Viral Video: చిరుతపై సింహం సాలిడ్ ఎటాక్.. చివరికి గెలిచిందేవరంటే.? షాకింగ్ దృశ్యాలు..

Lion Scary Video: అడవికి రాజైన సింహం వేట అంటే మాములుగా ఉండదు. దాన్ని అల్లంత దూరంలో చూసినా, గర్జన విన్నా చాలు మిగిలిన....

Viral Video: చిరుతపై సింహం సాలిడ్ ఎటాక్.. చివరికి గెలిచిందేవరంటే.? షాకింగ్ దృశ్యాలు..
Lion
Follow us
Ravi Kiran

|

Updated on: May 15, 2021 | 9:15 AM

Lion Scary Video: అడవికి రాజైన సింహం వేట అంటే మాములుగా ఉండదు. దాన్ని అల్లంత దూరంలో చూసినా, గర్జన విన్నా చాలు మిగిలిన జంతువులు పారిపోతాయి. మృగరాజు కనుసన్నల్లో నుంచి తప్పించుకోవడం అంత సులువు కాదు. ఒకసారి టార్గెట్ చేసిందంటే వార్ వన్‌సైడ్ అవ్వాల్సిందే. అయితే ఒకేసారి ఇద్దరు సమవుజ్జీలు తలబడితే.. ఆ యుద్ధం భీకరంగా ఉండటం ఖాయం. సింహం, చిరుతపులి ఒకేసారి తలబడ్డాయి. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

తన బలాన్ని ప్రదర్శిస్తూ.. సింహం ఆటవిక రాజ్యాన్ని శాసిస్తూ వస్తోంది. వేగానికి, చురుకుదనానికి మారుపేరు చిరుతపులి. క్షణాల్లో ఏ జంతువునైనా వేటాడగలిగిన సామర్ధ్యం చిరుత సొంతం. ఈ రెండు జంతువులూ ఒకేసారి తలబడ్డాయి. ఆ షాకింగ్ దృశ్యాలు ఇప్పుడు అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.

ఓ ఎత్తైన రాయిపై చిరుతపులి హాయిగా నిద్రిస్తున్నట్లు వీడియోలో మీరు చూడవచ్చు. అప్పుడే అనూహ్యంగా ఎక్కడ నుంచో సింహం దానిపై దాడి చేస్తుంది. సింహానికి ఎదురు నిలిచి చిరుత కూడా ధీటుగా పోరాడుతుంది. అయితే మృగరాజు శక్తి ముందు తన తలవంచక తప్పదని గ్రహించిన చిరుత అక్కడ నుంచి చటుక్కున పారిపోతుంది. ఈ వీడియోను ‘ఆఫ్రికన్ యానిమల్స్’ అనే ట్విట్టర్ అకౌంట్ షేర్ చేయగా.. 52 వేలకు పైగా వీక్షకులు దీనిని వీక్షించారు. అలాగే ఈ వీడియోపై నెటిజన్లు కామెంట్స్, లైకుల వర్షం కురిపిస్తున్నారు.

Also Read: ఇండియాకు 7 వేల కోట్లు విరాళంగా ఇచ్చిన 27 ఏళ్ల యువకుడు.. ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!