Nara Lokesh: ‘ఏపీలో ఉంటే ప్రాణాలు నిలవవు.. తెలంగాణ వెళ్లే చాన్స్ లేదు’.. జగన్‌పై విరుచుకుపడ్డ లోకేష్..
Nara Lokesh Fire On Jagan: ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణలోకి కోవిడ్ పేషెంట్స్‌తో వస్తోన్న అంబులెన్సులను అడ్డుకుంటున్న వ్యవహారం ఇప్పుడు రాజకీయాంశంగా మారింది. ఈ విషయంపై తెలంగాణ హైకోర్టు..
Nara Lokesh Fire On Jagan: ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణలోకి కోవిడ్ పేషెంట్స్‌తో వస్తోన్న అంబులెన్సులను అడ్డుకుంటున్న వ్యవహారం ఇప్పుడు రాజకీయాంశంగా మారింది. ఈ విషయంపై తెలంగాణ హైకోర్టు ఇప్పటికే ప్రభుత్వానికి మొట్టికాయలు వేసిన విషయం తెలిసిందే. అంబులెన్సులను అడ్డుకునే హక్కు ఎవరు ఇచ్చారంటూ తీవ్రంగా వ్యాఖ్యానించింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ అంశం ఏపీ రాజకీయాల్లోనూ అలజడి రేపుతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ విషయంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని ఉద్దేశిస్తూ ఘాటుగా మాట్లాడారు. ఏపీలో వైద్యం దొరికితే ప్రజలు తెలంగాణకి ఎందుకు వెళతారని లోకేష్ ప్రశ్నించారు. ఏపీలో ఉంటే ప్రాణాలు నిలిచే అవకాశం లేదు, పక్కరాష్ట్రానికి వైద్యానికి వెళ్లే అవకాశం లేదని లోకేష్ ధ్వజమెత్తారు. మీ మంత్రులు, ఎమ్మెల్యేలకు కోవిడ్ వస్తే ఆగమేఘాల మీద హైదరాబాద్ ఆసుపత్రికి వెళుతారు. కానీ.. సామాన్య ప్రజలు తమ ప్రాణాలను కాపాడుకోవడానికి హైదరాబాద్ వెళ్లేందుకు అవకాశం ఇప్పించరా.. అంటూ ముఖ్యమంత్రిని ప్రశ్నించారు. ఇంత చేతగాని ముఖ్యమంత్రి ఏ రాష్ట్రానికీ ఉండకూడదని లోకేష్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తాడేపల్లి ఇంట్లో నిద్ర పోయింది చాలు గానీ.. లేచి కేసీఆర్‌కు ఫోన్‌చేసి అనుమతులు తెప్పించండన్నారు. ఇక ఏపీ అంబులెన్సులను తెలంగాణలోకి అనుమతించకపోవడం పట్ల తెలంగాణ ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ మాట్లాడిన లోకేష్.. తెలంగాణ ప్రభుత్వం మానవతా ధృక్పథంతో అత్యవసరంగా పరిగణించి కోవిడ్ పేషెంట్ల అంబులెన్సులను అనుమతించాలని కోరారు. ఆరోగ్య పరిస్థితి విషమించిన వారికి మెరుగైన వైద్యం కోసం మాత్రమే హైదరాబాద్ తరలిస్తారని.. తెలంగాణ ప్రభుత్వం దీనిని దృష్టిలో ఉంచుకొని కోవిడ్ పేషెంట్ల అంబులెన్సులను ఆపకుండా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలన్నారు. కరోనా రోగులు సమయానికి ఆసుపత్రికి చేరుకుంటే కొన ఊపిరితో ఉన్న వారి ప్రాణాలు నిలబడతాయని లోకేష్ అభిప్రాయపడ్డారు.
Viral Video : డ్రైవర్ లేకుండా నడుస్తున్న కారు..! వెనుక సీటులో కూర్చున్న యజమాని.. వీడియో వైరల్..