Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Corona Effect: కరోనా నెగిటివ్‌ సర్టిఫికేట్‌ ఉంటేనే ప్రవేశం.. పలు రాష్ట్రాల్లో అమలు చేస్తున్న కఠిన ఆంక్షలు ఇవే..

Corona Effect: దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ను మరింత కఠినంగా

Corona Effect: కరోనా నెగిటివ్‌ సర్టిఫికేట్‌ ఉంటేనే ప్రవేశం.. పలు రాష్ట్రాల్లో అమలు చేస్తున్న కఠిన ఆంక్షలు ఇవే..
Follow us
Shiva Prajapati

|

Updated on: May 14, 2021 | 11:08 PM

Corona Effect: దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ను మరింత కఠినంగా అమలు చేస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఇతర ప్రాంతాల నుంచి తమ రాష్ట్రంలోకి వచ్చే వారి పట్ల కఠిన ఆంక్షలు విధిస్తున్నాయి. పలు రాష్ట్రాలు తమ రాష్ట్రంలోకి ఇతర ప్రాంతాలు వారిని రాకుండా సరిహద్దులను పూర్తిగా మూసివేశాయి. తాజాగా మరికొన్ని రాష్ట్రా ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే తెలంగాణ సర్కార్.. ఇతర రాష్ట్రాల నుంచి వాహనాలను రాష్ట్రంలోకి రానీయకుండా సరిహద్దుల్లోనే అడ్డుకుంటోంది. ఈ చర్య ఇప్పుడు వివాదాస్పదం అయ్యింది. ఏకంగా హైకోర్టు జోక్యం చేసుకుని ఇతర ప్రాంతాల నుంచి వచ్చే అంబులెన్స్‌లను అడ్డుకోవద్దంటూ ఆదేశాలు జారీ చేసింది. ఈ వివాదం నేపథ్యంలోనే దేశంలో ముఖ్యంగా మన సరిహద్దు రాష్ట్రాలు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నాయో ఒకసారి పరిశీలిద్దాం..

రాష్ట్రంలోకి ప్రవేశించే ఏ వ్యక్తి అయినా ఆర్టీపీసీఆర్ పరీక్ష ద్వారా కరోనా నెగిటివ్ ధ్రువపత్రాన్ని కలిగి ఉండాలని మహారాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఆదేశాలు జారీ చేసింది. అది కూడా మహారాష్ట్రలోకి ప్రవేశించడానికి గరిష్టంగా 48 గంటల ముందు జారీ చేసినదై ఉండాలని స్పష్టం చేసింది. కాగా, ఇలాంటి ఆదేశాలు.. ఏప్రిల్ 18వ తేదీనే జారీ చేయగా.. మే 1వ తేదీ వరకు అమలు చేశారు. అయితే, తాజాగా ఆ గడువును జూన్ 1వ తేదీ వరకు పొడగించారు.

తమిళనాడు ప్రభుత్వం కూడా ఇలాంటి కఠిన నిబంధనలనే అమలు చేస్తోంది. కేరళలో కరోనా కేసులు ఎక్కవగా నమోదవుతుండటంతో ఆ రాష్ట్రం నుంచే వచ్చేవారిపై తమిళనాడు ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఈ-పాస్‌తో పాటు, కరోనా నెగిటివ్‌ సర్టిఫికేట్‌ ఉంటేనే అనుమతించడం జరుగుతుందంటూ ఏప్రిల్‌ 19న పోలీసు శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

కర్ణాటక సర్కార్ కూడా కరోనా ఆంక్షలను పకడ్బందీగా అమలు చేస్తోంది. కరోనా కేసులు ఎక్కువగా ఉన్న మహారాష్ట్ర, కేరళ, పంజాబ్‌, చంఢీఘర్‌ నుంచీ వచ్చే ప్రయాణీకులపై ఆంక్షలు విధించింది. ఈ రాష్ట్రాల నుంచి బెంగళూరు రావాలంటే ఆర్టీపీసీఆర్ పరీక్ష ద్వారా కరోనా నెగిటివ్‌ నివేదికను కలిగి ఉండాలని స్పష్టం చేసింది. మార్చి 25వ తేదీనే ఈ ఆదేశాలను బెంగళూరు మెట్రో పాలిటన్‌ అధారిటీ జారీ చేసింది. ఇలా ఆయా రాష్ట్రాలు తమ రాష్ట్రంలో కరోనా నివారణ కోసం కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నాయి.

Also read:

ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్‌ అంబులెన్స్‌లను తెలంగాణలోకి అనుమతి.. ఊపిరి పీల్చుకున్న రోగుల బంధువులు

RRR Arrest : వైసీపీ ఎంపీ రఘురామ అరెస్ట్‌ను తీవ్రంగా ఖండించిన టీడీపీ, ఇప్పటికే సీఎం జగన్ చాలా ఓపికపట్టారన్న వైసీపీ