Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రాణం తీసిన వాట్సప్‌‌ స్టేటస్‌..! పద్నాలుగేళ్ల బాలిక ఆత్మహత్య.. వివరాలు ఇలా ఉన్నాయి..

Girl Commits Suicide : ఓ అబ్బాయి తన ఫొటోను వాట్సాప్ స్టేటస్‌గా పెట్టుకున్నాడని మనస్తాపానికి గురైన ఓ బాలిక పురుగుల మందు

ప్రాణం తీసిన వాట్సప్‌‌ స్టేటస్‌..! పద్నాలుగేళ్ల బాలిక ఆత్మహత్య.. వివరాలు ఇలా ఉన్నాయి..
Whatsapp
Follow us
uppula Raju

|

Updated on: May 15, 2021 | 2:22 PM

Girl Commits Suicide : ఓ అబ్బాయి తన ఫొటోను వాట్సాప్ స్టేటస్‌గా పెట్టుకున్నాడని మనస్తాపానికి గురైన ఓ బాలిక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన బొమ్మలరామారం మండల పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మండలంలోని బోయిన్‌పల్లి గ్రామానికి చెందిన ఓ బాలిక (14) మూడు చింతల పల్లి‡మండలం పోతారం గ్రామంలో ఉన్న కూరగాయల తోటలో కూలీగా జీవనం సాగిస్తోంది.

అయితే మండలంలోని బోటిమీది తండాకు చెందిన తేజావత్‌ మధుతో ఇటీవల పరిచయం ఏర్పడింది. ఇద్దరి మధ్య గల సాన్నిహితంతో బాలుడు సదరు బాలిక ఫొటోను శుక్రవారం తన వాట్సప్‌ స్టేటస్‌గా పెట్టాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన బాలిక తన పనిచేసే తోటలో ఉన్న పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. మధు వేధింపులతోనే తన కూతురు ఆత్మహత్యకు పాల్పడినట్లు మృతురాలి తల్లి జయమ్మ షామీర్‌పేట్‌లోని పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

అంతేగా… మేమూ తయారు చేస్తాం… ఆ స్థాయి లాబొరేటరీలు AP,తెలంగాణల్లోనూ ఉన్నాయంటున్న బయోటెక్నాలజీ నిపుణులు

Black Fungus: ఆ నీటి వాడకమే బ్లాక్‌ ఫంగస్‌ వ్యాప్తికి కారణమా.! వైద్య నిపుణులు ఏం చెబుతున్నారంటే..

కొలిక్కిరాని ‘ఇండియన్ 2’ వివాదం.. శంకర్ మూవీ గొడవలో మరో మలుపు.. మరోసారి డైరెక్టర్‏కు షాకిచ్చిన నిర్మాణ సంస్థ..

వ్యాయామం చేసిన తర్వాత పొరపాటున కూడా ఈ ఐటమ్స్ తినొద్దు..! అయినా తిన్నారంటే కొవ్వును కొనితెచ్చుకున్నట్లే..?