మతిపోగొట్టే లుక్, అదిరే కాన్సెప్ట్‌తో మహీంద్రా నుంచి కొత్త ఎస్‌యూవీ.. స్పెషాలిటీస్ ఇవే
Mahindra SUV.. మహీంద్రా న్యూ జెనరేషన్ కాంపాక్ట్ ఎస్‌యూవీ డెవలప్‌మెంట్‌లో కీలక ముందడుగు వేసింది. కంపెనీ ఇటీవల ప్రదర్శించిన విజన్ ఎక్స్ కాన్సెప్ట్ ఆధారంగా రూపొందుతున్న కొత్త మోడల్‌కు సంబంధించిన డిజైన్ పేటెంట్ దాఖలైంది. ఆటో నిపుణుల అంచనా ప్రకారం రాబోయే రోజుల్లో మార్కెట్లోకి రానున్న ఈ ఆకర్షణీయమైన వాహన విశేషాలను తెలుసుకుందాం.

మహీంద్రా న్యూ జెనరేషన్ కాంపాక్ట్ ఎస్‌యూవీ డెవలప్‌మెంట్‌లో కీలక ముందడుగు వేసింది. కంపెనీ ఇటీవల ప్రదర్శించిన విజన్ ఎక్స్ కాన్సెప్ట్ ఆధారంగా రూపొందుతున్న కొత్త మోడల్‌కు సంబంధించిన డిజైన్ పేటెంట్ దాఖలైంది. ఈ పేటెంట్ ద్వారా రాబోయే ఎస్‌యూవీ డిజైన్‌పై కొన్ని కీలక వివరాలు బయటకు వచ్చాయి. పెట్రోల్, హైబ్రిడ్, ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్లకు అనుకూలంగా రూపుదిద్దుకుంటున్న నూతన ఎస్‌యూవీ టెక్ మార్కెట్‌లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఎన్యూ-ఐక్యూ మాడ్యులర్ ప్లాట్‌ఫామ్ ఆధారంగా వస్తున్న ఈ సరికొత్త డివైజ్ పూర్తి వివరాలను తెలుసుకుందాం.
నాలుగు కొత్త ఎస్‌యూవీలు..
ఆటోమొబైల్స్ నిపుణుల అంచనా ప్రకారం, ఇదే మోడల్ రానున్న రోజుల్లో నెక్ట్స్ జెనరేషన్ మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్‌ఓగా మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. మహీంద్రా ఇప్పటికే తన కొత్త ఎన్యూ-ఐక్యూ మాడ్యులర్ ప్లాట్‌ఫామ్ ఆధారంగా నాలుగు కొత్త ఎస్‌యూవీలను తీసుకురానున్నట్లు ప్రకటించింది. ఈ ప్లాట్‌ఫామ్ పెట్రోల్, హైబ్రిడ్, ఎలక్ట్రిక్ లాంటి పలు పవర్‌ట్రెయిన్లకు అనుకూలంగా రూపొందించబడింది.
అలాగే ఫ్రంట్ వీల్ డ్రైవ్, ఆల్ వీల్ డ్రైవ్ సెటప్‌లకు సపోర్టు చేస్తుంది. కొత్త ప్లాట్‌ఫామ్‌పై రానున్న తొలి మోడల్ విజన్ ఎస్ కాన్సెప్ట్ ఆధారంగా ఉంటుందని, ఆ తర్వాత విజన్ ఎక్స్ కాన్సెప్ట్ ఆధారిత కాంపాక్ట్ ఎస్‌యూవీని కంపెనీ పరిచయం చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ రెండు మోడళ్లు కూడా మహీంద్రా కొత్త డిజైన్‌ను కలిగి ఉంటాయి.
డిజైన్ పేటెంట్ ప్రకారం, కొత్త ఎస్‌యూవీ స్పోర్టీ క్రాస్‌ఓవర్ లుక్‌తో కనిపించనుంది. ముందు భాగం బలమైన డిజైన్‌తో పాటు ఎత్తైన గ్రౌండ్ క్లియరెన్స్ ఇవ్వనున్నారు. బోనెట్ లుక్, వెనుక భాగంలో కూపే స్టైల్ విండ్‌స్క్రీన్, రూఫ్ స్పాయిలర్ లాంటి అంశాలు మహీంద్రా ఇటీవల విడుదల చేసిన బీఈ సిక్స్ మోడల్‌ను గుర్తు చేస్తాయి. అలాగే ఈ ఎస్‌యూవీలో మహీంద్రా ట్విన్ పీక్స్ లోగో కనిపిస్తోంది. దీంతో ఇది కంపెనీ ఎక్స్‌యూవీ ఫ్యామిలీలో భాగంగా మార్కెట్లోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. లైటింగ్ డిజైన్, ఫాగ్ ల్యాంప్ హౌసింగ్ లాంటి అంశాల్లో కూడా ఎక్స్‌ఈవీ నైన్ ఈ నుంచి ప్రేరణ పొందినట్లు తెలుస్తోంది.
పవర్‌ట్రెయిన్ ఆప్షన్లు
కొత్త మోడల్‌లో స్క్వైర్ వీల్ ఆర్చ్‌లు, బ్లాక్ బాడీ క్లాడింగ్, ఫ్లష్ డోర్ హ్యాండిల్స్, డోర్ల మీద పవర్ ఫుల్ క్యారెక్టర్ లైన్లు లాంటి అత్యాధునిక డిజైన్ అంశాలు ఉండనున్నాయి. ఇవి ఎస్‌యూవీకి మరింత ప్రీమియం లుక్‌ను ఇవ్వనున్నాయి. ఇంజిన్ విషయానికి వస్తే, కొత్త ఎన్యూ-ఐక్యూ ప్లాట్‌ఫామ్ హైబ్రిడ్ టెక్నాలజీకి పూర్తిగా అనుకూలంగా ఉంటుందని మహీంద్రా ఇప్పటికే తెలిపింది. కంపెనీ ప్రస్తుతం 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో స్ట్రాంగ్ హైబ్రిడ్ సిస్టమ్ అభివృద్ధి చేస్తున్నట్లు సమాచారం. ఈ కొత్త పవర్‌ట్రెయిన్ విజన్ ఎక్స్ ఆధారిత ఎస్‌యూవీలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని ఆటో నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఎలక్ట్రిక్ వెర్షన్
అంతేకాకుండా, ఇదే మోడల్‌కు పూర్తిగా ఎలక్ట్రిక్ వెర్షన్‌ను కూడా తీసుకురావచ్చని భావిస్తున్నారు. దీంతో పెట్రోల్, హైబ్రిడ్, ఎలక్ట్రిక్ లాంటి మూడు రకాల ఆప్షన్స్ వినియోగదారులకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. కాంపాక్ట్ ఎస్‌యూవీ మార్కెట్లో తన ఆధిపత్యాన్ని మరింత చాటుకోవడానికి మహీంద్రా చేస్తున్న ఈ ప్రయత్నాలు ఎంతగానో దోహదపడతాయి. అత్యాధునిక హంగులతో, సరికొత్త ప్లాట్‌ఫామ్‌పై వస్తున్న ఈ మోడల్ ఆటోమొబైల్ ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అధికారిక లాంచ్ తేదీ మరియు ధరల వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి.
