YSRCP MP: ఎంపీ రఘురామకృష్ణంరాజుకు చుక్కెదురు.. బెయిల్ పిటిషన్ కొట్టేసిన హైకోర్టు..
వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజుకు చుక్కెదురు అయింది. బెయిల్ కోసం ఏపీ హైకోర్టులో దాఖలు చేసిన హౌస్ మోషన్...
MP Raghurama Krishnamraju Arrest: వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజుకు చుక్కెదురు అయింది. బెయిల్ కోసం దాఖలు చేసిన హౌస్ మోషన్ పిటిషన్‌ను ఏపీ హైకోర్టు డిస్మిస్ చేసింది. జిల్లా కోర్టుకు వెళ్లకుండా నేరుగా హైకోర్టుకు ఎందుకు వచ్చారని న్యాయస్థానం ప్రశ్నించింది. సెషన్స్ కోర్టులో బెయిల్ కోసం దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది.
ఇదిలా ఉంటే ప్రాధమిక విచారణ, సరైన ఆధారాలు లేకుండా అరెస్ట్ చేశారని రఘురామ లాయర్ వాదించారు. ఆయన అరెస్టుకు సహేతుక కారణాలు లేవని కోర్టుకు వివరించారు. సుప్రీం కోర్టు తీర్పుకు వ్యతిరేకంగా అరెస్ట్ చేశారు కాబట్టే హైకోర్టుకు వచ్చామన్న రఘురామ న్యాయవాది వాదనకు ఏపీ హైకోర్టు ఏకీభవించలేదు. నేరుగా హైకోర్టును కాకుండా కింద కోర్టును సంప్రదించాలని సూచించింది.
Also Read:
ఇండియాకు 7 వేల కోట్లు విరాళంగా ఇచ్చిన 27 ఏళ్ల యువకుడు.. ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!
చిరుతపై సింహం సాలిడ్ ఎటాక్.. చివరికి గెలిచిందేవరంటే.? షాకింగ్ దృశ్యాలు..
‘సెక్స్ కోసం వెళ్లాలి’.! ఈ-పాస్ ఇవ్వండి.. పోలీసులకు వింత రిక్వెస్ట్.. అసలు విషయమేమిటంటే.!