PM Kisan: రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్ డబ్బుల విడుదల.. రైతుల ఖాతాల్లో నగదు జమ చేసిన మోదీ

పీఎం కిసాన్ నిధులు విడుదలయ్యాయి. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద దేశవ్యాప్తంగా అర్హులైన రైతులందరి ఖాతాల్లోకి ప్రధాని నరేంద్ర మోదీ నగదు జమ చేశారు.

PM Kisan: రైతులకు శుభవార్త..  పీఎం కిసాన్ డబ్బుల విడుదల.. రైతుల ఖాతాల్లో నగదు జమ చేసిన మోదీ
Pm Kisan Yojana
Follow us
Balaraju Goud

|

Updated on: May 14, 2021 | 12:54 PM

PM-Kisan scheme: పీఎం కిసాన్ నిధులు విడుదలయ్యాయి. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద దేశవ్యాప్తంగా అర్హులైన రైతులందరి ఖాతాల్లోకి ప్రధాని నరేంద్ర మోదీ నగదు జమ చేశారు. దేశవ్యాప్తంగా 9.5 కోట్ల మంది లబ్ధిదారులకు రూ.2వేల చొప్పున మొత్తం రూ.19,000 కోట్ల డబ్బును ఆయన డిపాజిట్ చేశారు.

ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం-కిసాన్) కింద ఎనిమిదో విడత ఆర్థిక సాయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారంనాడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విడుదల చేశారు. ఈ విడతలో రూ.19,000 కోట్లు 9.5 కోట్ల మంది లబ్ధిదారులైన రైతులకు నేరుగా వారి అకౌంట్లకు బదిలీ అవుతాయి. ఈ స్కీమ్ కింద ఒక రోజులో ఇంత పెద్ద మొత్తాన్ని చెల్లిస్తుండటం ఇదే ప్రథమం. తొలిసారి ఈ పథకం ద్వారా పశ్చిమబెంగాల్ రైతులు కూడా లబ్ధి చేకూరనుంది.

ప్రధానమంత్రి కిసాన్ నిధి పథకం పూర్తిగా కేంద్ర ప్రభుత్వ పథకం. 100 శాతం కేంద్ర ప్రభుత్వం నిధులను మంజూరు చేస్తోంది. రైతులు వేసే పంటలకు పెట్టుబడి సాయం నిమిత్తం 2019లో కేంద్రం పీఎం-కిసాన్‌ పథకాన్ని ప్రారంభించింది. అప్పటి నుంచి 5 ఎకరాల లోపు భూమి ఉన్న రైతులకు ఏడాదికి రూ.6000 పెట్టుబడి సాయాన్ని మూడు వాయిదాల్లో అందిస్తోంది. ప్రతి నాలుగు నెలలకోసారి రూ. 2వేల చొప్పున ఈ సాయాన్ని ఇస్తోంది. ఈ మొత్తం నేరుగా రైతుల ఖాతాల్లోకే బదిలీ చేస్తోంది. కిసాన్‌ సమ్మాన్‌ ద్వారా ఇప్పటివరకు రూ. 1.15 లక్షల కోట్లను అన్నదాతలకు కేంద్రప్రభుత్వం నుంచి నేరుగా సాయం అందుతోంది. ప్రస్తుతం దేశం కరోనా సంక్షోభంలో ఉన్నప్పటికీ.. రైతులు ఇబ్బందులు పడకూడదన్నఉద్దేశంతోనే పీఎం కిసాన్ నిధులను యథావిధిగా విడుదల చేసినట్లు కేంద్ర ప్రభుత్వవర్గాలు వెల్లడించాయి.

ఏటా మూడు విడతల్లో రూ.2 చొప్పున మొత్తం 6వేల రూపాయలను కేద్రం అందజేస్తోంది. డిసెంబర్ 1 నుంచి మార్చి 31 వరకు తొలి విడత, ఏప్రిల్ 1 నుంచి జూలై 31 వరకు రెండో విడత, ఆగస్ట్ 1 నుంచి నవంబర్ 30 వరకు మూడో విడత కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులను రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. మధ్యవర్తులతో ప్రమేయం లేకుండానేరుగా రైతుల బ్యాంక్ అకౌంట్లోనే డబ్బులను జమచేస్తున్నారు. ఇప్పటికే ఏడు విడతల డబ్బులను అందజేయగా.. నేడు ఎనిమిదో విడత డబ్బులను కూడా ప్రధాని మోదీ విడుదల చేశారు. అయితే, ఈ మొత్తం తమ ఖాతాల్లో పడిందా లేదా అనే విషయాన్ని రైతులు pmkisan.gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్లి చెక్ చేసుకోవచ్చు. Read Also… Australia Lift Travel ban: భారతీయ ప్రయాణికులకు ఊరట.. విమానాల రాకపోకలకు అనుమతినిచ్చిన ఆస్ట్రేలియా

శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?
బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..