Viral: పాపం.! ఆ యువతి చనిపోయింది.. ‘లవ్ యూ జిందగీ’ అంటూనే.. కన్నీరు పెట్టిస్తోన్న డాక్టర్ ట్వీట్..

ముక్కుకు ఆక్సిజన్‌ మాస్క్ పెట్టుకుని.. ఆసుపత్రి బెడ్‌పైన తనకు ఇష్టమైన 'లవ్ యూ జిందగీ' పాటను హమ్మింగ్‌ చేస్తూ ఎంజాయ్...

Viral: పాపం.! ఆ యువతి చనిపోయింది.. 'లవ్ యూ జిందగీ' అంటూనే.. కన్నీరు పెట్టిస్తోన్న డాక్టర్ ట్వీట్..
Love You Zindagi
Follow us
Ravi Kiran

| Edited By: Team Veegam

Updated on: May 14, 2021 | 5:47 PM

Viral Video Update: ముక్కుకు ఆక్సిజన్‌ మాస్క్ పెట్టుకుని.. ఆసుపత్రి బెడ్‌పైన తనకు ఇష్టమైన ‘లవ్ యూ జిందగీ’ పాటను హమ్మింగ్‌ చేస్తూ ఎంజాయ్ చేసిన యువతి గుర్తుందా.? గతవారం ఆమెకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా.. నెటిజన్లు ఆమె కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని ప్రార్ధించారు. ఆ ధీర యువతి పోరాటం ముగిసింది. కరోనా ముందు ఓడిపోయింది. ఆ ధైర్యమైన గుండె ఆగిపోయింది.

గతవారం డాక్టర్‌ మౌనిక లంగేష్‌ ఓ వీడియోను తన ట్విటర్‌ అకౌంట్‌లో పోస్ట్‌ చేశారు. ఐసీయూ బెడ్ దొరక్కపోవడంతో కరోనా సోకిన ఓ యువతికి ఎమర్జెన్సీ వార్డులో చికిత్స అందించారు సదరు ఆసుపత్రి సిబ్బంది. రెమ్‌డెసివర్, ప్లాస్మా థెరపీని సైతం అందించారు. ఇలాంటి ఆరోగ్య పరిస్థితుల్లోనూ ఆ అమ్మాయి ఏమాత్రం కుంగిపోలేదు. చిరునవ్వులు చిందిస్తూ ప్రతి ఒక్కరిలో మనోధైర్యాన్ని నింపుతూ కనిపించింది.

ఆ యువతి.. తనకు పాటలు వినాలని ఉందని డాక్టర్లకు చెప్పడంతో.. ఆమె రిక్వెస్ట్‌ మేరకు సాంగ్స్‌ను ప్లే చేస్తున్నట్లు డాక్టర్‌ మౌనిక పేర్కొంటూ అందుకు సంబంధించిన వీడియో ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు అందరూ కూడా ఆమె త్వరగా కరోనా నుంచి కోలుకోవాలని ప్రార్ధించారు.

అయితే ఆ ప్రార్ధనలు ఏవీ ఫలించలేదు. కరోనాపై పోరాటంలో ఆ ధీర యువతి ఓడిపోయింది. నాలుగు రోజుల క్రితం ఆమె పరిస్థితి విషమించడంతో ఐసీయూలో చేర్చారు. చివరికి చికిత్స పొందుతూ గురువారం తుది శ్వాస విడిచింది. ఈ విషయాన్ని డాక్టర్ మోనికా నిన్న ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ఆ ట్వీట్ చూసిన నెటిజన్లు తీవ్ర దిగ్బ్రాంతికి లోనయ్యారు. ఓ ధైర్యమైన గుండెను కోల్పోయామంటూ కామెంట్స్ పెడుతున్నారు.

Also Read:

కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు జగన్ సర్కార్ తీపికబురు.. పదవీ కాలం పొడిగింపు..

వాట్సాప్‏లో సీక్రెట్ చాట్ దాచుకోండిలా.. సరికొత్త సర్వీస్ అందుబాటులోకి.. వివరాలు ఇవే.!

డేంజరస్ స్టంట్స్ చేసిన కోతి.. పులులకు గట్టి షాక్.. నవ్వులు పూయిస్తున్న వీడియో..

గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో