Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్‌ అంబులెన్స్‌లను తెలంగాణలోకి అనుమతి.. ఊపిరి పీల్చుకున్న రోగుల బంధువులు

తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల్లో అంబులెన్స్‌ల నిలిపివేతపై రాష్ట్ర హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేయడంతో తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆంధ్రప్రదేశ్‌ నుంచి వచ్చే..

ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్‌ అంబులెన్స్‌లను తెలంగాణలోకి అనుమతి.. ఊపిరి పీల్చుకున్న రోగుల బంధువులు
Follow us
Subhash Goud

|

Updated on: May 14, 2021 | 10:57 PM

తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల్లో అంబులెన్స్‌ల నిలిపివేతపై రాష్ట్ర హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేయడంతో తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆంధ్రప్రదేశ్‌ నుంచి వచ్చే అంబులెన్స్‌ల విషయంలో సూర్యాపేట జిల్లాలోని రామాపురం చెక్‌పోస్టు అమలు చేసిన ఆంక్షలను సడలించారు. దీంతో కొద్దిసేపటి నుంచి ఏపీ నుంచి వచ్చే అంబులెన్స్‌లను పోలీసులు అనుమతిస్తుండటంతో రోగుల బంధువులు ఊపిరి పీల్చుకున్నారు. ఎలాంటి పాసులు లేకుండా కరోనా బాధితుల అంబులెన్స్‌లను అమతిస్తున్నారు. జోగులాంబ జిల్లా పుల్లూరు టోల్‌ప్లాజా వద్ద కూడా ఏపీ అంబులెన్స్‌లకు పోలీసులు అనుమతి ఇచ్చారు. ఈ -పాస్‌ లేకున్నా హైదరాబాద్‌ వైపు వెళ్లేందుకు కరోనా రోగులతో వెళ్లే అంబులెన్స్‌లను అనుమతిస్తున్నారు.

హైదరాబాద్‌కు వస్తున్న అంబులెన్స్‌లను సరిహద్దుల్లో నిలిపివేసిన విషయం తెలిసిందే. దీంతో విశ్రాంత ఐఆర్‌ఎస్‌ అధికారి వెంటక కృష్ణారావు దాఖలు చేసిన హౌస్‌ మోషన్‌ పిటిషన్‌పై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హిమా కోహ్లి నేతృత్వంలో ధర్మాసనం విచారణ జరిపిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా తెలంగాణ సర్కారు వ్యవహరిస్తున్న తీరు పట్ల న్యాయస్థానం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.

ఇవీ చదవండి

Nara Lokesh: ‘ఏపీలో ఉంటే ప్రాణాలు నిల‌వ‌వు.. తెలంగాణ‌ వెళ్లే చాన్స్ లేదు’.. జ‌గ‌న్‌పై విరుచుకుప‌డ్డ లోకేష్‌..

Bomb Blast: రంజాన్‌ వేళ విషాదం..మసీదులో ప్రార్థనలు చేస్తుండగా బాంబు పేలుడు.. 12 మంది మృతి.. చాలా మందికి గాయాలు

రూ.40 కోట్లు పెడితే.. రూ.160 కోట్లకు పైగా రాబట్టింది..
రూ.40 కోట్లు పెడితే.. రూ.160 కోట్లకు పైగా రాబట్టింది..
అప్పుడే పుట్టిన పిల్లలను ఎందుకు గుడ్డతో చుట్టేస్తారో తెలుసా?
అప్పుడే పుట్టిన పిల్లలను ఎందుకు గుడ్డతో చుట్టేస్తారో తెలుసా?
మంచం మీద కూర్చుని తింటే ఇంట్లో పెద్దోళ్లు ఎందుకు తిడతారో తెలుసా?
మంచం మీద కూర్చుని తింటే ఇంట్లో పెద్దోళ్లు ఎందుకు తిడతారో తెలుసా?
తక్కువ ధరకే అరకు అందాలను వీక్షించండి.. IRCTC ప్యాకేజీ వివరాలు
తక్కువ ధరకే అరకు అందాలను వీక్షించండి.. IRCTC ప్యాకేజీ వివరాలు
గాయంతో ఛాంపియన్స్ ట్రోఫీ సెన్సేషన్ ఔట్.. GTలోకి గండరగండుడు ఎంట్రీ
గాయంతో ఛాంపియన్స్ ట్రోఫీ సెన్సేషన్ ఔట్.. GTలోకి గండరగండుడు ఎంట్రీ
అప్పుడు జుట్టు రాలిపోయింది.. ఇప్పుడు గోళ్లు ఊడిపోతున్నాయ్..
అప్పుడు జుట్టు రాలిపోయింది.. ఇప్పుడు గోళ్లు ఊడిపోతున్నాయ్..
టెక్సాస్‌లో యాక్సిడెంట్.. మరో తెలుగు విద్యార్థిని మృతి!
టెక్సాస్‌లో యాక్సిడెంట్.. మరో తెలుగు విద్యార్థిని మృతి!
కేవలం 3 ఓవర్లలోనే సెంచరీ.. 18 నిమిషాల్లో బౌలర్లకు బ్లడ్ బాత్
కేవలం 3 ఓవర్లలోనే సెంచరీ.. 18 నిమిషాల్లో బౌలర్లకు బ్లడ్ బాత్
ఈ మంత్రం శక్తికి సైన్స్ కూడా తలవంచింది ఉచ్చరణతోనే ఎంత మేలో తెలుసా
ఈ మంత్రం శక్తికి సైన్స్ కూడా తలవంచింది ఉచ్చరణతోనే ఎంత మేలో తెలుసా
కాసేపట్లో లిక్కర్‌ కేసులో సిట్‌ విచారణకు మాజీ MP విజయసాయిరెడ్డి!
కాసేపట్లో లిక్కర్‌ కేసులో సిట్‌ విచారణకు మాజీ MP విజయసాయిరెడ్డి!