Fact Check: పెన్నుతో చెక్ చేసిన ఆక్సిజ‌న్ శాతం చూపిస్తోంది.. అస‌లు ఆక్సీమీట‌ర్లు ప‌నిచేస్తున్నాయా.? నిజ‌మేంటంటే..

Fact Check Oximeter: క‌రోనా మ‌హ‌మ్మారి మాన‌వ జాతిని మొత్తం భ‌యందోళ‌న‌కు గురి చేస్తోంది. మునుపెన్న‌డూ లేని ఒక కొత్త భ‌యాన్ని రేకెత్తిస్తోంది. దీంతో ప్ర‌జ‌లు ఎన్న‌డూ లేని విధంగా ఆరోగ్యంపై శ్ర‌ద్ధ చూపిస్తున్నారు....

Fact Check: పెన్నుతో చెక్ చేసిన ఆక్సిజ‌న్ శాతం చూపిస్తోంది.. అస‌లు ఆక్సీమీట‌ర్లు ప‌నిచేస్తున్నాయా.? నిజ‌మేంటంటే..
Oximeter
Follow us

|

Updated on: May 15, 2021 | 4:18 PM

Fact Check Oximeter: క‌రోనా మ‌హ‌మ్మారి మాన‌వ జాతిని మొత్తం భ‌యందోళ‌న‌కు గురి చేస్తోంది. మునుపెన్న‌డూ లేని ఒక కొత్త భ‌యాన్ని రేకెత్తిస్తోంది. దీంతో ప్ర‌జ‌లు ఎన్న‌డూ లేని విధంగా ఆరోగ్యంపై శ్ర‌ద్ధ చూపిస్తున్నారు. ఇందులో భాగంగానే క‌రోనా సోకిన ప్ర‌తీ ఒక్క‌రూ ఇప్పుడు ఇంట్లో ఆక్సీమీట‌ర్‌ను క‌చ్చితంగా అందుబాటులో ఉంచుకుంటున్నారు. క‌రోనా రోగుల్లో ఎక్కువ‌గా శ‌రీరంలో ఆక్సిజ‌న్ స్థాయిలు త‌గ్గ‌డంతో మ‌ర‌ణిస్తున్నారు. దీంతో ఎప్ప‌టిక‌ప్పుడు ఆక్సిజ‌న్ స్థాయిల‌ను చెక్ చేసుకుంటున్నారు. ఈ కార‌ణంగా ఆక్సీమీట‌ర్‌ల వినియోగం పెరిగిపోయింది. ఇదిలా ఉంటే ఆక్సీమీట‌ర్ల ప‌నితీరుపై అనుమానం వ్య‌క్తం చేస్తూ సోష‌ల్ మీడియాలో ప‌లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇంత‌కీ ఆ ప్ర‌చారం ఏంటీ..? అందులో ఎంత వ‌ర‌కు నిజం ఉందో ఇప్పుడు చూద్దాం..

సోష‌ల్ మీడియాలో జ‌రుగుతోన్న ప్ర‌చారం..

అయితే సోష‌ల్ మీడియాలో జరుగుతోన్న ఓ ప్ర‌చారం ఇప్పుడు ఆక్సీమీట‌ర్ల ప‌నితీరును ప్ర‌శ్నార్థ‌కంగా మారుస్తోంది. ఆక్సీ మీట‌ర్ల‌లో పెన్ను లేదా పెన్సిల్‌ను ఉంచినా.. ఆక్సిజ‌న్ స్థాయితో పాటు ప‌ల్స్ రేటును కూడా చూపిస్తోంది. దీంతో దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైర‌ల్‌గా మారుతున్నాయి. మ‌రి నిజంగానే ఆక్సీమీట‌ర్లు స‌రిగా ప‌నిచేయ‌డం లేదా.. అన్ని అనుమానాలు త‌లెత్తుతున్నాయి.

Oximeter Working

Oximeter Working

అస‌లు నిజ‌మేంటంటే..

ఆక్సీమీట‌ర్‌తో పెన్నుల‌తో చేసిన ఆక్సిజ‌న్ స్థాయిలు ఎందుకు చూపిస్తున్నాయో తెలియాలంటే ముందుగా ఇది ఎలా ప‌నిచేస్తుందో తెలుసుకోవాలి. సాధార‌ణంంగా.. ఆక్సీమీటర్లలో ఓ వైపు సెన్సర్లు, మరోవైపు ఎరుపు, ఇన్‌ఫ్రారెడ్‌ కాంతి వచ్చే ఏర్పాట్లు ఉంటాయి. పల్స్‌ చూసుకొనేప్పుడు ఈ కాంతి వేలి గుండా ప్రయాణించి సెన్సర్‌పై పడుతుంది. సెన్సర్‌పై పడే కాంతిని బట్టి ఆక్సిజన్‌ స్థాయి, పల్స్‌ రేటు తెలుస్తుంది. అయితే పెన్నులు, పెన్సిళ్లు లాంటి వస్తువులు పెట్టినప్పుడు కాంతి వాటిని దాటి వెళ్లినప్పుడు కూడా సెన్సర్‌ పసిగట్టి సంఖ్య‌ల‌ను చూపిస్తుంది. అంతే త‌ప్ప ఆక్సీ మీట‌ర్లు స‌రిగా ప‌నిచేయ‌వ‌ని వ‌స్తోన్న వార్త‌ల్లో ఎంత‌మాత్రం నిజంలేదు. కాబ‌ట్టి నిర్భయంగా ఆక్సీమీట‌ర్ల‌ను నమ్మొచ్చు.

Also Read: Revanth Reddy : కరోనా బాధితులకు ఉచిత భోజనం.. రోజూ వెయ్యిమందికి అన్నదానం ప్రారంభించిన ఎంపీ రేవంత్ రెడ్డి

PM Kisan: రైతులకు శుభవార్త.. అకౌంట్లోకి రూ.2వేలు.. మీ పేరు ఉందో లేదో మొబైల్‏‏లోనే ఇక సులభంగా ఇలా చెక్ చేయండి..

లక్కు కాలింగ్‌ బెల్‌ కొట్టినా, తొక్కలో దరిద్రం నెత్తి మీద డిస్కో ఆడింది!