Viral: డేంజరస్ డెత్ రిహార్సల్ చేసిన యువతి.. శవపేటికలో మూడు గంటల పాటు.. చివరికి ఏమైందంటే..
సమస్త జీవకోటికి మరణం అన్నది అనివార్యం.. చావు నుంచి తప్పించుకోవడం అసాధ్యం. అలాగని ప్రతి ఒక్కరికి మృత్యువంటే భయమే!..
Woman Death Rehearsal: సమస్త జీవకోటికి మరణం అన్నది అనివార్యం.. చావు నుంచి తప్పించుకోవడం అసాధ్యం. అలాగని ప్రతి ఒక్కరికి మృత్యువంటే భయమే! శ్వాస ఆగిపోయేవరకే భయం కానీ.. ఆ తర్వాత ఏమీ ఉండదు.. చనిపోయిన తర్వాత ఏమవుతుంది? బంధువులు, సన్నిహితులు ఎలా స్పందిస్తారు? సరిగ్గా ఇలాంటి సందేహాలే చిలీ దేశానికి చెందిన మైరా అలోంజోకు వచ్చింది.. తెలుసుకుంటే పోలా అని అనుకుంది.
అనుకున్నదే తడువుగా.. డెత్ రిహార్సల్‌కు అంతా సిద్ధం చేసుకుంది మైరా అలోంజో. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేసుకుని, ఓ ఫోటో గ్రాఫర్‌ను కూడా సిద్ధం చేసుకుంది. అంతేకాదు తెల్లటి దుస్తువులు ధరించి, తలపై పువ్వులు, అలాగే ముక్కులో దూదిపెట్టుకుని ఓ లగ్జరీ శవపేటికను కూడా రెడీ చేసుకుని.. శవపేటికలో పడుకుంది మైరా. దాదాపు మూడు నుంచి నాలుగు గంటల పాటు చచ్చిన శవంలా.. అలాగే పడుకుని ఉండిపోయింది.
ఈ డెత్ రిహార్సల్‌ను చేసేందుకు మొదట మైరా ఇంట్లో ఒప్పుకోలేదు. కానీ.. ఆ తర్వతకు ఒప్పుకున్నారు. అయితే ఇంకో విచిత్రమైన విషయం ఏంటంటే.. మైరా శవపేటికలో పడుకున్న తర్వాత ఆమె కుటుంబ సభ్యులు ఏడవడటం. నిజంగానే చనిపోతే ఏవిధంగా అయితే ఏడుస్తారో.. అంతకు మించిన ఏడుపులతో నానా హాంగామా చేశారు మైరా కుటుంబ సభ్యులు. ఇందుకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్స్ ఆశ్చర్యపోతూ.. మైరాపై ట్రోలింగ్స్ చేశారు.
Also Read:
కాంట్రాక్ట్ ఉద్యోగులకు జగన్ సర్కార్ తీపికబురు.. పదవీ కాలం పొడిగింపు..
వాట్సాప్‌లో సీక్రెట్ చాట్ దాచుకోండిలా.. సరికొత్త సర్వీస్ అందుబాటులోకి.. వివరాలు ఇవే.!
డేంజరస్ స్టంట్స్ చేసిన కోతి.. పులులకు గట్టి షాక్.. నవ్వులు పూయిస్తున్న వీడియో..