AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బిట్ కాయిన్ ఢమాల్.. దూసుకుపోతున్న డోజీ కాయిన్.. ఒక్క రోజులోనే ఎంత పెరిగిందో తెలుసా..

Elon Musk Tweets affect: టెస్లా అధినేత ఎలాన్ మస్క్ చేసిన ఒక్క ట్వీట్‌తో బిట్ కాయిన్ వ్యాల్యూ 45వేల డాలర్ల దిగువకు పడిపోయింది. అయితే అదే స్థానంలో మస్క్ ప్రోత్సహిస్తున్న డాగీ దూసుకుపోతోంది.

బిట్ కాయిన్ ఢమాల్.. దూసుకుపోతున్న డోజీ కాయిన్.. ఒక్క రోజులోనే ఎంత పెరిగిందో తెలుసా..
Dogecoin
Sanjay Kasula
|

Updated on: May 14, 2021 | 6:02 PM

Share

Dogecoin: టెస్లా అధినేత ఎలాన్ మస్క్ చేసిన ఒక్క ట్వీట్‌తో బిట్ కాయిన్ వ్యాల్యూ 45వేల డాలర్ల దిగువకు పడిపోయింది. కంపెనీ వాహనాలు కొనుగోలు చేయడానికి బిట్ కాయిన్స్‌ను అనుమతించబోమని గురువారం ఉదయం మస్క్ ట్వీట్ చేశాడు. దీంతో బిట్ కాయిన్ వ్యాల్యూ 17 శాతం వరకు జారిపోయింది.  మస్క్ ట్వీట్‌కు ముందు బిట్ కాయిన్ 54,819 డాలర్లు కాగా, ట్వీట్ తర్వాత 45,700 క్షీణించింది. మార్చి 1వ తేదీ తర్వాత బిట్ కాయిన్ ఇంతలా పడిపోవడం తొలి సారి.

మస్క్ ట్వీట్ చేసిన గంటల్లోనే…

మస్క్ ట్వీట్ చేసిన గంటల్లోనే బిట్ కాయిన్ వ్యాల్యూ 45వేల డాలర్ల స్థాయికి పడిపోవడంతో అంతా ఆ ప్రభావం మొత్తం క్రిప్టోకరెన్సీపై కూడుతుదని కొందరు విశ్లేషకులు అంచనా వేశారు. బిట్‌కాయిన్ ట్రాన్సాక్షన్స్ కోసం శిలాజ ఇంధనాల్ని ముఖ్యంగా ఎక్కువగా ఉద్గారాలను వెలువరిచే బొగ్గు వాడకంపై ఆందోళన చెందుతున్నామని ఎలాన్ మస్క్ ట్వీట్‌లో పేర్కొన్నారు. చాలా అంశాల్లో క్రిప్టోకరెన్సీ మంచి ఆలోచనేనని, కానీ పర్యావరణానికి ముప్పుగా మారటం సరికాదన్నారు. ఈ ఎలాన్ మస్క్ ట్వీట్ బిట్ కాయిన్ పై భారీగా పడింది.

అందుకే బిట్ కాయిన్ జంప్ తమ కార్లు కొనుగోలు చేసేవారు బిట్ కాయిన్ రూపంలో చెల్లించవచ్చునని ఎలాన్ మస్క్ ఈ ఏడాది ప్రారంభంలో ఆఫర్ చేశారు. అంతేకాదు, ఇందుకోసం 1.5 బిలియన్ డాలర్ల విలువైన పెట్టుబడులు కూడా పెట్టారు. వీటిని టెస్లా కొనుగోలు చేసింది. అప్పటి నుంచి బిట్ కాయిన్ వ్యాల్యూ భారీగా పెరిగింది. ఇది 60 వేల డాలర్ల మార్కును దాటుందని చాలా మంద్రి ఆర్ధిక నిపుణులు జోస్యం చెప్పారు. ఆ తర్వాత మాస్టర్ కార్డ్, వీసా వంటివి కూడా క్రిప్టోకు లేదా బిట్ కాయిన్‌కు అనుకూలంగా నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే.

అయితే… ఈ మధ్య ఎలాన్ మస్క్ తన ట్వీట్లలో డోజీకాయిన్ అనే క్రిప్టోకరెన్సీ గురించి పోస్టులు పెట్టడం మనం చూశాం.  మస్క్ ట్వీట్ అండతో డోజీకాయిన్ చాలా ఫేమ్ అయ్యింది. ఇదిలావుంటే.. డీజీలో పెట్టుబడులు పెట్టడం మొదలు పెట్టారు. అప్పటి నుంచి డాగీ కూాడా పరుగులు పెడుతోంది.  టెస్లా డోజీకాయిన్ చెల్లింపులను స్వీకరించవచ్చా? అని మస్క్ ఈ మధ్య ట్వీట్‌ చేశారు. దీంతో ఆయన బిట్‌కాయిన్‌కు బదులు డోజీకాయిన్‌వైపు ఫోకస్ పెట్టినట్లుగా ప్రచారం జరిగింది.  ఇక తాజాగా బిట్ కాయిన్ పడిపోవడంతో డీజీ కాయిన్ పరుగులు పెడుతోంది.

ఇవి కూడా చదవండి :  Cryptocurrency: పునరాలోచన చేయండి..! క్రిప్టోకరెన్సీపై బ్యాంకులకు ఆర్బీఐ సూచనలు..!

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి