Jio : జియో కస్టమర్లకు గుడ్‌న్యూస్..! అవుట్‌ గోయింగ్ కాల్స్ ఫ్రీ.. అదనపు రిఛార్జీ లాభాలు.. తెలుసుకోండి..

Reliance Jio : ఇండియా కొవిడ్ సెకండ్‌ వేవ్‌తో పోరాడుతుంది. ఈ సమయంలో తమ వంతుగా రిలయన్స్ జియో వినియోగదారుల

Jio : జియో కస్టమర్లకు గుడ్‌న్యూస్..! అవుట్‌ గోయింగ్ కాల్స్ ఫ్రీ.. అదనపు రిఛార్జీ లాభాలు.. తెలుసుకోండి..
Reliance Jio
Follow us
uppula Raju

|

Updated on: May 14, 2021 | 2:08 PM

Reliance Jio : ఇండియా కొవిడ్ సెకండ్‌ వేవ్‌తో పోరాడుతుంది. ఈ సమయంలో తమ వంతుగా రిలయన్స్ జియో వినియోగదారుల కోసం రెండు ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. ప్రతి ఒక్కరికి డిజిటల్ లైఫ్ అందించాలనే లక్ష్యంతో జియో పనిచేస్తుందని ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు తెలిపారు.

1. రిలయన్స్ ఫౌండేషన్‌తో కలిసి పనిచేసే జియో 300 నిమిషాల ఉచిత అవుట్‌ గోయింగ్ కాల్స్ అందిస్తుంది. మహమ్మారి కారణంగా రీఛార్జ్ చేయలేకపోయిన వినియోగదారులకు కరోనా కాలానికి 300 నిమిషాలు (రోజుకు 10 నిమిషాలు) ప్రకటించింది.

2. జియోఫోన్ వినియోగదారు రీఛార్జ్ చేసిన ప్రతి ప్లాన్.. అదే విలువతో అదనపు రీఛార్జ్ ప్లాన్‌ను ఉచితంగా పొందుతారు. ఉదాహరణకు, ₹ 75 ప్లాన్‌తో రీఛార్జ్ చేసే జియోఫోన్ వినియోగదారు , అదనపు ₹ 75 ప్లాన్‌ను పూర్తిగా ఉచితంగా పొందుతారు.

ప్రతి భారతీయుడికి డిజిటల్ జీవితాన్ని అందించే లక్ష్యంతో జియోఫోన్ ప్రారంభించబడింది. కోవిడ్ సమయంలో కస్టమర్లకు అండగా ఉండటానికి ఉచిత ఆఫర్లను ప్రకటించామని సంస్థ ప్రతినిధులు తెలిపారు. అంతేకాకుండా కరోనా వల్ల కలిగే ఇబ్బందులను తొలగించడానికి రిలయన్స్ అన్ని ప్రయత్నాలు చేస్తోందన్నారు. కొవిడ్-19 కు వ్యతిరేకంగా దేశం చేస్తున్న పోరాటానికి రిలయన్స్ కుటుంబం అండంగా ఉంటుందన్నారు.

వెంటనే ఆన్-ది-గ్రౌండ్ కార్యక్రమాలను ప్రారంభించిందన్నారు. కొరోనావైరస్ మహమ్మారి సమయంలో ఇది భారత ప్రజల బాధలను తగ్గించడానికి, వేగంగా కోలుకోవడానికి సహాయపడుతుందని తెలిపారు. వైరస్ వల్ల కలిగే ముప్పును అధిగమించడానికి రిలయన్స్ తన వనరులను, ఆక్సిజన్ సిలండర్లను కూడా సమకూర్చుతోందన్నారు.

తాజాగా ట్రాయ్ విడుద‌ల చేసిన టెలికాం యూజ‌ర్ల గణంకాల ప్ర‌కారం.. రిల‌య‌న్స్ జియో గ‌డిచిన ఫిబ్ర‌వ‌రి నెల‌లో తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాల్లో 1.48 ల‌క్ష‌ల‌కుపైగా కొత్త‌చందాదారుల‌ను సంపాదించుకుంది. ఇక ఫిబ్ర‌వ‌రి నాటికి జియో యూజ‌ర్ల సంఖ్య ఏకంగా 3.16 కోట్ల‌కు చేరింది. దీంతో 40 శాతం మార్కెట్ వాటాతో జియో మొద‌టి స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. ఇక డేటా డౌన్‌లోడ్ స్పీడ్‌లోనూ జియో అగ్ర‌స్థానంలో నిలిచింది. సెకనుకు 20.1 మెగాబిట్ వేగంతో జియో డౌన్ లోడ్ స్పీడ్ లో టాప్ లో ఉంది.

Ambulance Stopped: కనికరంలేని ఖాకీలు.. తెలంగాణ వైపు అనుమతించని అంబులెన్స్‌లు.. ఉపిరాడక దారిలోనే ఇద్దరు మృతి

PM Kisan: రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్ డబ్బుల విడుదల.. రైతుల ఖాతాల్లో నగదు జమ చేసిన మోదీ

Sputnik V: గుడ్ న్యూస్.. మరో వారంలో స్పుత్నిక్-వి వ్యాక్సిన్ అందుబాటులోకి.. ధర ఎంతో తెలుసా.?