Coronavirus: 10 వేలకు పైగా పాముల‌ను ర‌క్షించాడు.. కోవిడ్ కాటుకు బ‌లైపోయాడు

Ram Naramaneni

Ram Naramaneni |

Updated on: May 15, 2021 | 5:05 PM

క‌ర్ర‌తో కొట్టి పాముల‌ను చంప‌డం వేరు..వాటిని ఒద్దిక‌గా ప‌ట్టుకుని.. అడ‌వుల్లో వ‌దిలిపెట్ట‌డం, అట‌వీ సిబ్బందికి అప్ప‌గించ‌డం వేరు. ఈ ప‌ని చేసేవారిని స్నేక్ క్యాచ‌ర్ అంటారు....

Coronavirus: 10 వేలకు పైగా పాముల‌ను ర‌క్షించాడు.. కోవిడ్ కాటుకు బ‌లైపోయాడు
Snack Catcher Died

క‌ర్ర‌తో కొట్టి పాముల‌ను చంప‌డం వేరు..వాటిని ఒద్దిక‌గా ప‌ట్టుకుని.. అడ‌వుల్లో వ‌దిలిపెట్ట‌డం, అట‌వీ సిబ్బందికి అప్ప‌గించ‌డం వేరు. ఈ ప‌ని చేసేవారిని స్నేక్ క్యాచ‌ర్ అంటారు. త‌మిళ‌నాడులో దాదాపు 10,000 పాముల‌ను ర‌క్షించిన ఓ స్నేక్ క్యాచ‌ర్ క‌రోనా కార‌ణంగా ప్రాణాలు విడిచాడు. వివ‌రాల్లోకి వెళ్తే.. స్టాన్లీ ఫెర్నాండెజ్ (62) అనే వ్య‌క్తి చెన్నైలోని అంబత్తూరులోని కల్లిక్కుప్పంలో నివ‌శిస్తుండేవాడు. అతను ప్యాక్ టీవీలో కెమెరామెన్ గా చేసి రిటైర‌య్యాడు. అయితే స్టాన్లీ ఫెర్నాండెజ్ గత 25 సంవత్సరాలుగా స్నేక్ క్యాచర్ గా సేవ‌లు అందిస్తున్నాడు. ఇళ్ళు, కార్యాలయాలతో సహా చెన్నైలోని వివిధ ప్రదేశాలలోకి చొరబడిన విష‌స‌ర్పాల‌ను ఎటువంటి భయం లేకుండా పట్టుకుని అటవీ, అగ్నిమాపక శాఖలకు ఆయన సహాయం చేస్తున్నారు. ఇప్పటివరకు 10,000 మందికి పైగా పాములను పట్టుకుని ప్రజలకు సేవ చేశాడు.

ఈ స్నేక్ క్యాచ‌ర్ గత 5 రోజులుగా కరోనాతో బాధపడుతున్నాడు. ప‌రిస్థితి కాస్త తీవ్రంగా ఉండ‌టంతో ఇటీవ‌ల కుటుంబ స‌భ్యులు అత‌డ్ని ఆసుపత్రిలో చేర్చారు. కానీ అక్క‌డి డాక్ట‌ర్లు మెరుగైన చికిత్స అందించినా కూడా ప్ర‌యోజ‌నం లేకుండా పోయింది. శుక్ర‌వారం రాత్రి విషాదకరంగా స్టాన్లీ ఫెర్నాండెజ్ మరణించాడు. కరోనాతో ఆసుపత్రిలో చేరే ముందు కూడా అత‌డు ఓ సర్పాన్ని ప‌ట్టుకుని అటవీ శాఖకు అప్పగించాడు. అతను 62 ఏళ్ల వ‌య‌స్సులో కూడా ఎటువంటి అనారోగ్యం లేకుండా స్ట్రాంగ్ గా ఉన్నాడు. కానీ కోవిడ్ మాత్రం అత‌డిని బ్ర‌త‌క‌నివ్వ‌లేదు. ఇప్పటివరకు 10,000లకు పైగా పాములను ధైర్యంగా పట్టుకున్న స్టాన్లీ ఫెర్నాండెజ్, కరోనాపై పోరులో చ‌నిపోవ‌డంతో ఆ ప్రాంత ప్రజలు విషాదంలో కూరుకుపోయారు. స్టాన్లీ ఫెర్నాండెజ్ కు భార్య‌, ఇద్ద‌రు కుమారులు ఉన్నారు.

Also Read: ప్రస్తుతానికి షెడ్యూల్‌ ప్రకారమే టెన్త్‌ పరీక్షలు.. రాబోయే రోజుల్లో ప‌రిస్థితి ఇలానే ఉంటే..

వారెవ్వా..చెట్టుమీదే ఐసోలేష‌న్.. ‘నీడ్ ఈజ్ ద మ‌ద‌ర్ ఆఫ్ ఇన్వెన్ష‌న్’..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu