Revanth Reddy : కరోనా బాధితులకు ఉచిత భోజనం.. రోజూ వెయ్యిమందికి అన్నదానం ప్రారంభించిన ఎంపీ రేవంత్ రెడ్డి
Free food : కొవిడ్ మహమ్మారి బారినపడ్డ రోగులు, వాళ్లకు ఆసరాగా ఆస్పత్రుల దగ్గర ఉంటున్న బాధితుల బంధువులకు ఆపన్నహస్తం అందించేందుకు అనేక మంది ముందుకొస్తున్నారు...
Free food : కొవిడ్ మహమ్మారి బారినపడ్డ రోగులు, వాళ్లకు ఆసరాగా ఆస్పత్రుల దగ్గర ఉంటున్న బాధితుల బంధువులకు ఆపన్నహస్తం అందించేందుకు అనేక మంది ముందుకొస్తున్నారు. సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి వద్ద కరోనా రోగులకు అన్నదానం చేసే కార్యక్రమాన్ని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్‌రెడ్డి శనివారం ప్రారంభించారు. ఇందులో భాగంగా ప్రతీరోజు వెయ్యి మందికి ఉచిత భోజన కార్యక్రమాన్ని ఆయన ఇవాళ మొదలుపెట్టారు. సోనియాగాంధీ, రాహుల్ ఆదేశాల మేరకు… ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు రేవంత్ చెప్పారు. తెలంగాణలో లాక్‌డౌన్ కారణంగా పేషంట్స్ కుటుంబ సభ్యులకు ఆహారం దొరకడం లేదన్న ఆయన, కరోనా ఫస్ట్ వేవ్ సమయంలో కూడా ప్రభుత్వాలు కనీస సౌకార్యాలు ఏర్పాటు చేయలేదని చెప్పుకొచ్చారు. కరోనా కష్టకాలంలో యూత్ కాంగ్రెస్ తరపున తెలంగాణ వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు ఇంత కష్టపడుతుంటే వారిని తెలంగాణ సర్కారు అరెస్ట్‌లు చేస్తుందని రేవంత్ మండిపడ్డారు. విచారణ పేరిట సేవాకార్యక్రమాల్ని అడ్డుకుంటున్నారన్నారు. గాంధీ ఆసుపత్రి తెలంగాణ నోడల్ కొవిడ్ హాస్పిటల్ అయినా… కనీస సౌకర్యాలు లేవన్నారు. లాక్‌డౌన్ ఉన్నంత వరకు ఉచిత భోజన వసతి కల్పిస్తామని చెప్పారు.
My heart aches at the sad plight of the family of covid patients waiting outside Gandhi hospital,starving. To help them,on behalf of @INCTelangana we started food distribution for 1000 members everyday until lockdown ends,including the staff&security who are working tirelessly pic.twitter.com/Zy6JDjtWfl
— Revanth Reddy (@revanth_anumula) May 15, 2021
Read also : Covid : షీలానగర్‌లో కొవిడ్ కేర్ సెంటర్ ప్రారంభించిన ఆళ్ల నాని.. వైద్యం, పౌష్టికాహారం అందిస్తామన్న విజయసాయి