated on: May 15, 2021 | 5:30 PM

కోతులు చేష్ట‌లు ఎలా ఉంటాయో ప్ర‌త్యేకంగా చెప్పాలా..? త్రేతాయుగంలో చూసి ర‌మ్మంటే కాల్చి వ‌చ్చిన ద‌గ్గ‌ర నుంచి వాటి స‌ర‌దా పనులు చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా ఆడుతూ, పాడుతూ ప‌నిచేస్తుంటే… అలుపూ, సొలుపూ ఉండ‌దూ అన్న‌ట్లుగా ఓ కోతి బట్టలు తెగ ఉతికేస్తోంది. దోబి ఘాట్‌లో కూర్చుని మనుషులు ఎలా బట్టలు ఉతికేస్తారో…అచ్చం అలాగే..కూర్చుని ఎంచక్కా ఉతికేస్తోంది. మనుషులు చేసినట్లుగానే బట్టల్ని నీళ్లలో త‌డిపింది.. సబ్బు పెట్టింది.. ఆ తర్వాత బట్టల బ్రష్‌కూడా వాడింది. దీంతో బట్టలు ఉతికిన కోతి వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. పైగా నీళ్లలో పూర్తిగా తడిసిపోయిన కోతి నెటిజ‌న్లు మరింత నవ్వు తెప్పిస్తోంది. అయితే ఇదంతా కూడా ఎవరో తమ ఫోన్ లో వీడియో తీసినట్లు ఉన్నారు. దాన్ని కాస్త సోషల్ మీడియా లో పోస్ట్ చేయడం తో ఇప్పుడు ఆ వీడియో వైరల్ గా మారింది.

నెటిజన్లు కూడా ఈ వీడియోపై తెగ కామెంట్లు పెడుతున్నారు. వాషింగ్ మెషిన్ల పుణ్యమా అని బట్టలు ఉతకటం మర్చిపోయిన కొందరికీ ఈ కోతి బాగానే గుర్తుచేస్తోందంటున్నారు. అరెరే కోతుల‌కు ట్రైనింగ్ ఇచ్చి ఇలా కూడా వినియోగించుకోవచ్చ‌ని మ‌రికొంద‌రు కామెంట్లు పెడుతున్నారు.

ఇంకెందుకు ఆల‌స్యం ఆ వీడియోపై మీరూ ఓ లుక్కెయ్యండి…

Also Read: ప్రస్తుతానికి షెడ్యూల్‌ ప్రకారమే టెన్త్‌ పరీక్షలు.. రాబోయే రోజుల్లో ప‌రిస్థితి ఇలానే ఉంటే..

10 వేలకు పైగా పాముల‌ను ర‌క్షించాడు.. కోవిడ్ కాటుకు బ‌లైపోయాడు