Publicity: ప్రచారం ఎదురు తన్నింది.. మోకాలి లోతు నీటిలో డొమినో పిజ్జా డెలివరీ.. ట్విట్టర్ లో పోస్ట్.. విమర్శిస్తున్న నెటిజన్లు!

Publicity tweet : ప్రచారం లేనిదే వ్యాపారం లేదు. అందులోనూ ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ప్రచారం ఊపందుకుని ఉంది. ప్రతి వ్యాపారానికి సోషల్ మీడియాలో ప్రత్యెక హ్యాండిల్స్.. వాటిని నిర్వహించడానికి ప్రత్యేకమైన టీమ్స్

Publicity: ప్రచారం ఎదురు తన్నింది.. మోకాలి లోతు నీటిలో డొమినో పిజ్జా డెలివరీ.. ట్విట్టర్ లో పోస్ట్.. విమర్శిస్తున్న నెటిజన్లు!
Domino
Follow us

|

Updated on: May 14, 2021 | 4:35 PM

Publicity tweet : ప్రచారం లేనిదే వ్యాపారం లేదు. అందులోనూ ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ప్రచారం ఊపందుకుని ఉంది. ప్రతి వ్యాపారానికి సోషల్ మీడియాలో ప్రత్యెక హ్యాండిల్స్.. వాటిని నిర్వహించడానికి ప్రత్యేకమైన టీమ్స్.. ఒక్కోసారి ఈ ప్రచార హోరు ఎదురుతన్నుతాయి కూడా. ఎదో చేయబోయి.. ఎదో అవుతుంది. ఇదివరకులా ఒక ప్రచారాన్ని చూసి వదిలేసే పరిస్థితి ఇప్పుడు లేదు. సోషల్ మీడియాలో ఒక్కసారి ఏదైనా పోస్ట్ చేస్తే.. అందులో ప్రజలకు ఇబ్బంది అనిపించినా అంశం చిన్నది కనిపించినా.. ఇక పోస్ట్ పెట్టినవారి పని అయిపోయినట్లే. అందులోనూ వ్యాపార ప్రకటనలా ఉండే  పోస్టులను అయితే, అసలు వదిలిపెట్టరు జనం. ఇదిగో ప్రముఖ పిడ్దా కంపెనీ డోమినో తన ట్విట్టర్ లో చేసిన ఓ ట్వీట్ ప్రచారం ఎదురు తన్నింది. ఇంతకీ, ఆ ట్వీట్ లో ఏముందంటే..

Publicity tweet : ప్రచారం లేనిదే వ్యాపారం లేదు. అందులోనూ ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ప్రచారం ఊపందుకుని ఉంది. ప్రతి వ్యాపారానికి సోషల్ మీడియాలో ప్రత్యెక హ్యాండిల్స్.. వాటిని నిర్వహించడానికి ప్రత్యేకమైన టీమ్స్వర్షం పడుతోంది.. నీటితో నిండివున్న రోడ్డు.. అందులో మోకాలి లోతు వరకూ మునిగిన నీటిలో చేతిలో డోమినో పిజ్జా బాక్స్ తో ఓ యువకుడు నుంచుని ఉన్నాడు. ఇది మే 12 న పశ్చిమ బెంగాల్ రాజధానిలోని నీటితో నిండిన వీధిలో పార్శిల్‌తో నిలబడిన డెలివరీ బాయ్ షోవోన్ ఘోష్ ఫోటో.. డొమినోస్ ఇండియా ట్విట్టర్‌లో ఆ పోస్ట్‌లో పంచుకుంది. ఇది బానే ఉంది.. కానీ, దీనికి డోమినో సంస్థ ఇచ్చిన క్యాప్షన్ ఆ కంపెనీ పరువు తీసింది. ”ఒక సైనికుడు ఎప్పుడూ విధి నుండి బయటపడడు! మా ప్రతినిధి నీలం రంగులోకి వచ్చి, కోల్‌కతా వర్షాల ద్వారా వేడి, తాజా మరియు సురక్షితమైన భోజనాన్ని శక్తివంతం చేస్తుంది! మా సిబ్బంది మిస్టర్ షోవోన్ ఘోష్ యొక్క సేవకు మేము వందనం చేస్తున్నాము, అలాంటి ప్రతికూల పరిస్థితులలో కూడా మా ఒంటరిగా ఉన్న కస్టమర్ వారి ఆహారాన్ని అందుకున్నారని నిర్ధారించుకున్నాము!” అంటూ క్యాప్షన్ పెట్టింది. కంపెనీ దానిని తనకు మంచి ప్రచారం అవుతుంది అనుకుంది. ఎంత వర్షం పడినా.. ప్రపంచం నీటిలో మునిగిపోయినా.. మా వద్ద నుంచి ఆహారం అందుతుంది.. దానిని తీసుకురావడానికి మా సిబ్బంది ఎప్పుడూ తయారుగా ఉంటారు.. అని చెప్పడం దాని ఉద్దేశ్యం. అయితే, ఈ పోస్ట్ పై ట్విట్టర్ లో జనం విరుచుకు పడుతున్నారు. “ఇది అమానవీయ ప్రవర్తన. గర్వపడటానికి ఏమీ లేదు, ”అని ఒక వినియోగదారు చెప్పారు. మరోవైపు, మరొక వ్యాఖ్య ఇలా ఉంది, “మీరు చాలా మంచి పని చేస్తున్నారు. కానీ, మేము ఆ వ్యక్తిని గౌరవిస్తున్నాం. డోమినో కని కాదు” “ఇది శ్రమను స్పష్టంగా దోపిడీ చేయడం” అంటూ అలాంటి వాతావరణ పరిస్థితుల మధ్య మనిషిని పని చేసినందుకు కంపెనీని నిందించారు. ఇక కొంతమంది అభినందనలూ చెప్పారు.

కొన్ని కామెంట్ల ట్వీట్స్ చూడండి..