AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అంతేగా… మేమూ తయారు చేస్తాం… ఆ స్థాయి లాబొరేటరీలు AP,తెలంగాణల్లోనూ ఉన్నాయంటున్న బయోటెక్నాలజీ నిపుణులు

Covid-19 Vaccine Plant: భారత్‌ బయోటెక్‌ తన కోవాగ్జిన్‌ ఫార్ములాను ఇతర కంపెనీలతో షేర్ చేసుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం  ప్రకటించిన నేపథ్యంలో... ఈ వ్యాక్సిన్‌ తయారు చేసే సామర్థ్యం..

అంతేగా... మేమూ తయారు చేస్తాం... ఆ స్థాయి లాబొరేటరీలు AP,తెలంగాణల్లోనూ ఉన్నాయంటున్న బయోటెక్నాలజీ నిపుణులు
Covid 19 Vaccine Plant
Sanjay Kasula
|

Updated on: May 15, 2021 | 2:10 PM

Share

భారత్‌ బయోటెక్‌ తన కోవాగ్జిన్‌ ఫార్ములాను ఇతర కంపెనీలతో షేర్ చేసుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం  ప్రకటించిన నేపథ్యంలో… ఈ వ్యాక్సిన్‌ తయారు చేసే సామర్థ్యం ఉన్న పలు దేశీయ కంపెనీలు ఇందుకు సిద్ధమవుతున్నాయి. నిజానికి ఈ వ్యాక్సిన్‌ తయారీ అనేది మరీ అత్యాధునిక టెక్నాలజీ ఏమీ కాదని, బయోసేఫ్టీ లెవెల్‌ 3 స్థాయి అర్హత ఉన్న కంపెనీలు ఏవైనా దీన్ని తయారు చేయగలవని బయోటెక్నాలజీ నిపుణులు అంటున్నారు.

బయోసేఫ్టీ లెవెల్‌ 3 (BSL–3) అంటే ఒక దశ వరకూ లైవ్‌ వైరస్‌ను అభివృద్ధి చేస్తారు. ఎలాంటి పరిస్థితిలోనూ గాలి నుంచి గానీ, నీటినుంచి గానీ వైరస్‌ బయటకు రాకుండా కాపాడే స్థాయిని బయో సేఫ్టీ లెవెల్‌–3 అంటారు. ఇలా చేసే స్థాయి , సామర్థ్యం ఉన్న కంపెనీలు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో ఉన్నాయంటున్నారు నిపుణులు. వీరికి ఛాన్స్ ఇస్తే అతి తక్కువ సమయంలోనే రాష్ట్రానికి అవసరమైనన్ని వ్యాక్సిన్లు తయారు చేయవచ్చట.

వ్యాక్సిన్ల తయారీలో…

సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్, భారత్‌ బయోటెక్‌తోపాటు డాక్టర్‌ రెడ్డీస్, అరబిందో, హెటిరో, నాట్కో, గ్లాండ్‌ ఫార్మా,లతో పాటు బయొలాజికల్‌ ఇవాన్స్, జైడస్‌ క్యాడిలా, పనాసియా బయోటెక్, శాంతా బయో, విర్కో ల్యాబ్స్, ఎమ్‌క్యూర్‌ వంటివి దీర్ఘకాలంగా పలు వ్యాక్సిన్లను తయారు చేస్తూనే ఉన్నాయి. చాలా సంస్థలు దేశీయ అవసరాలతోపాటు విదేశాలకూ వ్యాక్సిన్లను ఎగుమతి చేస్తున్నాయి. వీటిలో స్పుత్నిక్‌ వ్యాక్సిన్‌ తయారీకి డాక్టర్‌ రెడ్డీస్‌ ఇప్పటికే ఒప్పందం చేసుకుంది.

అరబిందో ఫార్మా వ్యాక్సిన్ల వార్షిక తయారీ సామర్థ్యాన్ని ప్రస్తుతం ఉన్న 22 కోట్ల నుంచి జూలై నాటికి 70 కోట్ల డోసులకు పెంచుతోంది. వీటికి గనక తగిన విధంగా కోవాగ్జిన్‌ టెక్నాలజీ, ఫార్ములా బదిలీ అయితే ఇవి మిగతా వ్యాక్సిన్ల ఉత్పత్తిని తాత్కాలికంగా నిలుపుదల చేసో, తగ్గించో కోవాగ్జిన్‌ను ఉత్పత్తి చేస్తాయని, కొన్ని నెలల వ్యవధిలోనే మొత్తం దేశానికి వ్యాక్సినేషన్‌ పూర్తవుతుందని బయోటెక్‌ నిపుణులు అభిప్రాయపడ్డారు.

ఇవి కూడా చదవండి :  DRDO Drug 2-DG: కరోనా బాధితులకు శుభవార్త.. రేపటిలోగా అందుబాటులోకి రానున్న 2డీజీ డ్రగ్‌..!

YS Jagan: జగన్ సర్కార్ మరో కీలక నిర్ణయం.. వారికి గౌరవ వేతనం పెంపు.. ఉత్తర్వులు జారీ..