Happy Eid-ul-Fitr 2021: మీ ఆత్మీయులకు ఈద్ ఉల్ ఫితర్ విషెస్ తెలియజేయండిలా.. రంజాన్ శుభాకాంక్షలు..

Happy Eid-ul-Fitr 2021: ఈద్ ఉల్ ఫితర్.. ప్రపంచ వ్యాప్తంగా ముస్లింలు అందరూ ఎంతో పవిత్రంగా జరుపుకునే పండుగ. ఈరోజు రంజాన్ మాసం ముగింపు

Happy Eid-ul-Fitr 2021: మీ ఆత్మీయులకు ఈద్ ఉల్ ఫితర్ విషెస్ తెలియజేయండిలా.. రంజాన్ శుభాకాంక్షలు..
Ramdan
Follow us
Rajitha Chanti

|

Updated on: May 14, 2021 | 7:00 AM

Happy Eid-ul-Fitr 2021: ఈద్ ఉల్ ఫితర్.. ప్రపంచ వ్యాప్తంగా ముస్లింలు అందరూ ఎంతో పవిత్రంగా జరుపుకునే పండుగ. ఈరోజు రంజాన్ మాసం ముగింపు రోజుగా జరుపుకుంటారు. ఈమాసంలో ముస్లింలు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసాలు ఉంటారు. కానీ ఈద్ ఉల్ ఫితర్ రోజున ఉపవాసం ఉండటానికి వీల్లెదు. స్లామిక్ క్యాలెండర్ ప్రకారం షావ్వాల్ నెల ప్రారంభాన్ని గుర్తించడానికి ఈ రోజును జరుపుకుంటారు. హిజ్రి చంద్ర నెల ఈద్ తేదీ తేదీకి భిన్నంగా ఉంటుంది. నెలవంకను చూసిన తర్వాత ఈ పండుగను జరుపుకుంటారు. ఈ సంవత్సరం మే 14న ఈ పండుగ వచ్చింది. ఈరోజున మీ ఆత్మీయులకు, స్నేహితులకు ఈ అందమైన కోట్స్ తో రంజాన్ శుభాకాంక్షలు చెప్పెయండిలా..

* సక్రమ మార్గంలో నడుచుకుంటూ, దేవునియందు బక్తి విశ్వాసములు కలవారికి వారి కర్మానుసారం మంచిది మరియు పవిత్రమైన జీవితం ప్రసాదించబడుతుంది. ఈద్ ముబారక్..

* అల్లా మీ అందరినీ చల్లగా చూడాలి, సుఖ శాంతులు మీ ఇంట నిత్యం నెల ఉండాలి.. మీకు మీ కుటుంబ సభ్యులకు రంజాన్ శుభాకాంక్షలు..

* క్రమ శిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయిక పవిత్ర రంజాన్ మాసం. ఈద్ ఉల్ ఫితర్ శుభాకాంక్షలు

* ఇస్లాంలో అంటరానితనం లేదు. రాజు, రైతు, ధనిక, పేద, జాతి, వర్గ బేధాలు లేకుండా అందరూ ఒకరికొకరు భుజానికి భుజం, పాదానికి పాదం కలిపి నమాజుకై రోజుకు ఐదు సార్లు నిలబడి విశ్వమానవ సోదర భావాన్ని చాటుతారు.

* ఉపవాసంతో ఆకలిదప్పులతో మనిషిని బాధించడం ఇస్లాం ఉద్దేశం కాదు. పేదవాడి ఆకలి బాధలు తెలుసుకోవడమే ముఖ్యోద్దేశం – ఖురాన్

*కూలీలతో పని చేయించుకున్నప్పుడు వారి చెమట ఆరకముందే కష్టార్జితం చెల్లించాలి – ఖురాన్

* ప్రార్థన, సంరక్షణ, ప్రేమ, చిరునవ్వు మరియు ఒకరితో ఒకరు జరుపుకునే ఈ అద్భుతమైన రోజుకు అల్లాహ్ కు కృతజ్ఞతలు..ఈద్ ముబారక్!

* May Allah accept your good deeds, forgive your transgressions and ease the suffering of all people around the globe. Eid Mubarak to you and your family!

* Eid is a day to cheer and to laugh with all your heart. It’s a day to be grateful to Allah for all of his heavenly blessings on us. Wishing you a happy Eid!

* May the light of the moon fall directly on you and Allah bless you with everything you desire today. Happy Eid!

Happy Eid

Eid

Also Read: Eid-ul-Fitr 2021: అతిపెద్ద ముస్లీం పండుగ ఈద్- ఉల్- ఫితర్.. ఈ ఫెస్టివల్‏ చరిత్ర.. ప్రాముఖ్యత గురించి తెలుసా..

Eid-ul-Fitr 2021: రంజాన్, ఈద్-ఉల్-ఫితర్‌ పండుగల కోసం మీ ఇంటిని ఇలా అందంగా అలంకరించుకోండిలా..

Ramadan 2021: రేపే రంజాన్.. నేటితో ముగియనున్న ఉపవాసాలు..నేడు సౌదీలో పర్వదినం..