చనిపోతే స్వర్గానికి వెళ్తావా? లేదా నరకానికా ? ప్రశ్నించిన మనవడికి దిమ్మ తిరిగే ఆన్సర్ ఇచ్చిన బామ్మ.. వీడియో వైరల్..
Viral Video: ప్రస్తుత ఆధునిక ప్రపంచంలో ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోన్స్, సోషల్ మీడియా, నెట్ వర్క్ ఇలా ప్రతిదానికి ఎంతగానో అడిక్ట్ అయిపోయారు.
Viral Video: ప్రస్తుత ఆధునిక ప్రపంచంలో ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోన్స్, సోషల్ మీడియా, నెట్ వర్క్ ఇలా ప్రతిదానికి ఎంతగానో అడిక్ట్ అయిపోయారు. ఇక ప్రస్తుతం కాలం పిల్లలకు అసలు ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్స్ లేని రోజులు ఉన్నాయని కూడా తెలీదు. ఇక స్మార్ట్ ఫోన్స్ వచ్చాక అనుబంధాలు తగ్గిపోయాయి. ఒకరితో ఒకరు ప్రేమగా మాట్లాడుకోవడం.. కలిసి భోజనాలు, ఆటలు ఇలాంటి పుస్తకాల్లో కథలుగా మారిపోయాయి. ఇక ఇంట్లో ఉండే పెద్దవారితో పిల్లలు కలిసి ఆటలాడటం, ముచ్చట్లు పెట్టడం ఇలాంటివి కనుమరుగయ్యాయి. అయితే ఈ స్మార్ట్ ఫోన్ ప్రభావం పెద్దవారిలోనూ పడింది. తాజాగా తన మనవడు అడిగిన ప్రశ్నకు అతడికి అర్థమయ్యే భాషలో సమాధానం చెప్పింది ఓ బామ్మ. వీరిద్దరికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది చూసిన నెటిజన్లు ఆ బామ్మ సమాధానానని ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు. ఇంతకీ ఆ వీడియోలో వారిద్దరు ఏం మాట్లాడారో తెలుకుందామా.
ఆ వీడియోలో.. ఓ బామ్మా కూర్చిలో కూర్చోని విశ్రాంతి తీసుకుంటుంది. సరిగ్గా అప్పుడే ఆమె దగ్గరికి వచ్చిన ఆమె మనవడు.. ఆ బామ్మను మీరు స్వర్గానికి వెళ్తారా ? లేకా నరకానికి వెళ్తారా ? అని ప్రశ్నిస్తాడు. వెంటనే ఆ బామ్మా నేను స్వర్గానికి వెళ్తాను అని సమాధానిమిస్తుంది. వెంటనే ఆ మనవడు తిరిగి మీరు ఎందుకు స్వర్గానికి వెళతారు ? అని అడగ్గా.. స్వర్గంలో మంచి మొబైల్ నెట్ వర్క్ ఉంటుంది. అక్కడ నేను మంచి మంచి సినిమాలు చూస్తాను అంటూ ఆన్సర్ ఇచ్చింది. దీంతో మళ్లీ ఆ మనవడు స్వర్గంలో నెట్ వర్క్ మంచిదని మీకు ఎలా తెలుస్తుంది ? అని అడగ్గా… ఎందుకంటే నేను చూశాను అని ఆ బామ్మా సమాధానం ఇచ్చింది. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో ‘వైబోర్‌ఫిట్‌నెస్’ అనే ఖాతాతో షేర్ చేయగా.. ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇప్పటివరకు ఈ వీడియోను 16 వేల మంది వీక్షించారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు తమ దైన శైలీలో స్పంధిస్తున్నారు. మరీ ఆ వీడియోను మీరు ఓసారి చూసెయ్యండి.
వీడియో..
View this post on Instagram
Also Read: కీలక నిర్ణయం తీసుకున్న ఆర్బీఐ.. ఆ బ్యాంక్ లైసెన్స్ రద్దు చేస్తున్నట్లు ప్రకటన… అయోమయంలో కస్టమర్లు..
చనిపోయిన వారి అకౌంట్లో నుంచి డబ్బులు ఎలా విత్ డ్రా చేసుకోవాలో తెలుసా.. నామినీ లేకపోతే ఎలా..