AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Corona Positive: విజయనగరంలో విషాదం.. కరోనా పాజిటివ్ వచ్చిందని ఒకే కుటుంబానికి ముగ్గురు వ్యక్తులు..

Corona Positive: విజయనగరం జిల్లాలోని వేపాడ మండలం నల్లబిల్లిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కరోనా పాజిటివ్ వచ్చిందని..

Corona Positive: విజయనగరంలో విషాదం.. కరోనా పాజిటివ్ వచ్చిందని ఒకే కుటుంబానికి ముగ్గురు వ్యక్తులు..
Drown
Shiva Prajapati
|

Updated on: May 14, 2021 | 5:49 PM

Share

Corona Positive: విజయనగరం జిల్లాలోని వేపాడ మండలం నల్లబిల్లిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కరోనా పాజిటివ్ వచ్చిందని భయాందోళనకు గురైన ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు బలవన్మరణానికి పాల్పడ్డారు.

పూర్తి వివరాల్లోకెళితే.. విజయనగరం జిల్లా వేపాడ మండలం నల్లబిల్లి గ్రామానికి చెందిన ఉడత సత్యనారాయణ గుప్తా (భర్త )(60), సత్యవతి (భార్య )(54), సీహెచ్. వెంకట సుబ్బ లక్ష్మి (గుప్తా వాళ్ల అత్తమ్మ)(84) లకు కరోనా పాజిటివ్‌గా వైద్యులు నిర్ధారించారు. దాంతో తీవ్ర భయాందోళనకు గురైన ముగ్గురూ.. గ్రామంలోని శివాలయం పక్కనున్న మంచినీళ్ల బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య చేసుకోవడంతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. విషయం తెలుసుకున్న పోలీసులు, వైద్యాధికారులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను బావి నుంచి వెలికి తీశారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యా్ప్తు చేస్తున్నారు.

కాగా, ఘటనపై అధికారులు స్పందించారు. కరోనా సోకితే భయపడాల్సిన పనిలేదని చికిత్స పొందితే తగ్గిపోతుందని ప్రజలకు ధైర్యం చెప్పారు. కరోనా పాజిటివ్ అని తేలినంత మాత్రాన ఎవరూ చనిపోరన్నారు. భయం వద్దని, ధైర్యమే ఆయుధంగా చేసుకోవాలని అన్నారు. కరోనా భయంతో ప్రాణాలు కోల్పోవడం విషాదకరం అని అన్నారు.

Also read:

చనిపోతే స్వర్గానికి వెళ్తావా? లేదా నరకానికా ? ప్రశ్నించిన మనవడికి దిమ్మ తిరిగే ఆన్సర్ ఇచ్చిన బామ్మ.. వీడియో వైరల్..

Nara Lokesh: ‘ఏపీలో ఉంటే ప్రాణాలు నిల‌వ‌వు.. తెలంగాణ‌ వెళ్లే చాన్స్ లేదు’.. జ‌గ‌న్‌పై విరుచుకుప‌డ్డ లోకేష్‌..

Pawan Kalyan: నర్సుల సేవలను ప్రత్యేకంగా గుర్తించాలి.. రెండు నెలల వేతనం అదనంగా ఇవ్వాలిః పవన్ కళ్యాణ్