Cryptocurrency: పునరాలోచన చేయండి..! క్రిప్టోకరెన్సీపై బ్యాంకులకు ఆర్బీఐ సూచనలు..!
RBI Informally: క్రిప్టో కరెన్సీపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది. క్రిప్టో కరెన్సీ ఎక్స్ఛేంజీలు, ట్రేడర్లతో సంబంధాలు కొనసాగించే విషయంలో మరోసారి ఆలోచించాలని బ్యాంకులకు సూచించినట్లుగా...
క్రిప్టో కరెన్సీపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది. క్రిప్టో కరెన్సీ ఎక్స్ఛేంజీలు, ట్రేడర్లతో సంబంధాలు కొనసాగించే విషయంలో మరోసారి ఆలోచించాలని బ్యాంకులకు సూచించినట్లుగా సమాచారం. క్రిప్టోకరెన్సీలపై నిషేధం విధించే దిశగా భారత్ చట్టాలు రూపొందిస్తున్న తరుణంలో ఆర్‌బీఐ ఇలా స్పందించడం పెద్ద చర్చగా మారింది. క్రిప్టోకరెన్సీతో బ్యాంకులు కలిసి పనిచేయొచ్చని సుప్రీంకోర్టు గతంలో ఆదేశాలు ఇచ్చినప్పటికీ.. క్రిప్టోకరెన్సీ ఎక్స్ఛేంజీలు, ట్రేడర్లతో సంబంధాలు రద్దు చేసుకోవాల్సిందిగా బ్యాంకులకు ఆర్‌బీఐ అనధికారికంగా చెప్పినట్లుగా తెలుస్తోంది. ఈ విషయమై ఆర్‌బీఐ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక సమాచారం రాలేదు. అయితే ఐసీఐసీఐ బ్యాంక్ ఇప్పటికే క్రిప్టోకరెన్సీ ఆధారిత చెల్లింపు లావాదేవీలు ఆపేసేందుకు నిర్ణయించినట్లు తెలుస్తున్నప్పటికీ.. ఈ విషయంపై ఐసీఐసీఐ బ్యాంకు నుంచి కూడా ఎలాంటి సమాచారం రాలేదు. యాక్సిస్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంకులు కూడా క్రిప్టోకరెన్సీ సంబంధిత లావాదేవీలను పరిమితం చేసుకునే దిశగా ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
45,700 డాలర్లకు బిట్‌కాయిన్
టెస్లా అధినేత ఎలాన్‌మస్క్ చేసిన ఒక్క ట్వీట్‌తో బిట్‌కాయిన్ విలువ 17శాతంకుపైగా పడిపోయింది. 43,000 డాలర్ల దిగువకు చేరింది. కంపెనీ వాహనాలు కొనుగోలు చేయడానికి బిట్‌కాయిన్‌లను ఇక అనుమతించబోమని గురువారం ఉదయం ఎలాన్‌మస్క్ ఓ ట్వీట్ చేయడంతో బిట్ కాయిన్‌లో పెట్టుబడులుగా పెట్టినవారు వెనక్కి తీసుకున్నారు. మార్చి 1 తర్వాత బిట్‌కాయిన్ ఇంతలా పడిపోవడం ఇదే మొదటి సారి. ఎలాన్‌మస్క్ ట్వీట్ చేసిన రెండు గంటల్లోపే ఈ స్థాయికి అది పడిపోయింది.