Digilocker: మీ మొబైల్‌లో డీజిలాకర్‌ ఉందా..? ఒక్క యాప్‌తో ఎన్నో సదుపాయాలు.. అత్యవసర సమయాల్లో ఎంతో ఉపయోగం

Subhash Goud

Subhash Goud |

Updated on: May 15, 2021 | 6:07 AM

Digilocker: ప్రస్తుత రోజుల్లో ఆధార్‌, పాన్‌ కార్డు తప్పనిసరి మారిపోయింది. ఇవి లేనిది పనులు జరగవు. ఏ పని చేయాలన్న ఆధార్‌ తప్పనిసరి అయిపోయింది. దాదాపు అన్ని రకాల..

Digilocker: మీ మొబైల్‌లో డీజిలాకర్‌ ఉందా..? ఒక్క యాప్‌తో ఎన్నో సదుపాయాలు.. అత్యవసర సమయాల్లో ఎంతో ఉపయోగం
Digilocker
Follow us

Digilocker: ప్రస్తుత రోజుల్లో ఆధార్‌, పాన్‌ కార్డు తప్పనిసరి మారిపోయింది. ఇవి లేనిది పనులు జరగవు. ఏ పని చేయాలన్న ఆధార్‌ తప్పనిసరి అయిపోయింది. దాదాపు అన్ని రకాల లావాదేవీలకు తప్పకుండా అవసరమే. మరి ఈ ఆధార్‌, పాన్‌ కార్డులు ఒక్క సమయంలో అవసరానికి దొరకవు. అప్పుడు ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. అత్యవసరం ఉన్న సమయంలోనే ఎక్కడ వెతికినా దొరకవు. ఇంట్లో దాచుకున్నట్లయితే అవసరానికి అందుబాటులో ఉండవు. ఇలాంటి ఇబ్బందులు పడకుండా కేంద్ర ప్రభుత్వం ఐదు సంవత్సరాల కిందటనే వర్చువల్‌ లాకర్‌ను ప్రారంభించింది. కేంద్ర ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఐటీ మంత్రిత్వశాఖ డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్‌లో భాగంగా డిజీలాక్‌ అనే ప్లాట్‌ఫామ్‌ను ఏర్పాటు చేసింది.

అన్ని అందులో భద్రపర్చుకోవచ్చు.

ఈ యాప్‌లో మీ ముఖ్యమైన డాక్యుమెంట్స్‌ అన్నింటిని భద్రంగా ఉంచుకోవచ్చు. మీ పాన్‌ కార్డు, ఓటర్‌ ఐడీకార్డ్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌, పాస్‌ పోర్టుతో పాటు మీ సర్టిఫికేట్లు ఇలా ఎన్నో రకాల సర్టిఫికేట్లను అందులోనే భద్రంగా దాచుకోవచ్చు. మీ డాక్యుమెంట్లను దాచుకోవాలంటే ముందుగా డిజీలాకర్‌లో మీ అకౌంట్‌ క్రియేట్‌ చేసుకోవాల్సి ఉంటుంది. https://digilocker.gov.in/ వెబ్‌సైట్ లేదా డిజీలాకర్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ యాప్‌లో అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు.

మీ యూజర్‌ నేమ్‌, పాస్‌వర్డ్‌ ద్వారా అకౌంట్‌ చేసుకుని డాక్యుమెంట్లన్నీ అందులో భద్రంగా దాచుకోవచ్చు. అంతేకాదు జేపీఈజీ, పీడీఎఫ్‌, పీఎన్‌జీ లాంటి ఫార్మాట్‌లో ఉన్న డాక్యుమెంట్లను కూడా స్మాన్‌ చేసి అప్‌లోడ్‌ చేసుకోవచ్చు. పాన్‌ కార్డు, ఆధార్‌ కార్డు, డ్రైవింగ్‌ లైసెన్స్‌ మాత్రమే కాకుండా ప్రభుత్వం జారీ చేసిన వివిధ రకాలా సర్టిఫికేట్లు, ఇతర డాక్యుమెంట్లను ఈ డీజీలాకర్‌లో భద్రంగా ఉంచుకోవచ్చు.

అత్యవసర సమయాల్లో ఉపయోగం

అయితే ఈ యాప్‌లో దాచుకున్న పత్రాలన్ని అత్యవసర సమయాల్లో ఉపయోగ పడతాయి. రైలులో ప్రయాణించేటప్పుడు లేదా ట్రాఫిక్‌ పోలీసులు మీ వాహనాలను తనిఖీ చేసిన సమయంలో మీ ఆధార్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌ లాంటివి ఈ డీజీలాకర్‌లో చూపించుకోవచ్చు.

దీని వల్ల మీకు సమయానికి ఉపయోగడపతాయి. ఎవరైన ఈ వాహనం తనిఖీ చేసిన సమయంలో గానీ, ఎక్కడైన ఒరిజినల్‌ సర్టిఫికేట్లు చూపించాలని అడిగిన సమయంలో గానీ ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. మీ స్మార్ట్‌ ఫోన్‌లో ఈ యాప్‌ లేని వారు డౌన్‌లోడ్‌ చేసుకుంటే ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

ఇవీ కూడా చదవండి:

WhatsApp: మీరు వాట్సాప్‌ వాడుతున్నారా..? ఈ తప్పులను చేసినట్లయితే జైలు వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది..!

Aadhaar Card: మీ ఆధార్‌ కార్డును ఎవరైనా వాడుతున్నారని అనుమానం ఉందా..? అయితే ఇలా తెలుసుకోండి..!

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Click on your DTH Provider to Add TV9 Telugu