కీలక నిర్ణయం తీసుకున్న ఆర్బీఐ.. ఆ బ్యాంక్ లైసెన్స్ రద్దు చేస్తున్నట్లు ప్రకటన… అయోమయంలో కస్టమర్లు..

Reserve Bank of India: కేంద్ర రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా మరో సహకార బ్యాంక్ లైసెన్స్ ను రద్దు చేసింది.

కీలక నిర్ణయం తీసుకున్న ఆర్బీఐ.. ఆ బ్యాంక్ లైసెన్స్ రద్దు చేస్తున్నట్లు ప్రకటన... అయోమయంలో కస్టమర్లు..
Rbi
Follow us

|

Updated on: May 14, 2021 | 3:41 PM

Reserve Bank of India: కేంద్ర రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా మరో సహకార బ్యాంక్ లైసెన్స్ ను రద్దు చేసింది. పశ్చిమ బెంగాల్ సహకార బ్యాంక్ అయిన యునైటెడ్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లైసెన్స్ ను రద్దు చేసింది. ఇందుకు కారణం.. ఆ బ్యాంకులో తగినంత మూలధనం.. అలాగే మళ్లీ సంపాదించే అవకాశం లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఇక ఆర్బీఐ తీసుకున్న ఈ నిర్ణయంతో ఆ బ్యాంకులో ఉన్న డిపాజిటర్లు ఇబ్బందులు ఎదుర్కోంటున్నారు.  బ్యాంక్ లైసెన్స్ రద్దు కావడంతో ఇకపై ఆ బ్యాంక్ కార్యకలాపాలు నిర్వహించదు.

అయితే లైసెన్స్ రద్దు చేయడం.. అవసరమైన చర్యలను తీసుకోవడం గురించి 1961 డీఐసీజీసీ చట్టం ప్రకారం డిపాజిట్ దారులకు తిరిగి వారి డబ్బును అందజేయనున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. ఇక తమ కస్టమర్ల గురించి బ్యాంక్ అందించిన డేటా ప్రకారంగా మొత్తం డబ్బును అందరికి తిరిగి ఇవ్వనున్నట్లుగా ప్రకటించింది. అయితే కేంద్ర నిబంధనల ప్రకారం గరిష్టంగా రూ .5 లక్షల వరకు పరిమితి ఉంటుంది. ఈ క్రమంలోనే బ్యాంక్‌లో డబ్బులు కలిగిన వారికి డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ వారి డిపాజిట్లను అందిస్తుంది. కాగా బ్యాంక్ లైసెన్స్ రద్దు నిర్ణయం మే 13 నుంచే అమలులోకి వచ్చిందని ఆర్‌బీఐ తెలిపింది. రూ.5 లక్షలలోపు డబ్బులు కలిగిన వారికి పూర్తి డబ్బులు వెనక్కి వస్తాయి.

డిపాజిట్ ఇన్సూరెన్స్ అంటే ఏమిటి ?

బ్యాంక్ డిఫాల్డ్ లేదా రద్దు అయితే వినియోగదారుల డిపాజిట్లు సేఫ్ గానే ఉంటాయి. దీనిని డిపాజిట్ ఇన్సూరెన్స్ అంటారు. డిపాజిట్ భీమా అనేది రక్షణ కవరేజ్. ఇది బ్యాంక్ డిపాజిటర్లకు అందుబాటులో ఉంటుంది. డీఐసీజీసీ ఈ భీమాను అందిస్తుంది. ఈ సంస్థ పూర్తిగా ఆర్బీఐ యాజమాన్యంలో ఉంటుంది. అన్ని రకాల బ్యాంక్ డిపాజిట్లు డీఐసీజీసీ పరిధిలోకి వస్తాయి. వీటిలో పొదుపులు, స్థిర డిపాజిట్లు, కరెంట్ అకౌంట్లు, పునరావృత డిపాజిట్లు ఉన్నాయి. అయితే దీని పరిమితి కేవలం రూ.5 లక్షల వరకే ఉంటుంది. అంటే బ్యాంకులో రూ. 5 లక్షల రూపాయల వరకు వినియోగదారుల డిపాజిట్లు సురక్షితంగా ఉంటాయి. ఒకవేళ మీ అకౌంట్ లో మొత్తం డిపాజిట్ రూ. 5 లక్షలకు మించి ఉంటే అప్పుడు మీకు కేవలం రూ.5 లక్షల కవర్ మాత్రమే లభిస్తుంది. కొన్ని సందర్బాల్లో బ్యాంక్ దివాలా తీయడం, లైసెన్స్ రద్దు జరగడంతో రూ. 5 లక్షల వరకు కస్టమర్లకు తిరిగి ఇవ్వబడుతుంది.

Also Read: చనిపోయిన వారి అకౌంట్‏లో నుంచి డబ్బులు ఎలా విత్ డ్రా చేసుకోవాలో తెలుసా.. నామినీ లేకపోతే ఎలా..